Big Stories

Delhi: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇంత అరాచకం జరిగిందా? ఆప్ ప్రభుత్వం ప్రమాదంలో పడిందా?

Delhi: ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడిగా లేరు. అయినా అరెస్ట్ అయ్యారు. రిమాండ్ రిపోర్ట్స్ లో పేరుంది. ఫోన్లు మార్చారన్న అభియోగాలున్నాయి. ఇవే.. మనీష్ సిసోడియా అరెస్టుకు దారి తీశాయి. ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్న సిసోడియా అరెస్టుతో కేజ్రీవాల్ సర్కారు సంక్షోభం అంచుకు చేరింది. సీఎం కాకుండా క్యాబినెట్ లో కీలక మంత్రులు సిసోడియా, సత్యేంద్ర జైన్ ఇద్దరూ జైలుపాలయ్యారు. ఇప్పుడు ఆప్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? లిక్కర్ స్కాంలో మున్ముందు జరిగేదేంటి?

- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుస అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వంతు వచ్చింది. సీబీఐ, ఈడీ రెండూ దూకుడుగా దర్యాప్తు చేస్తున్నాయి. 2021-22 ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అంతా ముడుపులు, కమీషన్ల చుట్టే ఉందన్న ఆరోపణలతో రంగంలోకి దిగిన సీబీఐ ఒక్కో విషయాన్ని లాగుతోంది. ఇందులో మనీ లాండరింగ్ కూడా జరిగిందన్న సమాచారంతో ఈడీ కూడా ఎంక్వైరీ చేస్తోంది. సీబీఐ కొందరిని, ఈడీ మరికొందరిని ఇప్పటికే అరెస్ట్ చేసింది.

- Advertisement -

ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి నమోదైన FIRలో 15 మంది పేర్లను సీబీఐ చేర్చింది. అందులో మనీష్ సిసోడియా పేరు మొదటగా ఉంది. ఢిల్లీ లిక్కర్ పాలసీని భారీ అవకతవకలతో అమలు చేసేందుకు ప్రయత్నాలు చేశారంటూ సీబీఐ అభియోగాలు మోపింది. విజయ్ నాయర్, సమీర్ మహేంద్రు, మనోజ్ రాయ్, అమన్ దీప్ దల్ సహా మరికొందరు ఉన్నారు. గతేడాది ఆగస్ట్ లో సిసోడియా నివాసంపై సీబీఐ రెయిడ్ చేసింది. లాకర్లు తెరిచి చూసింది. అయితే అప్పట్లో ఏమీ దొరకలేదు.

ఢిల్లీ లిక్కర్ పాలసీతో ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరుగుతుందని తెలిసినా ముందుకెళ్లారని సీబీఐ అభియోగాలు మోపింది. లిక్కర్ హోమ్ డెలివరీ, తెల్లవారుజాము 3 గంటల వరకు మద్యం షాపులు ఓపెన్ చేసేలా చూడడం, లైసెన్సులు పొందిన వారికి అన్ లిమిటెడ్ డిస్కౌంట్ లు ఇచ్చుకునే అవకాశం కల్పించడం వంటివి కొత్త ఎక్సైజ్ పాలసీలో పొందు పరిచారు. మే 2, 2022న ఈ ప్రతిపాదనలు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆమోదించారు. అయితే ఈ పాలసీని స్టడీ చేసిన చీఫ్ సెక్రెటరీ.. లోపాలున్నాయంటూ తన ప్రశ్నలకు జవాబు చెప్పాలంటూ సిసోడియాకు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు, లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాకు కాపీ పంపారు. దీనిపై విచారణ జరపాలన్నారు. దీంతో అక్కడి నుంచి కథ మొదలైంది. LG అప్రూవల్ లేకుండానే మార్పులకు ఆమోదం తెలిపారని అన్నారు.

సీబీఐ రంగంలోకి దిగడంతో ఈ పాలసీకి లింక్ ఉన్న వారంతా ఒకే రోజు ఫోన్లు మార్చేశారని, ఆధారాలు దొరక్కుండా జాగ్రత్త పడ్డారని సీబీఐ పలు రిమాండ్ రిపోర్ట్స్, ఛార్జిషీట్లలో పేర్కొంది. సిసోడియా సహకరించకపోవడం వల్లే ఇప్పుడు అరెస్ట్ చేసినట్లు సీబీఐ తెలిపింది. సిసోడియా పేరు ఛార్జ్ షీట్ లో ఉన్నా.. నిందితుడిగా చేర్చలేదంటున్నారు. డిప్యూటీ సీఎం ఇతర వ్యక్తుల పేర్లమీద ఫోన్లు, ఫోన్ నెంబర్లు తీసుకున్నారని, మొత్తం 18 ఫోన్లు, 4 నెంబర్లు వాడారని సీబీఐ ఆరోపిస్తోంది. లిక్కర్ స్కాం ఇష్యూ వెలుగులోకి రాగానే ఒక్కరోజులోనే 3 ఫోన్లు మార్చారని అంటున్నారు. రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ, సిసోడియా మధ్య వాద ప్రతివాదాలు జరిగాయి. ఢిల్లీ ఎల్జీ అప్రూవల్ ఇచ్చారని సిసోడియా తరపు లాయర్ వాదించారు. ఈ పాలసీపై బహిరంగంగానే చర్చ జరిగిందని కుట్రలు ఏవీ లేవని కోర్టుకు తెలిపారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన వారు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇంకా అరెస్టులు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్సీ కవిత పేరును కూడా దర్యాప్తు సంస్థలు రిమాండ్ రిపోర్ట్ లలో ప్రస్తావించాయి. ఎన్నిసార్లు ఫోన్లు మార్చారన్న విషయాలనూ వెల్లడించాయి. సిసోడియా అరెస్ట్ మాదిరిగానే ఎమ్మెల్సీ కవిత కూడా త్వరలోనే అరెస్ట్ అవుతారంటూ బీజేపీ నేత వివేక్ వెంకట స్వామి అన్నారు.

సిసోడియా అరెస్ట్ తో ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు తెలిపింది. ప్రతిపక్షాలను ఎదుర్కోలేక ఇలాంటి కేసుల్లో ఇరికిస్తున్నారంటూ ఆరోపించారు నేతలు. ఆప్ కు కొన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. నిజానికి సిసోడియా అరెస్ట్ తో కేజ్రీవాల్ సర్కార్ లో సంక్షోభం వస్తుందా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఎందుకంటే.. ఢిల్లీ హెల్త్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ ఇప్పటికే జైలుపాలయ్యారు. ఇప్పుడు 18 శాఖలను చూస్తున్న సిసోడియా కూడా ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ గెలుపులో సిసోడియా, జైన్ కీలకంగా వ్యవహరించారు. విద్య, వైద్య రంగాల్లో సమూల మార్పులు తీసుకొచ్చారు. ఈ పాలసీలతోనే ఆప్ కు ప్రజల్లో గుర్తింపు వచ్చింది. మొహల్లా క్లినిక్స్, అలాగే కార్పొరేట్ స్కూళ్ల మాదిరి సర్కారీ స్కూళ్ల ఏర్పాటు మంచి ఫలితాలనిచ్చాయి. ప్రస్తుతం ఢిల్లీ బడ్జెట్ ను రెవెన్యూ మంత్రి కైలాశ్ గెహ్లాట్ సమర్పించే అవకాశం ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News