Big Stories

YS Jagan Comments: జగన్ కొత్త పలుకులు.. షాక్ లో వైసీపీ

- Advertisement -

పోనీ.. పోనీ.. పోతే పోనీ..
సతుల్, సుతుల్, హితుల్ పోనీ..
వస్తే రానీ.. కష్టాల్‌, నష్టాల్, కోపాల్, తాపాల్, శాపాల్..
వస్తే రానీ.. తిట్లూ, రాట్లూ, పాట్లూ..
ఏంటీ మహా ప్రస్థానంలోని శ్రీశ్రీగారి కవిత చెప్తున్నానుకుంటున్నారా.. ఆ మహానుభావుడు ఆ కాలంలో ఏ కాంటెక్ట్స్‌లో చెప్పారో కానీ.. ఇప్పుడీ మాటలను వంట పంటించుకున్నట్టు కనిపిస్తోంది మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్.. అవును శ్రీశ్రీ కవితకు.. జగన్‌ ఆలోచన విధానానికి ఇప్పుడు పర్‌ఫెక్ట్ సింక్‌ కనిపిస్తోంది.

- Advertisement -

వెళ్లిపోవాలనుకునే వారిని ఎంతమందిని ఆపగలం.. ఎంతకాలమని ఆపగలం. అది వారి ఇష్టం.. అది వారి విలువలు, నైతికతకు సంబంధించినవి.. ఉండే వాళ్లు ఉంటారు.. పోయే వాళ్లు పోతారు.. దానికి మనమేం చేయగలం. ఇదీ ఇప్పుడు తన పార్టీ నేతలతో జగన్ చెబుతున్న మాటలు.. ఆయన మాటల్లో కాస్త వైరాగ్యం కనిపిస్తోంది. ఉన్న పార్టీ నేతలు కూడా వెళ్లిపోతారన్న భయం, బాధ కనిపిస్తోంది. ఇప్పుడీ మాటలను ఎలా రిసీవ్ చేసుకోవాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారు వైసీపీ నేతలు. బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చిన వైఎస్ జగన్.. మళ్లీ పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. నిజానికి ఇది సంతోషించాల్సిన విషయమే.. ఇటీవల తనను కలిసిన నేతలతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

ఎన్నికల్లో దారుణ ఓటమిని ఆయన ఇంకా పూర్తిగా డైజెస్ట్ చేసుకున్నట్టు లేదు. కానీ ఇంతలోనే ఉన్న నేతలు కూడా పార్టీ మారుతారన్న ప్రచారం ఇప్పటికే మొదలైంది. అయితే జగన్‌ వ్యాఖ్యలను కాస్త డీకోడ్ చేస్తే అర్థమైన విషయం ఏంటంటే.. ప్రస్తుతం శాసనసభలో వైసీపీ పెద్దగా చేసేదేం లేదు. ఎందుకంటే కేవలం 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. అందుకే తన శాసనమండలిని తన బ్యాటిల్ గ్రౌండ్‌గా మార్చుకున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే మండలిలో మరికొన్నేళ్లపాటు వైసీపీదే పైచేయి. టీడీపీ అసెంబ్లీలో ఎంత తమ నిర్ణయాలను ఎంత సునాయాసంగా అమలు చేస్తుందో మండలిలో మాత్రం దాని పాచికలు పారే అవకాశం లేదు. అందుకే టీడీపీ నేతలు వైసీపీ ఎమ్మెల్సీలపై ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది.

ఇప్పటికే కొందరు వైసీపీ ఎమ్మెల్సీలకు టీడీపీ నుంచి ఫోన్లు వచ్చినట్టు తెలుస్తోంది. కొంతమంది వేళ్లేందుకు కూడా సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని కూడా జగన్‌ స్వయంగా పార్టీ నేతలతో చెప్పినట్టు తెలుస్తోంది. కాబట్టి.. ఆయన కూడా మానసికంగా సిట్యూవేషన్స్‌ను ఫేస్‌ చేసేందుకు రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది. నిజానికి ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ చేసిన వ్యాఖ్యలు గుర్తున్నాయా? ఇంత కష్టపడి పనిచేశాక కూడా వచ్చిన రిజల్ట్ చూసి హిమాలయాలకు వెళ్లిపోతామన్నారు. షాక్‌లో నుంచి బయటికి రావడానికి రెండు మూడు రోజులు పట్టిందన్నారు. కానీ 40 శాతం మంది ప్రజలు మనకు ఓటేశారు. అది చూశాకే సీట్లు రాకపోయినా వారి కోసం నిలబడి పోరాడాలని డిసైడ్‌ అయ్యానని అందుకే కోలుకోగలిగానని చెప్పారు.

