Big Stories

YS Sharmila On YSRCP: వైసీపీ విలీనమవుతుందా? ఇంకిపోతుందా?

YS Sharmila Key Comments On YSRCP Merge In Congress Party are Goes Viral: పిల్ల కాలువలన్నీ మహాసముద్రంలో విలీనం కావాల్సిందేనని షర్మిల చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. వైసీపీలో గుబులు రేపాయి. వైసీపీని ఉద్దేశించి షర్మిల ఈ కామెంట్స్ చేశారు. చిన్ని చిన్న పార్టీలన్నీ మహా సముద్రం లాంటి కాంగ్రెస్ లో విలీనం కావాల్సిందేనని ఆమె అన్నారు. అయితే, జగన్ మొండితనం చూసిన వారెవరూ ఆయన తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని అనుకోరు. మరి షర్మిల ఎందుకు ఈ కామెంట్స్ చేశారనే విషయపై పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పిల్ల కాలువలు సముద్రంలో కలవాల్సిందే అంటూనే షర్మిల మరో మాట కూడా చెప్పారు. ఒకవేళ ఆ పిల్లకాలువలు ఎండిపోతే ఇంకేం చేయలేమని కూడా అన్నారు. అంటే.. కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఏపీలో కాంగ్రెస్ బలపడటానికి చాలా అవకాశాలున్నాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలంగా కనిపిస్తోంది. 2029లో కేంద్రంలో అధికారం చేతులు మారడం ఖాయంగా కనిపిస్తోంది.

- Advertisement -

కాంగ్రెస్ చాలా రాష్ట్రాల్లో ఊహించని సీట్లు గెలుచుకుంది. నార్త్ లో హస్తం పార్టీ బలపడింది. మరోవైపు సౌత్‌లో కూడా తన బలాన్ని గతం కంటే పెంచుకుంది. ఇక తెలంగాణ, కర్నాటకలో అధికారంలో ఉంది. కాబట్టి ఏపీలో  పార్టీ బలపడటానికి అవకాశం ఉంది. వైసీపీ నేతలు చాలా మంది పక్క చూపులు చూస్తున్నారు. అయితే, టీడీపీ ఇప్పటికే  ఓవర్ లోడ్ అయింది. కొత్త వారిని చేర్చుకుంటే కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జనసేన, బీజేపీలో వైసీపీ నేతలు చేరే ప్రయత్నం చేసినా.. ఆ పార్టీల్లో ఉండేవాళ్లు ఎంతవరకు అంగీకరిస్తారో చెప్పలేం. ఎందుకంటే గత ఐదేళ్లలో వైసీపీ దాడులును ఫేస్ చేసిన జనసేన, బీజేపీ నేతలు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

అంతేకానీ.. వైసీపీ నేతలను పార్టీల్లో చేర్చుకోవడానికి సిద్ధంగా లేరు. ఒకవేళ వైసీపీ నేతలు బీజేపీ, జనసేనలో చేరినా.. ఓట్ బ్యాంక్ వారితోపాటే సిఫ్ట్ అయ్యే అవకాశం తక్కువ. బీజేపీ, జనసేనను ఆదరించే ఓట్ బ్యాంక్ వేరు. వైసీపీని ఆదరించే ఓట్ బ్యాంక్ వేరు. కాబట్టి.. వైసీపీ నేతలు పార్టీలు మారినా.. ఓటర్లు మాత్రం వైసీపీతోనే ఉంటారు. కానీ.. అదే వైసీపీ నేతలు కాంగ్రెస్ లో చేరితే.. ఓటర్లు కూడా సిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. దీంతో.. కాంగ్రెస్ పార్టీ వైసీపీపై ఫోకస్ చేసింది. అయితే.. కాంగ్రెస్ అగ్రనేతలు వైసీపీని విలీనం చేయమని అడుగుతారా? అంటే ఆ ఛాన్స్ లేదు. స్వయంగా జగనే వచ్చి డీల్ కుదుర్చుకునేలా చేస్తారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

మొదట వైసీసీ నేతలను ఆకర్షించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీసీ శ్రేణులు కాంగ్రెస్ చేరే అవకాశం ఉంది. ఏపీలో అధికార పార్టీ నుంచి కేసులను ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ లాంటి బలమైన పార్టీ అవసరమని అనుకునే ఛాన్స్ ఉంది. అందుకే వైసీపీ లీడర్లు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరితే.. జగన్ ఆటోమేటిక్‌గా డీల్ కుదుర్చుకోవడానికి వస్తారని కాంగ్రెస్‌ ఆలోచనగా తెలుస్తోంది. అదే జరిగితే షర్మిల చెప్పినట్టు పిల్ల కాలువ మహాసముద్రంలో కలిసినట్టే అవుతోంది. జగన్ ఒప్పందానికి రాకపోతే.. అదే పిల్ల కాలువ ఇంకిపోతుంది. అంటే.. షర్మిల రెండు ఆప్షన్లు చెప్పారు. ఆ రెండింటిలో ఏది జరిగినా హ్యాపీ అని కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు ఉంది.

Also Read: అమరావతిలో సీఎం చంద్రబాబు.. ప్రజావేదిక శిథిలాల పరిశీలన

అయితే.. ఇక్కడ ఇంకో అనుమానం కూడా ఉంది. జగన్‌పై పైచేయి సాధించడానికే షర్మిల కాంగ్రెస్‌లో చేరిందనేది జగమెరిగిన వాస్తవం. అలాంటప్పుడు.. కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయితే.. షర్మిల మళ్లీ వెనకబడే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే.. కాంగ్రెస్ అధిష్టానం జగన్‌కే ఏపీ  బాధ్యతలు అప్పగిస్తుంది. మరి దీన్ని షర్మిల ఒప్పుకుంటారా? అంటే అనుమామే. అందుకే.. షర్మిల చాలా వ్యూహాత్మకంగా మాట్లాడారని కొందరు అంటున్నారు.

జగన్ కు మొండితనం, ఈగో ఎక్కువ అని చాలా మంది అంటూ ఉంటారు. ఆ ఈగోనే షర్మిల టచ్ చేశారు. వైసీపీ ఎప్పటికైనా కాంగ్రెస్‌లో విలీనం కావాల్సిందేనని అనడంతో.. జగన్ ఈగో మరింత హర్ట్ అవుతుంది. దీంతో.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన కాంగ్రెస్‌లో విలీనానికి ఒప్పుకునే అవకాశం లేదు. దీంతో.. ఆపరేషన్ ఆకర్ష పేరుతో వైసీసీ నేతలను కాంగ్రెస్ లో చేర్చుకొని జగన్ ని దూరం పెడితే.. పార్టీలో తన పలుకుబడికి ఇబ్బంది ఉండదని షర్మిల అనుకుంటున్నారని టక్ వినిపిస్తుంది. షర్మిల, కాంగ్రెస్ ఆలోచనలు ఎలా ఉన్నా.. వైసీపీకి మాత్రం మూడిందని చాలా మంది అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News