Big Stories

High court on kcr Pition: అంత తూచ్ మేము అట్లా అనలే.. కేసీఆర్ కు హైవోల్టేజ్ షాక్

- Advertisement -

అసలు ఇసుమంతైనా అక్రమం లేదు.. మేం ఏ విచారణకైనా సిద్ధమన్నారు బీఆర్ఎస్ నేతలు ఆనాడు. తీరా జస్టిస్ నర్సింహారెడ్డి అధ్యక్షతన కమిషన్ వేస్తే అసలు అర్హతే లేదంటూ కోర్టుకెక్కారు. కమిషన్‌కు సంబంధించిన అన్ని కార్యకలాపాలు, ప్రక్రియలపై స్టే విధించాలని కోరుతూ పిటిషన్ వేశారు. జూన్ 25న ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్‌ చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు బెంచ్‌ స్టే ఇవ్వడానికి నిరాకరించడమే కాదు. ఏకంగా పిటిషన్‌నే డిస్మిస్ చేసింది. దీంతో కేసీఆర్‌కు హైఓల్టేజ్‌ షాక్‌ తగిలినట్టైంది.

- Advertisement -

హైకోర్టులో వాదనల సందర్భంగా ఏం జరిగిందనే దానిపై కాస్త డిటెయిల్స్‌లోకి వెళ్తే.. కేసీఆర్ తరపున వాదనలు ఎలా ఉన్నాయంటే.. విచారణ అంతా పొలిటికల్ ఎజెండాతోనే జరుగుతుంది. కమిషన్ తీరు చూస్తుంటే రాజకీయ దురుద్దేశంతోనే జరుగుతుంది. ప్రెస్‌ మీట్ పెట్టి జస్టిస్ నర్సింహారెడ్డి వ్యాఖ్యలు ఏకపక్షంగా ఉన్నాయి. తనకు పంపిన నోటీసులు వెంటనే రద్దు చేయాలి. ఇలా సాగాయి కేసీఆర్ తరపు న్యాయవాదుల వాదనలు.. ఇక ప్రభుత్వం తరపున కూడా ఏజీ వాదనలు వినిపించారు. కమిషన్ ఏర్పాటులో కోర్టులు కలుగజేసుకోలేవని..

ఇప్పటికే 15 మంది సాక్ష్యులను విచారించారు. కేసీఆర్‌కు కమిషన్‌ ఏప్రిల్‌లోనే నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కారణంగా టైమ్ కావాలన్నారు. కమిషన్ ఎక్కడా పక్షపాత ధోరణితో వ్యవహరించలేదు. కేసీఆర్ పిటిషన్‌కు విచారణ అర్హత లేదు. నిబంధనల ప్రకారమే కమిషన్‌ కేసీఆర్‌కు నోటీసులు పంపింది. అంటూ ఏజీ వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. కమిషన్‌ విచారణ జరిపితే తప్పేముందని తెలిపింది. అంతేకాదు కమిషన్ రిపోర్టు వస్తే అసెంబ్లీలో చర్చించవచ్చు కదా అనే అభిప్రాయాన్ని కూడా తెలిపింది. ఇది హైకోర్టులో వాదనల సందర్భంగా జరిగిన విషయం.

అసలు కేసీఆర్‌ కోర్టుకు ఎందుకు వెళ్లారు? విద్యుత్ కమిషన్ రెండు సార్లు ఆయనకు నోటీసులు ఇచ్చింది. స్వయంగా విచారణకు హాజరవ్వాలని కోరింది. కానీ ఆయన కమిషన్‌ను ఓ లెటర్ రాశారు. తమ ప్రభుత్వం అన్ని పద్ధతిగా చేసిందనీ.. ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని తెలిపారు. అంతేకాదు కమిషన్‌నే దబాయించారు.. దీంతో మరోసారి రాజకీయ దుమారం రేగింది. అదే సమయంలో ఆయన హైకోర్టుకు వెళ్లారు. ఇప్పుడు హైకోర్టు పిటిషన్‌ను కొట్టేయడంతో కమిషన్‌కు అఫిషియల్‌గా గ్రీన్ సిగ్నల్ లభించినట్టైంది. విచారణలో ఎలాంటి అడ్డంకులు ఉండవని కూడా తేలిపోయింది. హైకోర్టు నిర్ణయంతో మరోసారి కమిషన్‌ కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయడం పక్కాగా కనిపిస్తోంది.

Also Read: ఢిల్లీకి సీఎం రేవంత్, కేబినెట్ విస్తరణ కోసం.. ఆపై..

జరిగేది ఎలాగూ జరగక మానదు కానీ.. ఇక్కడ కేసీఆర్ వ్యవహరించే తీరే కాస్త గమ్మత్తుగా ఉంది. ఎందుకంటే ముందు ఆయనే తొడలు కొట్టారు దేనికైనా సిద్ధమంటూ.. ఇప్పుడేమో కంప్లీట్‌ రివర్స్‌లో వ్యవహరిస్తున్నారు. వీటన్నింటిని చూస్తుంటే ఆయన భయపడ్డట్టు క్లియర్‌గా కనిపిస్తోంది. ఏ తప్పు చేయనప్పుడు భయమెందుకు అనేది అధికార పక్ష ప్రశ్న.

ఓవరాల్‌గా చూస్తే కేసీఆర్ పరిస్థితి చూస్తే ఆయన టైమ్ అస్సలు బాగాలేనట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఓ వైపు చేజారుతున్న ఎమ్మెల్యేలు.. మరోవైపు ఇంకా తీహార్‌లోనే మగ్గిపోతున్న కూతరు కవిత.. యాక్టివ్‌గా లేని కేటీఆర్.. మరోవైపు ముంచుకొస్తున్న కేసుల ముప్పు.. ఇలా ఏ రకంగా చూసినా కేసీఆర్ టైమ్ అయితే అస్సలు బాగా లేదు.. ఇవన్నీ ఓకే కానీ.. ఈసారి కమిషన్‌ నోటీసులు ఇస్తే అయినా కేసీఆర్ రెస్పాండ్ అవుతారా? విచారణకు హాజరవుతారా? లేక మరేదైనా వంక పెట్టి డుమ్మా కొడుతారా? ఇది కేవలం విద్యుత్ కమిషన్‌ పంచాయితీ మాత్రమే.. ఇంకా కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్‌ విచారణ ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఉంది. మరి వీటి విషయంలో ఏం చేస్తారో పెద్దసారు.. చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News