Big Stories

Telecom Companies Increased Tariffs: టారీఫ్ లను పెంచిన టెలికాం కంపెనీలు.. సామాన్యుడి జేబుకి రీఛార్జ్‌ల చిల్లు

Telecom Companies Increased Tariffs: పడుకునే ముందు నా ఆఖరి ఆలోచనా నీవే.. లేచాక తొలి ఆలోచనా నీ గురించే.. ఇదేదే అమ్మాయి కోసం చెప్తున్న కవిత కాదు. మొబైల్ ఫోన్ గురించి ఆలోచిస్తే తట్టిన లైన్స్‌ ఇవి.. అవును.. మొబైల్‌ ఫోన్‌ ఇప్పుడో నిత్యావసరం. అందులో ఇంటర్నెట్ అంతకంటే అత్యవసరం. ఫోన్‌ లేనిదే జీవితం లేదు అనే కాన్సెప్ట్‌ నడుస్తోంది మన లైఫ్‌లో.. ఈ కాన్సెప్ట్‌ను నెమ్మదిగా మన నరనరాల్లోకి ఎక్కించి ఇప్పుడు తమపై కాసుల వర్షం కురిసేలా చేసుకున్నాయి కార్పొరేట్ కంపెనీలు. ఇంతకీ టెలికాం కంపెనీల ఎత్తుగడేంటి? అందులో మనం ఎలా చిక్కుకుపోయాం?

 

- Advertisement -

లెటెస్ట్ న్యూస్ ఏంటి.. జీయో, ఎయిర్‌టెల్, వొడాఫోన్.. ఇండియాలోని టాప్‌ టెలికాం కంపెనీలు.. ఇప్పుడీ కంపెనీలన్ని ముందే ప్లాన్ చేసుకున్నట్టుగా.. ఒకరి తర్వాత ఒకరు టారీఫ్‌ రేట్లను పెంచేశారు. ఈ పెరిగిన రేట్లన్ని జులై మూడు నుంచి అమల్లోకి రానున్నాయి. కాబట్టి.. మొబైల్ యూజర్ల అకౌంట్స్‌లో డెబిట్ అయ్యే అమౌంట్ మరింత పెరగడం ఖాయం కానుంది. మినిమమ్ 20 రూపాయల నుంచి 50 రూపాయల వరకు పెరిగాయి అన్ని టారీఫ్‌ ప్లాన్.. రోజు, నెల, మూడు నెలలు, ఒక సంవత్సరం.. ఇలా అన్‌లిమిటెడ్ వాయిస్ ప్లాన్స్, డెయిలీ డేటా ప్లాన్, డేటా యాడ్ ఆన్స్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ఇలా అన్ని కేటగిరీల్లో ధరలు పెంచేశాయి కంపెనీలు.. ఇలా అన్ని ప్లాన్స్‌పై ధరలు పెంచేశాయి టెలికాం కంపెనీలు.

- Advertisement -

ఓ ఎలుకను పట్టుకునేందుకు ఓ బోన్‌ ఏర్పాటు చేస్తాం.. అందులో దానికిష్టమైన ఫుడ్‌ను ఎరగా పెడతాం.. ఎలుక ఏం చేస్తుంది.. టెస్టీగా కనిపిస్తున్న ఎరనే చూస్తుంది కానీ బోను కనిపించదు కదా.. వస్తుంది.. చిక్కుకుంటుంది.. గింజుకుంటుంది.. ఏం చేయలేమని తెలిసి అడ్జెస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మన పరిస్థితి కూడా ఇలానే ఉంది. మరీ ఎలుకతో కంపేర్ చేశామని కొప్పడవద్దు ప్లీజ్.. మరి కార్పొరేట్ కంపెనీలు మనల్ని అలానే ట్రీట్ చేశాయి. మొదట 5జీ ఇంటర్నెట్‌ను అత్యంత తక్కువ టారీఫ్‌కు మనకు అందించాయి.

