Big Stories

Jagan: ఎవరూ అధైర్యపడొద్దు.. రాబోయే కాలం మనదే: జగన్

Jagan Mohan Reddy latest news(Political news in AP): ఎవరూ అధైర్యపడొద్దు.. రాబోయే కాలం మనదే.. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందామంటూ కార్యకర్తలకు, నాయకులకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. మూడు రోజులపాటు సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించిన ఆయన భవిష్యత్ కార్యాచరణలో భాగంగా పార్టీ శ్రేణులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.

- Advertisement -

‘మన ప్రభుత్వ హయాంలో చెప్పినవన్నీ చేశాం. రాష్ట్రంలో ప్రతీ కుటుంబంలో మనం చేసిన మంచి ఉంది.. ఎప్పటికీ ఉంటది. అందుకే ప్రజలకు మన పైనే విశ్వాసం ఉంది. భవిష్యత్ మనదే. ప్రజాశ్రేయస్సు కోసం నిరంతరం మన పార్టీ శ్రేణులు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందాం. మళ్లీ మనకు మంచి రోజులు వస్తాయి’ అని జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

- Advertisement -

అదేవిధంగా పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ నేతలతో కూడా ఆయన చర్చించారు. ‘నాయకులు, కార్యకర్తలు ఎవరూ కూడా అధైర్యపడొద్దు. పార్టీ అండంగా ఉంటుంది. అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్దాం. రానున్న కాలంలో ప్రతీ కార్యకర్తకు పార్టీ తోడుగా ఉంటుంది. అదేవిధంగా కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలి’ అంటూ ప్రజాప్రతినిధులకు జగన్ సూచించారు.

పులివెందుల పర్యటనలో భాగంగా జగన్ కు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం లభించింది. మూడు రోజులపాటు భాకరాపురంలోని క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, అభిమానులతో జగన్ మమేకమయ్యారు. ఈ సందర్భంగా అందరినీ పేరుపేరునా పలకరిస్తూ వారి కష్టాసుఖాలను అడిగి తెలుసుకున్నారు.

Also Read: జగన్ బెంగుళూరుకి వెళ్తున్నారా? గాలితో మంతనాలు?

ఇదిలా ఉంటే.. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా పులివెందులకు వెళ్లడంపై కూటమి నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజలు 11 స్థానాల్లో అవకాశం కల్పించినా కూడా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా ప్రజాస్వామ్యాన్ని అగౌరపరుస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News