నిజానికి జగన్ వైరాగ్యానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి సీట్ల సంఖ్య 151 నుంచి 11కు పడిపోవడం.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడం. ప్రశ్నించే అధికారం పూర్తిగా కోల్పోవడం. గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఎంత మంది ఉంటారో.. ఎంత మంది పోతారో తెలియని పరిస్థితి ఏర్పడటం..అంతో ఇంతో సంఖ్యా బలం ఉన్న ఎమ్మెల్సీల్లో కూడా ఎంత మంది ఉంటారో.. వీడుతారో తెలియని పరిస్థితి రావడం. తమ ఆయువుపట్టు అనుకున్న రాయలసీమ కేవలం ఐదు సీట్లు మాత్రమే రావడం. ఒకప్పుడు క్లీన్‌ స్వీప్‌ చేసిన జిల్లాల్లో కనీసం ఒక్క సీటు కూడా రాకపోవడం. ఇలా ప్రతి విషయం ఆయన మనసుకు ముళ్లులా గుచ్చుకుంటున్నాయి. అందుకే జగన్‌ ప్రస్తుతం వైరాగ్యపు స్టేజ్‌లోకి వెళ్లిపోయారు.

Also Read: టీడీపీ ఆఫీసు ధ్వంసం కేసు, అప్పిరెడ్డి ముందస్తు బెయిల్ కోసం..

ఇవీకాక.. ప్రస్తుతం జగన్‌ ప్రజల్లోకి వెళ్లే అవకాశం లేదు. ఏ సమస్య మీద పోరాటం చేసే అవకాశం లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించి, నిలదీసే అవకాశం ఇప్పుడప్పుడే కనిపించడం లేదు. అందుకే జగన్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదు.. ఈలోపు కూటమి ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. అగ్రెసివ్‌గా వెళ్లకుండా పర్‌ఫెక్ట్‌గా జగన్‌ ప్రభుత్వ నిర్ణయాలను కార్నర్ చేస్తోంది. ప్రతి దానికి ప్రూఫ్స్‌ చూపిస్తూ ముందుకు వెళుతుంది. దీంతో ప్రజల్లో జగన్ ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజల్లో వ్యతిరేకత ఇంకా పెరుగుతుందే తప్ప.. ఎక్కడా తగ్గడం లేదు. దీంతో జగన్‌కు ఇప్పుడు భేటీలు, ఓదార్పులు తప్ప మరో ఆప్షన్ కనపడటం లేదు.

అలర్లు, ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో అరెస్టైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైలులో పరామర్శించిన సందర్బంగా జగన్ చేసిన వ్యాఖ్యలివి. పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టి.. కావాలనే జైలులో పెట్టారని ఆరోపించారు జగన్.. రిగ్గింగ్ చేస్తూ అన్యాయం చేస్తున్నారనే ఈవీఎంను బద్ధలు కొట్టారని వెనకేసుకొచ్చారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని.. ఆస్తులు ధ్వంసం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అంతేకాదు ఇదే సందర్భంగా సీఎం చంద్రబాబుకు వార్నింగ్‌ ఇచ్చారు జగన్.. అదేంటో మీరూ వినేయండి. ఈ రాజకీయం ఎలా ఉన్నా.. ప్రస్తుతానికి జగన్ ముందు ఇంతకు మించిన ఆప్షన్స్‌ అయితే కనిపించడం లేదు. తమ కార్యకర్తలు, నేతలపై దాడులనే తన అస్త్రంగా మలుచుకొని జనాల్లోకి వచ్చే ప్రయత్నమైతే జరుగుతోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News