Big Stories

Judges Phone Tapping Case Update: ఫోన్ ట్యాపింగ్ బాధితుల లిస్ట్ లో జడ్జిలు.. తెరవెనకున్న అసలు కథేంటి?

Judges Phone Tapping Case Update: గల్లీ లీడర్ల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, విపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులు, అనుచరులు.. ఇలా స్వపక్షం, విపక్షం.. మీ, మా అనే తేడా లేకుండా అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరి ఫోన్‌ను ట్యాప్‌ చేసేశారు. అయితే ఇప్పుడీ లిస్ట్‌లో న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్టు లేటెస్ట్‌గా తేలింది. ఇంతకీ అంతులేకుండా కొనసాగుతున్న కథేంటి? తెరవెనకున్న అసలు కథేంటి?

- Advertisement -

న్యాయవ్యవస్థ.. ఇది రాజ్యాంగబద్ధంగా నడిచే ఓ ఇండిపెండెంట్ వ్యవస్థ.. ఇందులో ఎవరి ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఉండదు.. ఎలాంటి పక్షపాతాలు ఉండవు. కానీ ఇందులో కూడా వేలు పెట్టి వ్యవస్థలను తమకు అనుకూలంగా మార్చుకున్నారు బీఆర్ఎస్‌ పెద్దలు.. ఇది మేం చెప్పడం లేదు.. పోలీసులు హైకోర్టు ధర్మాసనానికి సమర్పించిన అఫిడవిట్‌లో ఉన్న సంచలన విషయాలు. కేసులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఏకంగా కోర్టులను కూడా ప్రభావితం చేశారు. దీనికి ఎగ్జాంపుల్ జస్టిస్‌ కాజా శరత్, ఆయన భార్య ఫోన్లు కూడా ట్యాప్ చేశారు.

- Advertisement -

వారిద్దరు మాత్రమే కాదు హైకోర్టు జడ్జిలు, ప్రభుత్వానికి సంబంధించిన కేసులను వాదిస్తున్న న్యాయవాదులను కూడా వదల్లేదు. ఈ వివరాలు చెప్పింది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ3గా ఉన్న నాయిని భుజంగరావు చెప్పిన విషయాలు.. అంటే బీఆర్ఎస్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడిన ప్రతిసారి వారి వ్యక్తిగత విషయాలను తెలుసుకొని.. వారిని బ్లాక్‌ మెయిల్ చేసి బెదిరించడం.. పరిస్థితులను, వ్యవస్థలను తమకు అనుకూలంగా మలుచుకున్నారని తేలిపోయింది. జడ్జిల కదలికలు, వ్యక్తిగత విషయాలపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. వారి వ్యక్తిగత జీవితంలో ఏదైనా తప్పు జరిగితే దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నది గత ప్రభుత్వ పెద్ద ఆలోచన అని తేలిపోయింది. అందుకే జడ్జిల కుటుంబ సభ్యుల ఎక్కడి వెళ్తున్నారు? ఎవరిని కలుస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు.

ఇలాంటి ప్రైవేట్ విషయాలపై దృష్టి పెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు రాకూడదనే జడ్జిలను కూడా టార్గెట్ చేశారన్నది అర్థమవుతోంది. ఆర్టీసీ ఉద్యోగుల బంద్, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చాయి. హైకోర్టు కూడా ఈ కేసుల విషయంలో గత ప్రభుత్వాన్ని తప్పు పట్టింది. ఇలాంటి కేసుల్లో ముందు ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తే భవిష్యత్‌లో ప్రజల్లో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. అందుకే న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్నది మనకు అర్థమవుతున్న విషయం.. అంటే ఎక్కడా తమకు వ్యతిరేకత అనేది బయటికి రాకూడదు. ఇదే ఆలోచన కనిపిస్తోంది ఈ ట్యాపింగ్ వ్యవహారం వెనక.

