Big Stories

NDA Alliance: ఇక వినాల్సిందే..! బీజేపీ దూకుడుకు కళ్లెం పడినట్టేనా..?

NDA Alliance With JDU and TDP: ఇప్పటి వరకు ఓ లెక్కా.. ఇకపై మరో లెక్క.. ఈ మూవీ డైలాగ్ ఇప్పుడు పర్‌ఫెక్ట్‌గా బీజేపీకి సూటవుతుంది. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పు దెబ్బకు.. బీజేపీ మెజార్టీ సాధించలేకపోయింది. దీంతో ఇప్పుడు టీడీపీ, జేడీయూ మద్దతు అత్యంత కీలకమైంది. మరి ఇకపై ఎన్డీఏ రూల్ ఎలా ఉండబోతుంది? ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి..? పాలన.. ఆర్థిక వ్యవస్థలో మార్పులు.. స్థితిగతుల మార్పులు.. ఇలా ప్రతి ఒక్క అంశంపై బీజేపీకి చాలా ప్రణాళికలు ఉన్నాయి.

- Advertisement -

మోడీ థర్డ్ టర్మ్‌లో చాలా మార్పులు చేయాలని ఊహించుకున్నారు. దీని కోసమే బీజేపీకి 350 సీట్లు.. టోటల్‌గా ఎన్డీఏకు 400 సీట్లు ఇవ్వాలని దేశ ప్రజలను రిక్వెస్ట్ చేశారు. బట్ అనుకున్నది జరగలేదు.. బీజేపీ కౌంట్ 240 దగ్గరే ఆగింది. టోటల్‌గా ఎన్డీఏ లెక్క చూసుకుంటే 293 దగ్గరే ఆగిపోయింది. సొంతంగా మెజార్టీ లేదు.. ప్రభుత్వం నిలవడాలంటే టీడీపీ, జేడీయూ మద్ధతు తప్పదు. సో.. ఇకపై ఇకముందులా ఉండదు.. గత రెండు టర్మ్స్‌లో ఫుల్ మెజార్టీ ఉండటంతో బీజేపీ ఆడిందే ఆట పాడిందే పాటలా సాగింది. కానీ ఇకపై అలా ఉండబోదు.. ఇది మాత్రం పక్కా.

- Advertisement -

మరి టీడీపీ, జేడీయూతో పొత్తు కీలకమవడం బీజేపీకి మేలా? చేటా? ఈ క్వశ్చన్‌కి ఇప్పుడే ఆన్సర్‌ చెప్పడం కాస్త కష్టం.. బట్.. బీజేపీ అత్యుత్సాహానికి మాత్రం బ్రేక్ పడటం ఖాయం.. ఈ ఐదేళ్లలో సంచలనాల జోలికి వెళ్లడం కుదరదు.. ఎందుకంటే ఏ నిర్ణయం తీసుకోవడానికి ముందు ఎన్డీఏ మిత్రపక్షాలతో చర్చించాల్సిందే.. అలా కాకుండా మొండిగా.. ఏకపక్షంగా ముందుకు వెళతామంటే కుదరదు. ఎందుకంటే ఈ రెండు పార్టీల మనోభావాలు ఏ మాత్రం దెబ్బతిన్నా.. మోడీ సర్కార్‌ మనుగడకే ఎసరు.. సో.. ఇకపై పరిగెత్తడం అటుంచి.. వేసే ప్రతి అడుగు ఆచి తూచి వేయాల్సి ఉంటుంది. మోడీ ఈ టర్మ్‌లో చాలా చేయాలనుకుంది. రాజ్యాంగంలో మార్పులు.. పీఓకేను స్వాధీనం చేసుకోవడం.. అందులో చాలా ముఖ్యైమైనవి.. ఇవి జరగాలంటే 400 సీట్లు మాకు కావాలి అని ఎన్నికల ప్రచారంలో చెప్పారు బీజేపీ నేతలు.. బట్ జరగలేదు.. అంటే ఇప్పుడీ రెండు పనులు అటకెక్కినట్టే అనిపిస్తోంది. ఇక వన్‌ నేషన్‌.. వన్ ఎలక్షన్.. దీనిపై కూడా మోడీ సర్కార్ ఎలా ముందుకు వెళుతుంది అనేది చూడాలి.

