Big Stories

Ayodhya Latest Update: అయోధ్య ఆలయంలో నీరు నిజంగా లీక్ అయ్యిందా? యూపీ సర్కార్ తీసుకున్న చర్యలేంటి?

- Advertisement -

ప్రధాని నరేంద్రమోడీతో సహా.. దేశంలోని అతిరథుల సమక్షంలో జరిగింది బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం.. ఇక అయోధ్య రూపురేఖలే మారిపోతాయని చెప్పారు. ఇప్పుడామాటే నిజమైంది.. సరిగ్గా ఆరు నెలల్లోనే అయోధ్య రూపురేఖలు మారిపోయాయి. రీసెంట్‌గా కురిసిన వర్షాల దెబ్బకు అక్కడి రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. ఇంటర్నెషనల్ స్టాండర్డ్స్‌తో నిర్మించిన రైల్వే స్టేషన్‌ నీటిలో మునిగిపోయింది.
రోడ్లు కుంగిపోతున్నాయి. ఏకంగా ప్రధానాలయంలోనే నీరు లీక్‌ అవుతుంది.

- Advertisement -

ఇప్పుడు మనం విన్నది అయోధ్య ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్‌ మాటలు.. ఆయన ఏమంటున్నారంటే.. ఆలయం నిర్మించి ఆరు నెలుల కూడా కాలేదు. అప్పుడే నీరు లీకవుతుంది. ఇదేం ఇంజనీరింగ్.. ఇదేం కట్టడం.. అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అధికారులు కాస్త బాధ్యతతో ప్రవర్తించకపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. నిజానికి ప్రశ్నిస్తున్నానడం కంటే నిలదీస్తున్నారనడం కరెక్టేమో..

అయోధ్య ఆలయంలో వాటర్ లీక్ అనేది నిజానికి చాలా సెన్సేషనల్ న్యూస్.. దానికున్న ప్రాముఖ్యత అలాంటిది. దీంతో అయోధ్య శ్రీరామ్‌ జన్మభూమతి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెంటనే స్పందించింది. అయోధ్య ఆలయంలో ఒక్క చుక్క కూడా వాటర్ లీక్ జరగలేదని తెలిపింది. అంతేకాదు ఆలయ పరిసరాల్లో కూడా నీరు ఎందుకు నిలిచిపోయిందో క్లారిఫై చేసింది.

ప్రధాన పూజారి చెప్పే విషయాలకు పూర్తిగా రివర్స్‌లో ఉన్నాయి. శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ చెప్పే విషయాలు.. ఆయన ఏమంటున్నారంటే.. ఆలయ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ఇంకా కొనసాగుతోంది. కేవలం మొదటి భాగం మాత్రమే ఆలయాన్ని నిర్మించిన విషయాన్ని ప్రజలు మర్చిపోవద్దన్నారు. పైన ఇంకా పనులు కొనసాగుతున్నాయి కాబట్టి.. టెంపరరీగా పైకప్పు వేశారని.. అంతేగాకుండా ఎలక్ట్రీక్ పనులు  కోసం రాళ్లకు హోల్స్‌ చేశారని. ఇప్పుడు వర్షం కారణంగా ఆ హోల్స్‌ నుంచే నీరు కారుతుందన్నారు ఆయన.

Also Read: ప్రధాని మోదీపై సోనియా కామెంట్స్.. ఓడినా, ఏమాత్రం మారలేదు..

ఇది ప్రధానాలయం పరిస్థితి.. ఇక అయోధ్యకు వెళ్లే దారుల గురించి అయితే ఎంత చెప్పుకుంటే అంత తక్కువ.. ఆలయానికి వెళ్లే పది దారుల్లో భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీన్ని బట్టే అర్థమవుతోంది రోడ్ల నిర్మాణం విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో.. అయోధ్యలో 14 కిలోమేటర్ల మేర రోడ్లపై గుంతలు పడ్డాయి. ఇక మోకాళ్లలోతు నీటితో రోడ్లు, వీధులు చెరువులను తలపించాయి. రామమందిరం సమీపంలోని నివాసాలు పూర్తిగా నీటిలో చిక్కుకుపోయాయి. దీంతో అటు స్థానికులకు, ఇటు భక్తులకు ఇబ్బందులు తప్పలేదు.

సరే ఆలయంలో జరిగే విషయాలు నిజమే అనుకుందాం.. మరి ఆలయ పరిసరాల్లో పరిస్థితులకు కారణం ఎవరు? ఇంత నిర్లక్ష్యంగా పనులు చేయడానికి రీజనేంటి? ఎవరు చేసిన తప్పులకు ఇప్పుడు స్థానికులు, భక్తులు ఇబ్బంది పడాల్సి వస్తుంది? ఈ ప్రశ్నలపైనే యోగి సర్కార్ ఫోకస్ చేసింది. అయోధ్యను చాలా సెంటిమెంట్‌గా భావించే సీఎం యోగి ఆదిత్యానాథ్ వెంటనే ఓ ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. అసలు అయోధ్యలో ఈ ఇబ్బందులకు కారణమెవరన్న దానిపై విచారణకు ఆదేశించారు. ఇంకేముంది అధికారులు వెంటనే ఏకంగా ఆరుగురు హయ్యర్ ఆఫిషియల్స్‌పై సస్పెన్షన్ వేటు వేశారు.

పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌లోని సీనియర్ అండ్ జూనియర్ ఇంజనీర్స్‌తో పాటు.. జల్‌ నిగమ్‌ డిపార్ట్‌మెంట్స్‌లోని సీనియర్ అండ్ జూనియర్ ఇంజనీర్స్‌ ఉన్నారు. వెంటనే అయోధ్యలో రోడ్లను పునరుద్దరించాలని.. నీరు నిలిచిపోకుండా చర్యలు కూడా తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఏదేమైనా అయోధ్యలో వాటర్ లీక్ అనేది ఇప్పుడు రాజకీయ అంశంగా కూడా మారిపోయింది. అయోధ్య రాముడిని తమ ప్రాపర్టీగా ఓన్ చేసుకున్న బీజేపీ నేతలు.. ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదన్న విమర్శలు మొదలయ్యాయి. తాము దేవుడని భావించే రాముడి పరిస్థితే ఇలా ఉంటే.. ఇక సామాన్య ప్రజల గురించి ఏం పట్టించుకుంటారంటన్న విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News