ఫోన్లు ట్యాప్‌ చేసిన వారి లిస్ట్‌ను రాస్తూ పోతే .. చాలా  టైమ్‌ పడుతుందేమో.. ఎందుకంటే ఇందులో సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే.. ముఖ్యమైన నేతలు, వారి అనుచరులు, డ్రైవర్లు.. ఆఖరికి గన్‌మెన్లు కూడా ఉన్నారు అందులో.. ఇంతా వీని వీరు ప్రజలకు ఏమైనా పనికొచ్చే పనులు చేశారా? అంటే అదీ లేదు. కమీషన్లు వసూలు చేయడం.. బీఆర్ఎస్‌ పార్టీకి డోనేషన్లు ఇచ్చేలా చేయడం.. ఇదే సాగింది పదేళ్లపాటు.. ఈ విషయాలన్ని బయటికి రావడానికి అసలు కారణం ఏంటంటే.. లెటెస్ట్‌గా మీడియాలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో జడ్జిలు కూడా బాధితులుగా ఉన్నారన్న కథనాలు వచ్చాయి. దీనిని సుమోటోగా తీసుకున్న హైకోర్టు.. కేసు వివరాలన్నింటిని తమకు అందించాలని ఆదేశించింది. దీంతో పోలీసులు అఫిడవిట్‌ సమర్పించారు. ఇప్పటికే రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు మాత్రమే ఉన్నారనుకున్న ఈ కేసులో.. బాధితులుగా న్యాయవ్యవస్థకు చెందిన వారు కూడా ఉన్నారని తేలింది.

Also Read: బీఆర్ఎస్‌కు కోలుకోలేని దెబ్బ..కాంగ్రెస్‌లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు

వ్యాపారవేత్తల నుంచి బీఆర్ఎస్‌కు ఎలక్టోరల్ బాండ్లు ఎందుకిచ్చారు? ఫోన్ ట్యాపింగ్.. న్యాయవాదులు కేసులు వాదించేందుకు ఎందుకు భయపడ్డారు? ఫోన్ ట్యాపింగ్.. అసహనం ఉన్నా కొందరు నేతలు ఎందుకు నోరెత్తలేకపోయారు. ఫోన్ ట్యాపింగ్.. విపక్ష నేతలు వేసే ప్రతి అడుగు ముందే ఎలా తెలిసి పోయింది. ఫోన్ ట్యాపింగ్.. హైకోర్టు జడ్జిలు కూడా ఆత్మరక్షణలో ఎందుకు పడాల్సి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్.. గత ప్రభుత్వంలో పెద్దలుగా చలామణిగా అయిన వారు విదేశాలకు పారిపోయింది ఎందుకు? ఫోన్ ట్యాపింగ్.. కీలక పదువుల్లో ఉన్నవారు ఇప్పుడు జైలుకు వెళ్లింది ఎందుకు? ఫోన్ ట్యాపింగ్.. ఇలా ప్రతి ఒక్క అంశానికి ముడిపడి ఉంది ఫోన్‌ ట్యాపింగ్ కేసు.. మొన్నటి వరకు ప్రభుత్వం మాత్రమే ఈ కేసుపై ఫోకస్ చేసింది.

ఇప్పుడా లిస్ట్‌లో హైకోర్టు కూడా చేరింది. అసలు కేసు విచారణ ఎక్కడి వరకు జరిగింది? ఎలా విచారించారు? తేలిందేంటి? ఇలా ప్రతి ఒక్క విషయం తమకు తెలియాల్సిందే అని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. దీంతో ఇకపై పోలీసులతో పాటు.. కోర్టు కూడా ఈ కేసుపై ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ తీసుకోవడం ఖాయమైపోయింది. మరి ఈ కేసులో విచారణ ఎక్కడి వరకు జరిగింది? ఎప్పుడు పూర్తవుతుంది? ఈ క్వశ్చన్‌కి ఆన్సర్ ఇప్పుడే ఎగ్జాక్ట్‌గా చెప్పలేం.. ఎందుకంటే ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, మరో చానల్ అధిపతి శ్రవణ్‌రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. వారిద్దరు ఇప్పుడు విదేశాల నుంచి రావాల్సి ఉంది.

వాళ్లు విచారణకు హాజరైతే ఈ కేసు ముందడుగు పడనుంది. ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్‌ సుప్రిమో అంటూ చెప్పకనే మాజీ సీఎం కేసీఆర్ పేరు చెప్పేశారు. వారిద్దరి విచారణ తర్వాత ఈ కేసు కొందరు పెద్దల మెడకుచుట్టుకోవడం ఖాయం.. కానీ ఒక్కటైతే వాస్తవం.. ఈ కేసుపై కోర్టు కూడా కొంచెం పట్టుదలతో ఉంది. ఎప్పటికప్పుడు వివరణ కోరే అవకాశం ఉంది. కాబట్టి.. ఇప్పటికే ఈ కేసు విచారణలో పరుగులు పెడుతున్న పోలీసులు.. ఆ స్పీడ్‌ను మరికొంత పెంచనున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News