Big Stories

Polavaram Issue: ఏపీ జీవనాడి.. పోలవరం పంచాయతీ

AP CM Chandrababu Release White Paper On Polavaram Project: పోలవరం.. ఏపీకి జీవనాడిగా భావిస్తారు ఈ ప్రాజెక్ట్‌ను.. అప్పుడేప్పుడో మొదలై.. అనేక ప్రభుత్వాలు మారినా ఇంకా కొనసాగుతున్న ప్రాజెక్ట్ ఇది. అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఎక్కడి వరకు జరిగింది? ఇంకా ఎంత నిర్మించాల్సి ఉంది? ఏ ప్రభుత్వ హయాంలో ఎంత నిర్మాణం జరిగింది? ఎంత విధ్వంసం జరిగింది? ఇదే అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు. చార్జ్ తీసుకోగానే పోలవరంలో పర్యటించారు. ఇప్పుడు చెప్పినట్టుగానే ఏకంగా వైట్ పేపర్ రిలీజ్ చేశారు. మరి ఈ శ్వేతపత్రంలో ఏం ఉంది? వైసీపీ హయంలో పోలవరం ప్రాజెక్టులో ఏం జరిగింది? నిర్మించారా? విధ్వంసం చేశారా? అంటే ఎలాంటి తడబాటు లేకుండా విధ్వంసమే జరిగిందటున్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.

- Advertisement -

వైసీపీ పాలనలో రాష్ట్రం నాశనమైందని.. అందులో పోలవరం కూడా భాగమే అన్నారు. 2019లో సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన రోజే.. పోలవరం నిర్మాణం ఆపేయాలని ఆదేశాలిచ్చారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఓ పద్ధతి ప్రకారం ప్రాజెక్టను నాశనం చేశారన్నది చంద్రబాబు మాట. మొదట ఆధారాలు లేని ఆరోపణలతో కాంట్రాక్టర్‌ను మార్చారు. ఆ తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో మరింత నాశనమైందన్నారు. అసలు ఏజెన్సీని మార్చకపోతే ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తయ్యేదన్నారు చంద్రబాబు.

- Advertisement -

2014 నుంచి 2019 మధ్య.. అంటే నవ్యాంధ్రప్రదేశ్‌ తొలి సీఎంగా చంద్రబాబు ఉన్న టైమ్‌లో ఏకంగా 72 శాతం ప్రాజెక్ట్‌ను పూర్తి చేశామన్నారు చంద్రబాబు. అదే వైసీపీ హయాంలో జరిగిన ప్రాజెక్ట్ పనులు జస్ట్ 3.84 పర్సెంట్ మాత్రమే.. ప్రాజెక్ట్ భౌగోళిక పరిస్థితులు మారాయి. 80 కోట్లతో నిర్మించిన గైడ్ బండ్ నిరుపయోగంగా మారింది.. కుంగిపోయింది. కేంద్రం ఇచ్చిన నిధుల్లో 3 వేల 385 కోట్లు మళ్లించారు. టీడీపీ హయాంలో ప్రశంసలు వస్తే.. వైసీపీ హయంలో నిపుణుల నుంచి చీవాట్లు వచ్చాయి. జగన్ సర్కార్ నిర్లక్ష్యంతో 4వేల 900 కోట్ల నష్టం జరగడంతో పాటు.. ఖర్చు 38 శాతం పెరిగింది. అంతేగాకుండా విద్యుత్ ఉత్పత్తిని కోల్పోయాం. అదో 3 వేల కోట్ల నష్టం.. ఇలా అనేక అంశాలను వివరించారు చంద్రబాబు.

Also Read: కొండగట్టు ఆంజన్న సన్నిధికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్.. భారీగా ఏర్పాట్లు

అయితే ఇదంతా గతం.. మరి భవిష్యత్తులో ఏం జరగబోతుంది? ప్రాజెక్ట్‌ను ఎలా కంప్లీట్ చేయనుంది కూటమి ప్రభుత్వం. ఈ ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తై.. పరవళ్లు తొక్కుతుందా? ఈ ప్రశ్నలకు పూర్తవుతుందన్న సమాధానం చెబుతున్నారు చంద్రబాబు. పోలవరంలో జరిగిన డ్యామేజీని కవర్ చేసేందుకు అనేక చర్యలు తీసుకోనున్నారు చంద్రబాబు. అమెరికా, కెనడా నుంచి నిపుణులను రప్పిస్తామన్నారు. అంతేకాదు కేంద్రం మద్ధతు తీసుకొని సవాళ్లను అధిగమిస్తామన్నారు. ప్రాజెక్ట్ కట్టడం కంటే రిపేర్లు చేయడమే కొంచెం కష్టమైన పని అంటున్నారు చంద్రబాబు. అంతేకాదు అర్హత లేని వారికి పదవులు దక్కితే పరిస్థితి ఎలా ఉంటుందో అంబటి మాటలను చూస్తే అర్థమవుతుందంటున్నారు చంద్రబాబు.

గత పాలనలో భారీ నీటి పారుదల శాఖమంత్రి అయిన అంబటి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు చంద్రబాబు.. అందుకే ప్రాజెక్ట్ పూర్తి కాలేదని.. మంత్రికే అర్థం కాకపోతే ఎలా అంటూ కౌంటర్లు వేశారు. అంతేకాదు మాజీసీఎం జగన్‌కు సంబంధించిన వీడియోలను కూడా ప్లే చేశారు చంద్రబాబు.. తాము మాత్రం వీలైనంత త్వరలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామన్నారు చంద్రబాబు.. అయితే రిపేర్లకే అధికంగా ఖర్చు అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇది టైమ్ టేకింగ్‌తో పాటు.. ఆర్థికంగా కూడా భారీగానే భారం పడే పరిస్థితులు ఉన్నాయి. మరి వీటిని చంద్రబాబు ఎలా అధిగమిస్తారో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News