Big Stories

YS Jagan Request to Speaker: స్పీకర్ గారూ.. నాదొక రిక్వెస్ట్.. జగన్ వింత కోరిక..!

YS Jagan Mohan Reddy Request to AP Assembly Speaker Ayyanna Patrudu: అసెంబ్లీ స్పీకర్ కు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓ లేఖ రాశారు. ఈ లేఖ చుట్టూనే ఇప్పుడు హాట్ డిబేట్ నడుస్తోంది. అసలు ఎందుకు రాశారు.. ఎవరు చెబితే రాశారు.. అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ సరైందే అని చూసుకోలేదా.. ఇలాంటి ప్రశ్నలన్నీ తెరపైకి వస్తున్నాయి. ఒక వేలు చూపితే పది వేళ్లు అటువైపే చూపుతాయని ఆలోచించుకోలేదా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. ఎందుకంటే మాజీ సీఎం జగన్ స్పీకర్ కు రాసిన లేఖలో అలాంటి పెద్ద పెద్ద పదాలు, ప్రతిపక్ష నేతకు దక్కాల్సిన గౌరవాలు, చరిత్రలో ఏం జరిగిందన్న విషయాలను ప్రస్తావించారు. కానీ లెక్కలు చూస్తే మాత్రం సీన్ రివర్స్ అవుతున్నట్లే కనిపిస్తోంది.

- Advertisement -

అవును మాజీ సీఎం జగన్.. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారం పోయాక మరోలా రియాక్ట్ అవుతున్నారు. తాజాగా ఏపీ స్పీకర్ కు రాసిన లేఖ చూస్తే అందులోని పాయింట్స్ చాలా విచిత్రంగా ఉన్నాయంటున్నారు. ఒక సారి బ్రీఫ్ గా మాజీ సీఎం జగన్ ఏం రాశారో చూద్దాం. ఏపీ అసెంబ్లీలో వైఎస్సార్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలన్నారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు విరుద్ధమని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టున్నారని లేఖలో రాసుకొచ్చారు జగన్. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని తెలిపారు. పార్లమెంట్​ లో గానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ​లో గానీ ఈ రూల్ పాటించలేదన్నారు.

- Advertisement -

అధికార కూటమి, స్పీకర్ ఇప్పటికే తనపట్ల శత్రుత్వం ప్రదర్శిస్తున్నారని, చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయని, ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించటంలేదంటూ లేఖలో జగన్ ప్రస్తావించారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షపార్టీగా గుర్తింపుతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందన్నారు. 1984లో లోక్ సభలో 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 30 ఎంపీ సీట్లను గెలుచుకుందని, సభలో 10 శాతం సీట్లు లేకపోయినప్పటికీ అప్పుడు టీడీపీకి చెందిన పర్వతనేని ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారని చరిత్ర సంగతులను తవ్వి తీశారు మాజీ సీఎం. 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకు గాను కాంగ్రెస్ 26 సీట్లు మాత్రమే సాధించిందని, 10 శాతం సీట్లు కాంగ్రెస్​ కు లేకపోయినా పి.జనార్దన్ రెడ్డిని ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారంటూ రాసుకొచ్చారు. అంతే కాదు 2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను బీజేపీ కేవలం 3 సీట్లు సాధించినప్పటికీ ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారని గుర్తు చేశారు.

Also Read: Jagan alone in Bangalore : బెంగళూరులో ఒంటరిగా జగన్.. ఏం చేస్తున్నారు అక్కడ ?

ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 40 శాతం ఓట్లను సాధించిందని, ప్రజా సంబంధిత అంశాలపై అసెంబ్లీలో ప్రజల తరఫున ప్రాతినిథ్యం వహించాల్సిన తమపై ఉందంటున్నారు జగన్. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి తగిన సమయం లభిస్తుందని, దీనివల్ల ప్రజా సంబంధ అంశాలను సభ దృష్టికి బలంగా తీసుకురాగలుగుతారన్నారు. ప్రజల తరఫున అసెంబ్లీలో గొంతు విప్పడానికి తగిన సమయం లభించాలన్న ఉద్దేశంతో లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు. సో ఇక్కడ చాలా సమాధానం లేని పాయింట్లు తెరపైకి తెచ్చారు కూటమి నేతలు. లేఖ ద్వారా బయటపెట్టిన అంశాల్లో చాలా వరకు అవతలి పక్షాన్ని టార్గెట్ చేయడమే లక్ష్యంగా కనిపించిందన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. జగన్ స్పీకర్ కు రాసిన లేఖలో ఒక్కో అంశంపై రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు.