Also Read: Narendra Modi: మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎవరెవరు వస్తున్నారో తెలుసా..?

అయితే ఈ ఎన్నికలు ఏపీకి మాత్రం చాలా మంచి అవకాశాన్ని కల్పించాయి. ఎలా అంటారా? సింపుల్‌ బీజేపీకి ఫుల్ మెజార్టీ రాకపోవడం.. ఏపీలో టీడీపీకి ఎక్కువ సీట్లు గెలవడం.. అందుకే ఇప్పుడు NDAలో చంద్రబాబు కింగ్‌ మేకర్ అయ్యారు. NDAలో బీజేపీ తర్వాత అత్యధికంగా ఎంపీ సీట్లు గెలిచిన పార్టీ టీడీపీనే.. అందుకే చంద్రబాబు కుర్చీ మోడీ పక్కనే ఉంది.

ఇకపై బీజేపీ సర్కార్ ఏ నిర్ణయం తీసుకోవాలన్న చంద్రబాబును సంప్రదించాల్సిందే.. అభిప్రాయాలు తీసుకోవాల్సిందే.. ఆయన సరే అంటే ముందుకు.. లేదంటే ఆయనను బుజ్జగించాల్సిందే.. నిజానికి చంద్రబాబుకున్న రాజకీయ అనుభవంతో కేంద్రంలో కీలకంగా వ్యవహరించే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా రాష్ట్రపతి పదవికి ఎవరి పేరుని ప్రపోజ్ చేయాలి? కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన అవసరాలు ఏంటి? ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్.. రాష్ట్ర విభజన అంశాలు.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు.. ఇవన్నీ సాధించుకునేందుకు చంద్రబాబుకు అంది వచ్చిన అవకాశం ఇది.

Also Read: మాజీ సీఎం శివరాజ్ చౌహాన్‌కు ఢిల్లీ నుంచి పిలుపు, కాబోయే…

అంతేకాదు కేంద్రప్రభుత్వంలో కీలకమైన శాఖలను చంద్రబాబు కోరే అవకాశం ఉంది. టు బీ ఫ్యాక్ట్ అవకాశం కాదు.. డిమాండ్ అనే చెప్పాలి. 3 నుంచి 5 శాఖలు కోరే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఏ శాఖలు కేటాయిస్తారు? ఎన్ని కేబినెట్ పదవులు ఇస్తారు? ఎన్ని సహాయమంత్రి పదవులు కేటాయిస్తారు? అన్నదానిపై కొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. మొత్తంగా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీది చాలా కీలకమైన పాత్ర..

అటు నితీష్‌ కుమార్‌ది కూడా అదే పరిస్థితి.. బిహార్‌లో జేడీయూ 12 స్థానాల్లో గెలుపొందింది. ఎన్డీయే కూటమిలో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీలో జేడీయూది థర్డ్ ప్లేస్.. సో.. ఆయన కూడా చాలా కీలకంగా మారారు. అంతేకాదు నితీష్‌ కూడా బిహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన కూడా ఇప్పటికే తన డిమాండ్ల లిస్ట్‌ను బీజేపీ పెద్దల ముందు ఉంచినట్టు తెలుస్తోంది..

Also Read: Rahul Gandhi: లోక్‌సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ..తీర్మానించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ

చంద్రబాబు కావొచ్చు.. నితీష్‌ కుమార్ కావొచ్చు..ఇప్పుడు వీరిద్దరు కింగ్ మేకర్స్.. ఇది వారికి అంది వచ్చిన అవకాశం. వారి రాష్ట్రాల అభివృద్ధికి దొరికిన ఓ బ్రహ్మాస్తం ఈ చాన్స్.. మరి దానిని ఎలా ఉపయోగించుకుంటారనేది చూడాలి. ఎట్ ది సేమ్ టైమ్.. బీజేపీకి మాత్రం కాస్త సెట్ బ్యాక్.. వారి భారీ ప్రణాళికలను పక్కన పెట్టి.. నార్మల్‌ పాలనపై దృష్టి పెట్టడం ఒక్కటే మిగిలి ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News