Big Stories

YS Jagan Master Plan: యూటర్న్ తీసుకున్న జగన్.. స్పీకర్ ఎన్నికలో బీజేపీకి మద్దతు!

YS Jagan Mohan Reddy Supports to BJP: ప్రపంచంలో అతిపెద్ద క్రీడా సంగ్రామం.. వెన్నుపోటుకు, కత్తిపోటుకు కేరాఫ్ అడ్రస్.. అదే రాజకీయ రంగస్థలం. అందులో ఏమైనా పాజిబులే.. ఒకరికేమో.. ఆ ఇద్దరూ మిత్రులే.. ఆ ఇద్దరికీ మాత్రం ఒకరంటే ఒకరికి పడదు. ఇది.. ప్రస్తుతం కేంద్రంతో ముడిపడి ఉన్న ఏపీ రాజకీయ ముఖచిత్రం. ఇక టైమింగ్‌.. రైమింగ్‌ ఆపి.. అసలు విషయానికొస్తే.. నిన్నటివరకు తిట్టుకున్న నోళ్లు ఒక్కటవుతాయి. కొట్టుకున్న చేతులు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాయి. ప్రస్తుతం ఇదే పంథాను ఫాలో అవుతోంది వైసీపీ. లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక సందర్భంగా ఆ పార్టీ ఓపెన్‌ అయిపోయింది. మళ్లీ కన్ఫ్యూజన్ లో పడేశామా..?

- Advertisement -

ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాడే పాలిటిషీయన్‌.. ఎన్నికల ముందు వరకు ఈ సామెత కరెక్ట్ గా సెట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు వచ్చేశాయి.. అలాంటప్పుడు జగన్ తన రూట్ ఎందుకు మార్చుకున్నారు. ఉన్నపళంగా పెద్దన్న సపోర్ట్ ఎందుకు కోరుకుంటున్నట్టు? ఎందుకంటే మొన్ననే ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అంటే తరువాత.. ఐదేళ్ల వరకు జగన్ సర్వైవ్ కావాలి.. ఏటూ చూసినా అందుకున్న ఏకైక ఆప్షన్.. కేంద్రం.. అంటే మోడీ.

- Advertisement -

కూటమిపై ఎన్నికల ప్రచారంలో లెక్కలేనన్ని విమర్శనాస్త్రాలు సంధించారు జగన్.. అలాంటి జగన్.. ఇప్పుడు స్నేహహస్తం అందించాడు. తాను మీవాడినేనని చెప్పేశాడు. స్పీకర్‌ ఎన్నిక సందర్భంగా ఔట్‌రైట్‌గా NDAకు సపోర్ట్‌ చేశారు. జగన్‌ ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? మోడీకి సపోర్ట్‌ చేయకపోతే మళ్లీ జైలుపాలు కావాల్సిందేనా.? అందుకే జగన్‌ NDAకు జై కొట్టాడు అనుకోవచ్చా. అవును.. కచ్చితంగా అంతే. లేదంటే బ్యాక్‌ టు శ్రీకృష్ణ జన్మస్థలం అన్నది జగనెరిగిన సత్యం.

Also Read: పిన్నెల్లి అరెస్ట్‌పై ఈసీ ప్రకటన, విఘాతం కలిగిస్తే శిక్ష తప్పదు..

జగన్ సీఎం కాకముందు అక్రమాస్తుల కేసులో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండేవారు. దాదాపు 11 సీబీఐ కేసులు, 9ఈడీ కేసుల్లో ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. జగన్ సీఎంగా ఉన్న టైంలో కోర్టుకు అటెండ్ కాలేదు. ఎందుకంటే పాలనాపరంగా బిజీగా ఉంటాడు కాబట్టి కోర్టు రిలాక్సేషన్ ఇచ్చింది. ఇప్పుడు సాధారణ MLA మాత్రమే. పైగా ఆ కేసులు మళ్లీ విచారణకు వస్తున్నాయట. అలాంటప్పుడు జగన్ మళ్లీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందేనని టాక్ నడుస్తోంది. అసలే అధికారం కోల్పోయి.. పైగా ప్రతిపక్ష హోదా లేకుండా నరకం అనుభవిస్తున్నాడు. ఇదే టైంలో మళ్లీ ఆ కేసులు తిరగదొడితే జగన్ పరిస్థితి మాటలకందనిది. అందుకే కేంద్రంలో మోడీని ప్రసన్నం చేసుకోవడమే శరణ్యం. లోక్ సభ స్పీకర్ ఎన్నిక సందర్భంగా జగన్ చేసిందీ అదే.

అక్రమాస్తుల కేసులో జగన్ గతంలో జైలు శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత నుంచి బీజేపీకి అనుకూలంగా నడుచుకుంటూనే ఉన్నాడు. 2014లో ప్రతిపక్షంలో ఉన్నా ఏనాడూ NDA కూటమిని పల్లెత్తు మాట అనలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాడు. ఇక అప్పుడు బయటా.. లోపలా.. మోడీ నామస్వరమే జపించాడు. ఏపీలో మొన్న జరిగిన ఎన్నికల్లో ఒకవేళ జగన్ గెలిచి ఉన్నా.. మళ్లీ సపోర్ట్ ఇచ్చేవాడు. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఈ సారి ఆ కూటమిలో టీడీపీ ఉండటంతో జగన్ సపోర్ట్ NDAకి ఉంటుందా అనే సందేహాలు వెలువెత్తాయి. కానీ జగన్ మాత్రం.. తన మద్దతు మళ్లీ నమోకేనని స్పీకర్ ఎన్నికతో చెప్పేశాడు. ఇలా ఊహించిన.. ఊహించని ట్విస్ట్ ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

Also Read: Jagan alone in Bangalore : బెంగళూరులో ఒంటరిగా జగన్.. ఏం చేస్తున్నారు అక్కడ ?

ఇలా మోడీకి మద్దతు తెలపడం వెనక అసలు స్కెచ్ ఇంకోటి ఉందట. పాత కేసులు తిరగదోడవు అనేది ఒకటయితే.. రాష్ట్రంలో చంద్రబాబు కూడా తనకు ఎదురుగా ఎలాంటి డేరింగ్ స్టెప్ వేయడు అనేది జగన్ అంచనాగా అర్థమవుతోంది. మొత్తంగా జగన్ భయపడ్డాడు అని అనుకోవాలా.. లేక పొలిటికల్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అనుకోవాలా. మోడీకి వాస్తవానికి జగన్ సపోర్ట్ అవసరం కూడా లేదు. ఎందుకంటే NDA కూటమికి సరిపడా బలం ఉంది. అలా అని జగన్ ను వదులుకుంటే.. అది ప్రతిపక్షాలకు బలంగా మారే అవకాశం లేకపోలేదు. అందుకే మోడీని జగన్ ఫెవికాల్లా అంటిపెట్టుకుంటూనే ఉంటారన్నమాట. మరి ఈ విషయంలో టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే..

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News