కాల్స్‌లో క్వాలిటీ పెరిగింది.. ఇంటర్నెట్‌ బ్రౌజ్‌ చేయడంలో అయితే ఓ విప్లవాత్మక మార్పు వచ్చేసింది. మనం మొబైల్ ఫోన్స్‌లోనే ఇప్పుడు హైక్వాలిటీలో మ్యాచ్‌లు, మూవీస్‌ చూసే పరిస్థితి వచ్చేసింది. ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్, ఎడ్యుకేషన్, ఆఖరికి క్రైమ్‌ చేయడానికైనా.. ఆఖరికి షాప్‌కు వెళ్లి ఓ చాక్లెట్ కొనుక్కొని పేమెంట్ చేయాలన్నా.. ఇలా దేనికైనా కావాల్సింది ఇంటర్‌నెట్.. మొత్తంగా మనకు అత్యవసరమైన నిత్యావసర వస్తువుగా ఇంటర్నెట్‌ను మార్చేశారు. కాబట్టి.. ఫస్ట్‌ స్టెప్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు. ఇక నెక్ట్స్‌ ఫేజ్‌లోకి వచ్చేశాయి టెలికాం కంపెనీలు.

4జీ, 5జీను మొదలైన టైమ్‌లో జీయో, ఎయిర్‌టెల్ రెండూ ఉచిత డేటా సేవలను అందించాలని డిసైడ్ అయ్యాయి.. అదే ఆఫర్‌ను చాలా మందికి అందించాయి కూడా.. దీంతో 5జీ డేటాను ఉపయోగించే వారి సంఖ్య చాలా వేగంగా పెరిగింది. ఏకంగా 17 శాతం 5జీ యూజర్లు పెరిగారు.. అతి త్వరలోనే ఇది 20% దాటే చాన్స్ ఉంది. కాబట్టి త్వరలోనే ఈ కంపెనీలపై కాసుల వర్షం కురవడం ఖాయమని తెలుస్తుంది. మరి కార్పొరేట్ కంపెనీలు ఏం చేబుతున్నాయి? ఎలా తమ నిర్ణయాన్ని సరైనదే అని వాదిస్తున్నాయి? టెలికాం కంపెనీలు ఏం చెబుతున్నాయంటే.. అమెరికాయ, యూరోప్ దేశాల్లో కంటే మన దగ్గర లైసెన్స్ ఫీజులు ఎక్కువగా ఉన్నాయి.

అయితే కాల్, డేటా చార్జీలు మాత్రం ఆ దేశాల కంటే తక్కవుగా ఉన్నాయి. అంటే మన దేశంలో లైసెన్స్ ఫీజ్‌ ఎక్కువ.. కాల్‌, డేటా చార్జీలు తక్కువ. దీనికి తోడు కోవిడ్ నష్టాలు తమను ఇంకా వెంటాడుతున్నాయని చెబుతున్నారు. కానీ ఇది మాత్రం అంత నమ్మేలా లేదన్నది యూజర్స్ చెబుతున్న మాట.. ఎందుకంటే వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. మొదట డిసెంబర్ 2019లో టారీఫ్‌లను పెంచాయి టెలికాం కంపెనీలు.. జీయో 2016లో లాంచ్‌ అయిన తర్వాత అప్పుడు ఫస్ట్‌ టైమ్‌ టారీఫ్‌ను పెంచింది. అప్పుడు 20 నుంచి 40 శాతం పెంచాయి కంపెనీలు. మళ్లీ ఆ తర్వాత 2021లో 20 శాతం పెరిగింది. ఆ తర్వాత ఎయిర్‌టెల్‌.. ఎంట్రీ లెవల్‌ మొబైల్ ప్లాన్స్‌ను ఏకంగా 56 శాతం పెంచింది. ఇంత పెంపు జరిగిన తర్వాత కూడా వినియోగదారుల సంఖ్య పెరిగిందే కానీ ఏమాత్రం తగ్గలేదు.

