Big Stories

YSRCP Leaders: ఓటమిపై నిజం ఒప్పుకోని వైసీపీ నేతలు.. అదే కారణమంటూ కొత్త పల్లవి..!

YSRCP Leaders Said EVM’s Tampered on AP Elections 2024 Results : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో అధికార వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. అయినా ఆ పార్టీ నేతల్లో ఎలాంటి మార్పురాలేదు. పార్టీ ఓటమికి కుంటిసాకులు వెతికే పనిలో పడ్డారు నేతలు. ప్రజా తీర్పును అంగీకరించలేకపోతున్నారు. ఓటమిని వేరేవాళ్ల పైపు నెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

- Advertisement -

తమ పార్టీ ఎందుకు ఓడిపోయిందో కొందరు నేతలు మీడియా ముందుకొచ్చి ఓపెన్‌గా చెప్పేశారు. ఎమ్మెల్యే లు అయిన మాకే, ముఖ్యమంత్రిని కలిసి అవకాశం రాలేదని మనసులోని మాట బయటపెట్టారు. రోజుల తరబడి విజయవాడలో మకాం వేయాల్సి వచ్చిందని ఆవేదనను వ్యక్తంచేశారు. జగన్ చుట్టూ కోటరీయే దీనికి కారణమని గొంతెత్తారు. ఓడిపోయిన నేతల్లో ఒకవంతు మంది నేతలు గడిచిన ఐదేళ్లలో ఏం జరిగిందో చెప్పారు.

- Advertisement -

రెండు వంతుల మంది మాత్రం ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యిందనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు ఈ జాబితాలోకి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా చేరిపోయారు. పక్కాగా గెలుస్తామని భావించిన 80 నియోజకవర్గాల్లో వెనుకబడ్డామని అంటున్నారు. కేతిరెడ్డి కామెంట్స్‌పై అప్పుడే సోషల్ మీడియాలో సెటైర్లు పడిపోతున్నాయి.

ఈవీఎంలు ట్యాంపరింగ్ విషయం 2019 ఎన్నికల్లో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ఎత్తకముందే టీడీపీ అరాచకాలకు పాల్పడుతుందని చెప్పడం కూడా వైసీపీ నేతలకే చెల్లిందని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. గురువారం సాయంత్రం ఆరుగంటలకు కోడ్ ఎత్తేసింది ఎన్నికల సంఘం. అంతకుముందే ఏపీలో టీడీపీ అరాచకం మొదలైందని వైసీపీ నేతలు చెప్పడం ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా అని అంటున్నారు.

ALSO READ:  మోదీ కేబినెట్‌లోకి టీడీపీ, కొత్త ఫార్ములా అప్లై…

ఎన్నికల కోడ్ నేపథ్యంలో మంగళవారం నుంచి ఇప్పటివరకు అధినేత చంద్రబాబు అధికారులను కలవ లేదని, శుభాకాంక్షలు చెప్పడానికి కొంతమంది మాత్రమే వచ్చారని అంటున్నారు. ఈ చిన్న లాజిక్‌ను వైసీసీ ఎలా మిస్సయ్యిందని అంటున్నారు. గతంలో కూడా ప్రతీదాన్ని భూతద్దంలో చూపించారని, ఓడిపోయినా బుద్ది మారలేదంటూ వైసీపీలోని కొందరు నేతలు బహిరంగంగా చెప్పడం కొనమెరుపు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News