Big Stories

AP Legislative Council: మండలిలో గట్టిగా పోరాడండి.. ఎమ్మెల్సీలకు జగన్ కీలక ఆదేశాలు!

YS Jagan Key instructions to YCP MLC’s(AP political news): ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవ్వడం.. ఇది పాత కాలం సామెత.. కాని ఇది ఏపీ పాలిటిక్స్‌కు పర్‌ఫెక్ట్‌గా సూటవుతుంది. టీడీపీ, వైసీపీ అసెంబ్లీ సీట్ల సంఖ్య విషయంలో కావొచ్చు.. మండలి రద్దు అంశం కావొచ్చు.. ఈ సామెత పర్‌ఫెక్ట్‌గా సూటవుతుంది. ఎందుకంటే నాడు జగన్ మండలిని వద్దు అన్నారు. అసలు మొత్తానికే రద్దు అన్నారు. కానీ నేడు ఆ మండలే ఆయనకు దిక్కైంది. ఆఖరి పోరాటం చేయడానికి కేరాఫ్‌ అయ్యింది. పరిస్థితులు ఎంత దారుణంగా మారతాయంటే.. ఒకప్పుడు ఏ అసెంబ్లీ వేదికగా అయితే జగన్‌ టీడీపీ నేతలను ఎగతాళి చేశారో.. ఇప్పుడు ఆయనకు మైక్‌ దొరికే అవకాశం కూడా లేకుండా చేశారు ప్రజలు. కనీసం వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అందుకే ఆయన మండలిపై ఫోకస్ చేశారు.

- Advertisement -

రీజన్‌.. ఆయనకు మండలిలో తిరుగులేని మెజారిటీ ఉంది. మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58 ఇందులో వైసీపీకి ఉన్న ఎమ్మెల్సీల సంఖ్య 38.. ఇక టెక్నికల్‌గా ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన కొందరు వైసీపీ నేతల బలాన్ని కలిపితే.. వైసీపీ మొత్తం బలం 42. ఎట్ ది సేమ్ టైమ్‌ టీడీపీ ఎమ్మెల్సీల సంఖ్య జస్ట్.. 8 మాత్రమే.. మరో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మండలిలో వైసీపీ మరో నాలుగేళ్ల పాటు ఈ ఆధిక్యం కొనసాగించగలదు.. ఇది బ్రీఫ్‌గా మండలి లెక్క.

- Advertisement -

అయితే ఇప్పుడు 2019లో ఏ సిట్యూవేషన్స్ అయితే ఉన్నాయో.. ఇప్పుడవే సిట్యూవేషన్‌ కంటిన్యూ అవుతోంది. కాని మైనర్‌ చేంజేస్ ఉన్నాయంతే.. అప్పుడు వైసీపీ.. ఇప్పుడు టీడీపీ.. 2019లో టీడీపీ దారుణంగా ఓడిపోయినప్పుడు ఆ ఆ పార్టీకి 28 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. దీంతో కీలక బిల్లులను టీడీపీ సక్సెస్‌ఫుల్‌గా అడ్డుకుంది. జగన్ ఎత్తుగడలను చిత్తు చేయగలిగింది. వైసీపీ తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లులను మండలిలో అడ్డుకుంది టీడీపీ. దీంతో ఆయన మొత్తం మండలినే రద్దు చేయాలని డిసైడ్ అయ్యారు. కేంద్రానికి సిఫారసు చేస్తూ తీర్మానాన్ని కూడా ఆమోదించారు. అసలు మండలి ఎందుకు.. ఉత్త డబ్బు దండగా తప్ప.. ప్రజల సొమ్మును వృథా చేస్తున్నాం. తమకు పూర్తి మెజారిటీ వస్తుందని తెలిసినా రద్దు చేయాలని నిర్ణయించాం. అంటూ ఏమెమో మాటలు చెప్పారు. మండలి.. శుద్ధ దండగా అంటూ అసెంబ్లీలో స్పీచ్‌ కూడా ఇచ్చారు.