మాజీ సీఎం ప్రస్తావించిన దాంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే.. తనను సీఎం తర్వాత ప్రమాణస్వీకారం ఎందుకు చేయించలేదని ప్రశ్నిస్తున్నారు. మంత్రుల తర్వాత ప్రమాణస్వీకారం చేయించడం అప్రజాస్వామికం అన్నారు. సో ఇందులో అసలు పాయింట్ ఏంటంటే.. అసలు మాజీ సీఎం జగన్ ఓ ముఖ్యమైన విషయమే మర్చిపోయారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు టీడీపీ నేతలు. వైసీపీకి ఇప్పుడున్న బలం 11 మంది ఎమ్మెల్యేలు. సో ఈ 11 మందిలో ఒకరిని ఎన్నుకున్నట్లు ప్రొటెం స్పీకర్ కు ముందుగానే వైసీపీ లేఖ ఇవ్వాలి. కానీ అలా జరగలేదు. ఓటమి నుంచి తేరుకోకపోవడం వల్ల ఇలా జరిగిందా మరేంటన్నది కారణం తెలియదు. లేఖే ఇవ్వనప్పుడు జగన్ ను వైఎస్సాఆర్ సీపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడని ప్రోటెమ్ స్పీకర్ ఎలా గుర్తిస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ తెలుసుకోకుండా స్పీకర్ కు మాజీ సీఎం లేఖ రాయడమే అసంబద్ధం అని గుర్తు చేస్తున్నారు.

Also Read: జగన్ స్పీకర్‌కు లేఖ రాయడం సిగ్గు చేటు: ఎమ్మెల్యే మాధవి

నిజానికి వైసీపీ నేతలు తమ నాయకుడి ఎంపికకు సంబంధించి లేఖ ఇవ్వకపోయినా గతంలో సీఎం పదవి నిర్వహించిన కారణంగా… మంత్రుల తర్వాత ప్రమాణస్వీకారానికి పిలిచారన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అది కూటమి ప్రభుత్వం, ప్రత్యర్థి పార్టీ నేతకు ఇచ్చిన గౌరవం అని అంటున్నారు. ఇక మాజీ సీఎం జగన్ చెప్పిన విషయాల ప్రకారం ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తింపు ఇవ్వడానికి 10 శాతం సీట్ల నిబంధనపైనా కౌంటర్లు ఇస్తున్నారు. 10% సీట్లు రాకున్నా.. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే రూల్ గానీ, నిబంధన గానీ ఉందా అన్న ప్రశ్నల్ని టీడీపీ నేతలు వినిపిస్తున్నారు.

ఇందుకు కొన్ని ఉదాహరణలు కూడా చూపుతున్నారు. లోక్‌సభలో విపక్ష హోదా పొందేందుకు ఏ పార్టీ అయినా కనీసం 55 సీట్లు సంపాదించుకోవాలి. అయితే 2014లో కేవలం 44 సీట్లలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు విపక్ష హోదా ఇవ్వలేదు. దీనిపై కాంగ్రెస్ సుప్రీం కోర్టుకు వెళ్లింది. అప్పుడు అటార్నీ జనరల్ తన అభిప్రాయాన్ని సుప్రీంకు తెలియజేశారు. సరైన సంఖ్యలో అపోజిషన్ బలం లేకపోతే స్పీకర్ వారిని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాల్సిన అవసరం లేదని స్వయంగా ప్రభుత్వ అటార్నీ జనరల్ సుప్రీంకు చెప్పారు. అయితే రాజ్యాంగం లెక్కలు, ఆర్టికల్స్ సెక్షన్లు, చారిత్రక అంశాలు, సభా సంప్రదాయాలు, రూల్స్ అన్నీ పరిశీలించి అలా ఆయన తన అభిప్రాయాన్ని సుప్రీంకు తెలిపారు.

Also Read: Gottipati Ravikumar: మీ రాజకీయాలు మార్చుకోకపోతే క్రికెట్ టీం కాస్త.. వాలీబాల్ టీం అవుతుంది

అయితే ఇక్కడ ఏపీలోనూ వైసీపీకి ఇదే రూల్ వర్తిస్తుందన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మరోవైపు అయ్యన్నపాత్రుడు స్పీకర్ కాక ముందు వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు గుప్పించారు. గతంలో తనను ఎలా ఇబ్బంది పెట్టింది.. ఎంతలా వేధించారన్న విషయాలను ప్రస్తావిస్తూ కొన్ని ఘాటు కామెంట్లు చేశారు. స్పీకర్ అయ్యాక ఇదేం భాష అంటూ జగన్ కామెంట్స్ చేశారు. కానీ స్పీకర్ కాకముందు మాట్లాడిన మాటల్ని ఆ తర్వాత మాట్లాడినట్లు చెప్పడం వక్రీకరించడమే అంటున్నారు.

1984లో పర్వతనేని ఉపేంద్రకు అసలు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదన్న విషయాన్ని టీడీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు మంత్రి పయ్యావుల కేశవ్. జగన్ కేవలం మద్యం, ఇసుక ఖాతాల పుస్తకాలే కాదు. శాసన సభ, పార్లమెంటరీ నిబంధనలు కూడా చదవాలని సూచించారు. సో చరిత్రను ఎవరికి వారు అన్వయించుకోవడం కాదు.. ఏది నిజం అన్నదే ముఖ్యం. ఎవరికి ఏ హోదా ఇవ్వాలన్నది డిసైడ్ చేసేది జనమే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News