Big Stories

National story:‘పోక్సో’చట్టం అమలేది?

  • మహబూబ్ నగర్ పరిధిలో బాల్య వివాహం కలకలం
  • తల్లిదండ్రులే స్వయంగా జరిపించిన వైనం
  • పాఠశాలకు వెళ్లే వయసులోనే పెళ్లి జరిపించిన పెద్దలు
  • పోక్సో కింద కేసు నమోదు చేసిన పోలీసులు
  • పోక్సో చట్టం అమలు తీరు ప్రశ్నార్థకం
  • 2012 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోక్సో చట్టం
  • 12 సంవత్సరాలు గడుస్తున్నా పెండింగ్ లోనే కేసులు
  • దేశ వ్యాప్తంగా 2022 లో ‘పోక్సో’ కింద నమోదైన 47,221 కేసులు

mahaboobnagar district child marriage..POCSO Act against parents case filed

- Advertisement -

బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం అని పరిగణిస్తున్నా కూడా రాష్ట్రంలో కొన్ని చోట్ల యథేచ్ఛగా బాల్యవివాహాల అనాచారాన్ని ప్రోత్సహిస్తునే ఉన్నారు. ఆడపిల్లలను బడికి పంపకుండా వారికి పది లేక పన్నెండేళ్లు వచ్చేసరికి పెళ్లిళ్లు చేసి పంపేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఎదురు డబ్బులు తీసుకుని మరీ ఈ అనాచార వ్యవస్థను అనాదిగా కొనసాగిస్తున్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం అని తెలిసినా రాష్ట్రంలోని కొన్నిచోట్ల ఈ ఆచారాన్ని ఇంకా పాటిస్తునే ఉన్నారు. కన్నబిడ్డలను స్వయంగా తల్లిదండ్రులే సంసారం అనే ఊబిలోకి దింపుతూ వారి జీవితాన్ని కష్టాల కడలిలోకి నెడుతున్నారు. ఈ క్రమంలోనే ఆరో తరగతి చదువుతున్న ఓ బాలికను యువకుడు వివాహం చేసుకున్న ఉదంతం మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో చోటుచేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

- Advertisement -

కేసు నమోదు

గండీడ్ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బీరప్ప అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ బాలికను వివాహామాడాడు. అయితే, పాఠశాలకు వేసవి సెలవులు కావడంతో జూన్‌లో తల్లిదండ్రులు బాలికకు వివాహం జరిపించారు. ఈ క్రమంలోనే బాలిక మళ్లీ పాఠశాలకు వెళ్లగా బాలిక వాలకం చూసి పెళ్లి అయినట్లుగా గుర్తించారు. దీంతో పాఠశాల ఉపాధ్యాయులు అంతా కలిసి జిల్లా అధికారులకు సమాచారం అందజేశారు. ఈ మేరకు బాలికను విచారించిన అధికారులు.. ఆమెను స్టేట్ హోంకు తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు యువకుడు, కుటుంబ సభ్యులపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.

చట్టం ఏం చెబుతోంది

బాల్య వివాహాలను నియంత్రించడానికి నాటి బ్రిటీస్ ఇండియా ప్రభుత్వం 1929లో ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. 1930 ఏప్రిల్ నుంచి జమ్ముకశ్మీర్ తప్ప దేశమంతటా కఠిన చట్టం అమలు చేయాలని తీర్మానించారు. దీనినే ‘శారదా చట్టం’ అంటారు. ఈ చట్టం ప్రకారం బాలికల కనీస వివాహ వయస్సు 14 సం.రాలు. బాలుర కనీస వివాహ వయస్సు 18 సంవత్సరాలు. ఈ చట్టాన్ని 1978లో సవరించారు. సవరించిన చట్టం ప్రకారం బాలికల వయస్సు 18 సం.రాలు. బాలుర కనీస వివాహవయస్సు 21 సంవత్సరాలు. దేశంలో ఆడపిల్లలపై జరుగుతున్న లైంగిక నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు తద్వారా వారికి రక్షణ కల్పించేలా 2012 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పోక్సో చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.

కేంద్ర మంత్రే స్వయంగా ప్రకటన

పోక్సో చట్టం కింద 2020 సంవత్సరంలో 47,221 కేసులు నమోదయ్యాయి. అంటే 39.6% నేరారోపణ రేటుగా అప్పట్లో ప్రభుత్వం పేర్కొంది. 2020 సంవత్సరంలో 6,898 నమోదైన కేసులతో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉండగా, మహారాష్ట్ర (5,687), మధ్యప్రదేశ్ (5,648) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. డేటా ప్రకారం.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో నేరారోపణ రేటు 70.7శాతం కాగా, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో గణాంకాలు వరుసగా 30.9%, 37.2%గా ఉన్నాయి. మరోవైపు, వరుసగా మూడు సంవత్సరాలు 100% నేరారోపణ రేటు కలిగిన ఏకైక రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం మణిపూర్ కావటం గమనార్హం.2020 చివరి నాటికి 1,70,000 కేసులు విచారణ పెండింగ్ లో ఉన్నాయని, ఇది 2018 సంవత్సరానికి 1,08,129 గాను 57.4శాతం ఎక్కువగా ఉన్నాయని స్వయానా కేంద్ర మంత్రి చెప్పడం గమనార్హం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News