Big Stories

BRS Chapter Close : బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బ.. కారు పార్టీ దుకాణం సర్దేయాల్సిందేనా ?

BRS Chapter Close : కాంగ్రెస్‌ను ఖాళీ చేస్తాం.. ఖతం చేస్తాం. ఇవన్నీ కాదు ఆ పార్టీని బొంద తీసి పాతరేస్తాం. ఇవన్నీ గతంలో అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్‌ నోట్లో నుంచి ఊడిపడిన ఆణిముత్యాలు. సీన్‌ కట్‌ చేస్తే ఏమైంది.. కంప్లీట్‌గా రివర్సైనట్టుంది సిట్యూవేషన్. ఇప్పటికే టైర్లు పంక్చర్ అయి.. ఇంజన్‌ బోర్‌కు వచ్చిన కారు పార్టీ షెడ్డుకు చేరింది. కానీ ఉన్న అరకొర నేతలు కూడా ఇప్పుడు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారు. చూడటం కాదు.. బీఆర్ఎస్‌లో అత్యంత కీలకమైన నేత, మాజీ స్పీకర్‌ ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిపోయారు.

- Advertisement -
ఇవీ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ పార్టీ విధి విధానాలు నచ్చాయి. ప్రభుత్వ పాలసీలు ప్రజారంజకంగా ఉన్నాయి. అందుకే నేను కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకున్నానని చెప్పారు పోచారం. నిజానికి పోచారం ఇంటికి స్వయంగా వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. నేరుగా ఆయనతో మాట్లాడారు.. పార్టీలోకి ఆహ్వానించారు.. చేర్చుకున్నారు.

- Advertisement -

ఇది నిజంగా బీఆర్ఎస్‌ పార్టీకి మాములు దెబ్బ కాదు.. కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి. అయితే కథ అప్పుడే అయిపోలేదు. ఈ సీన్ జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే మరో కీలక పరిణామం జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో బీఆర్ఎస్ ఉప్పల్ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి భేటీ అయ్యారు. ఎందుకు అంటే? జానారెడ్డి పుట్టిన రోజు కావడంతో ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపానన్నారు. కాస్త వింతగా ఉంది కదా. అంటే బర్త్‌డే విషెస్ చెప్పవద్దని కాదు కానీ.. రాజకీయాల్లో ఏది అనూహ్యంగా జరగదు కదా. లక్ష్మారెడ్డి కూడా త్వరలోనే కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అయ్యారని అర్థమైపోతుంది.

శ్రీనివాస్‌ రెడ్డి, లక్ష్మారెడ్డి మాత్రమే కాదు. బీఆర్‌ఎస్‌కు చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అవుతున్నారని ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ. ఇలా చేరేవారి సంఖ్య డజనుగా ఉన్నట్టు తెలుస్తుంది. సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ లీడర్‌. ఆ ఎమ్మెల్యేలతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. కబురు పంపిన వెంటనే వారంతా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారట. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఒకరు.. ఇద్దరు ఎమ్మెల్యేల చేరికలు కాకుండా.. ఏకంగా బీఆర్ఎస్ఎల్పీ విలీనం కోసం కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య కోసం కాంగ్రెస్ ఫోకస్‌ పెట్టినట్టు కనిపిస్తుంది.

Also Read : తెలంగాణలో పెట్టుబడులు తగ్గాయంటున్న బీఆర్ఎస్.. ఇదిగో దిమ్మతిరిగే సమాధానం..

అయితే కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది గ్రేటర్‌కు చెందినవారే ఉన్నారు. వీరంతా పార్టీ మారితే వ్యక్తిగత ప్రయోజనాలతో పాటు.. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతాయే ఆశతో ఉన్నట్టు కనిపిస్తుంది. అసెంబ్లీలో బీఆర్ఎస్‌ఎల్పీ.. సీఎల్పీలో విలీనం కావాలంటే ఆ పార్టీకి ఉన్న MLAల్లో 2/3 పార్టీ మారాలి. అప్పుడే పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు. జులై రెండోవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించే ఛాన్స్‌ ఉంది. ఈ లోపే అన్నీ అనుకున్నట్టుగా జరిగితే బీఆర్ఎస్‌ఎల్పీని కాంగ్రెస్‌ శాసనసభపక్షంలో విలీనం ప్రక్రియ పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది.

మీకు గుర్తుందా అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే.. గులాబీ కండువా కప్పుకున్న చాలా మంది నేతలు చేసిన వ్యాఖ్యలు మీకు గుర్తున్నాయా ? మాట్లాడితే కాంగ్రెస్‌ సర్కార్‌ను కూల్చేస్తాం.. ఇదంతా మూన్నాళ్ల ముచ్చటే అంటూ మాట్లాడేవారు.. కానీ ఇప్పుడేమైంది.. కథ మారింది.. కూల్చడం అటుంచి.. సొంత పార్టీ నుంచి వలస వెళుతున్న నేతలను కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు కేసీఆర్. మరి ఆ టైమ్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఓ మాట చెప్పారు.. అదేంటో మీరే వినండి.

మా ప్రభుత్వాన్ని కూలగొడతామంటే ఊరుకుంటామా ? కుక్కకాటుకు చెప్పుదెబ్బ తప్పదంటూ సీఎం రేవంత్ రెడ్డి అప్పుడే చెప్పారు.. ఇప్పుడు చేసి చూపిస్తున్నారు. ఓవరాల్‌గా చూస్తే.. కార్యకర్తలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఇందులో ఓడినవారు.. గెలిచినవారు.. అంతా కారు దిగేందుకు సిద్ధంగా ఉన్నవారే. అందుకే తొందర్లోనే బీఆర్ఎస్‌ దుకాణం కంప్లీట్‌గా బంద్‌ అయ్యే అవకాశం కనిపిస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News