కానీ ఏమైంది.. కేంద్రం ఆ తర్మానంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలా పెండింగ్‌లో ఉంచేసింది. ఇలా చూస్తుండగానే టైమ్ గడిచి పోయింది. వైసీపీకి ఫుల్ మెజార్టీ వచ్చింది. మండలి రద్దు తీర్మానాన్ని వెనక్కి తీసుకున్నారు. జగన్‌ ఏ ప్లేస్‌లో అయితే మండలి వేస్ట్‌ అన్నారో.. అదే ప్లేస్‌లో అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మండలి ఆవశ్యకతను వివరించి వెనక్కి తీసుకున్నారు. మళ్లీ టైమ్‌ గిర్రున తిరిగింది. ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. ఇప్పుడు మళ్లీ ఆ పార్టీకి మండలీనే దిక్కైంది. మరి ఇప్పుడు ఏం జరుగబోతుంది? అనేది కాస్త ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Also Read: టీటీడీ ఈవోగా శ్యామలరావు నియామకం

మండలిలో పరిస్థితులు వైసీపీకే పూర్తి అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు టీడీపీకి 28 మంది ఎమ్మెల్సీలు ఉంటేనే వైసీపీ సర్కార్‌కు మూడు చెరువుల నీళ్లు తాగించారు. మరి ఇప్పుడు వైసీపీకి ఏకంగా 38 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. మరి ఇప్పుడు వీరు ఏం చేస్తారనేది చూడాలి. ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్‌ రద్దుపై ఇప్పటికే సీఎం చంద్రబాబు సంతకం చేశారు. త్వరలో ఇది అసెంబ్లీ ముందుకు రానుంది. అక్కడ ఈజీగానే పాసైపోతుంది. అయితే చిక్కంత ఇప్పుడు మండలిలోనే.. ఈ యాక్ట్‌ను రద్దు చేయడాన్ని కంప్లీట్‌గా వ్యతిరేకిస్తుంది వైసీపీ. సో ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయన్నది చూడాలి.

మండలి విషయంలో చంద్రబాబు ఏం చేస్తారు? జగన్‌ బాటలోనే నడిచి శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయిస్తారా? ఇలాంటి సంక్షోభాలను డీల్‌ చేయడంలో అపార అనుభవం ఉన్న చంద్రబాబు ఆ నిర్ణయాన్ని తీసుకోరు. కానీ ఇప్పుడు కాస్త ఓపిక పడితే చాలా మంది రాజకీయ నిరుద్యోగులకు.. మండలిలో స్థానం కల్పించడానికి అవకాశం ఉంటుంది. కానీ అప్పటి వరకు వైసీపీని భరించడం కష్టం అనుకుంటే మాత్రం ఫిరాయింపులు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మంది ఎమ్మెల్సీలు వైసీపీలో ఉంటే భవిష్యత్తు లేదని భావిస్తూ.. ఇప్పటికే పార్టీ జంప్‌ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అందరిని కాకపోయినా.. అవసరమైన సంఖ్యలో ఎమ్మెల్సీలను లాగేస్తే మాత్రం టీడీపీ హాయిగా ఉండొచ్చు.

కానీ ఒకటి మాత్రం నిజం.. ఆనాడు నాకు వద్దు.. రద్దు అంటూ చెప్పిన జగన్‌కు.. ఈనాడు అదే మండలి దిక్కైంది. అంతో ఇంతో పోరాడటానికి స్థలాన్ని ఇచ్చింది. అందుకే అధికారం ఉంది కదా అని ఎప్పుడూ రెచ్చిపోవద్దు.. మాట జారవద్దు. లేదంటే ఇలాంటి అవమానాలే ఎదురవుతాయి. ఇప్పుడు టీడీపీ నేతలు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుంటే మంచిది. లేదంటే మళ్లీ ఇవే సీన్స్ వాళ్లకి కూడా ఎదురుకాక తప్పదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News