Also Read: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్త బైక్ రెడీ.. లాంచ్ డేట్, ధర, స్పెసిఫికేషన్లు ఇవే..!

నిజానికి టెలికాం రంగంలో జియో మోనోపలి చేయాలనుకుంది. జియో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఉచిత టారిఫ్‌, అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా ఆఫర్స్‌ కుమ్మరించింది. ఈ దెబ్బకు అనేక మంది వాళ్ల నెట్‌వర్క్‌ను వదిలి జియోకు షిఫ్ట్ అయ్యారు. జియో దెబ్బకు ఎయిర్‌టెల్‌ మార్కెట్ వాటా తగ్గిపోయింది. వోడాఫోన్, ఐడియా కలిసిపోయాయి. ఇక ఇతర చిన్నాచితక టెలికాం కంపెనీలు మూతపడ్డాయి. దీంతో జియో యుగం మొదలైంది. జియో దెబ్బకు ఎయిర్‌ టెల్‌ కూడా కాస్త తగ్గాల్సి వచ్చింది. మొదట్లో ఆశించిన లాభాలు లేకపోయినా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంది.

దీంతో జియో మోనోపలికి కాస్త బ్రేక్ పడినా.. దానిని ఆపేవారే లేకపోయారు. తక్కువ టారీఫ్‌ ఆశ చూపించి కావాల్సినంత కస్టమర్ల టార్గెట్‌ రీచ్‌ అయ్యాక.. ఇప్పుడు తన అసలు వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది జియో ఇక ఎయిర్‌టెల్ పరిస్థితి ఎలా తయారయ్యిందంటే జియో ధరలు పెంచడమే ఆలస్యం గంటల్లోనే ధరలు పెంచేస్తోంది. నిజానికి ఎప్పటి నుంచో ధరల పెంపు గురించి చెబుతున్నా.. ఉన్న కస్టమర్లు కూడా ఎక్కడ చేజారిపోతారో అన్న భయంతో ఎయిర్‌టెల్ ఆ సాహసం చేయలేకపోయింది. మరి ఈ రెండు సంస్థలు నష్టాల్లో ఉన్నాయా? అంటే అదీ లేదు. రెండు సంస్థలు మంచి నెట్ ప్రాఫిట్‌లోనే ఉన్నాయి. కానీ భవిష్యత్తు ప్రణాళికలు అంటూ ప్రజలపై భారం మోపుతున్నాయి.

టారీఫ్‌ ఇలా పెరిగిందో లెదో.. కొంతమంది నెటిజన్స్‌ అంబానీని టార్గెట్ చేశారు. కొడుకు పెళ్లి ఖర్చు మొత్తాన్ని మా నెత్తిపై రద్దుతున్నావా అంబానీ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ మధ్య జియో నెట్‌వర్క్‌ కూడా సరిగా ఉండటం లేదు.. మేం ఎయిర్‌టెల్‌కు షిఫ్ట్ అవుతామన్నారు. కానీ కొన్ని గంటల్లోనే ఎయిర్‌టెల్‌ కూడా జీయో రూట్‌లోనే నడిచింది. దీంతో ఇక BSNL షిఫ్ట్‌ అయిపోయేందుకు రెడీ అవ్వండి అంటూ పిలుపునిస్తున్నారు. ఇక్కడ ఇంకో న్యూస్ ఏంటంటే.. ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా BSNL 4జీ సర్వీసెస్‌ స్టార్ట్ కానున్నాయి. ఆ 5జీ ఏదో తీసుకొచ్చేయండి.. అందరం షిఫ్ట్ అయిపోతామంటున్నారు. మొత్తంగా  చూస్తే కస్టమర్స్‌ పరిస్థితి ముందు చూస్తే నుయ్యి.. వెనక చూస్తే గొయ్యి.. అన్నట్టుగా తయారైంది. ఇప్పుడు రీచార్జ్‌లు చేసుకోకుండా ఉండలేరు.. అలా అని హ్యాపీగా డబ్బు ఖర్చు చేయలేరు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News