Big Stories

YSRCP Double Game : పార్లమెంట్ సాక్షిగా.. వైసీపీ, బీజేపీ డబుల్ గేమ్

YSRCP latest news today(Andhra pradesh political news): అసెంబ్లీలో జగన్‌ని గౌరవించలేదు. ప్రతిపక్షపార్టీకి ఏపీ అసెంబ్లీలో విలువలేదని వైసీపీ నేతలు కామెంట్స్ చేశారు. చేస్తూనే ఉన్నారు. మంత్రుల తర్వాత జగన్ తో ప్రమాణ స్వీకారం చేయించడం వైసీపీ నేతలకు నచ్చలేదు. నిజానికి ప్రొటోకాల్ ప్రకారం.. ఓ ప్రతిపక్ష నేత ప్రమాణ స్వీకారం సీఎం తర్వాత చేయించాలి. కానీ, వైసీపీకి ప్రతిపక్షహోదా కూడా రాలేదు. ఆయన్ని ఓ ఎమ్మెల్యేగా మాత్రమే గుర్తించాలి. అలా చూసుకుంటే.. సీఎం, మంత్రుల తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరగాలి.

- Advertisement -

అయితే.. చంద్రబాబు, ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి కలిసి జగన్ కు తగిన గౌవరం ఇచ్చారు. సీఎం, మంత్రుల తర్వాత జగన్ చేత ప్రమాణం చేయించారు. కానీ, ఆ గౌరవాన్ని ఆయన నిలబెట్టుకోలేదు. సీఎం తర్వాత తమ నేతతో ఎందుకు ప్రమాణం చేయించలేదని వైసీపీ శ్రేణులు అధికార పార్టీపై ఎదురుదాడికి దిగారు. అంతేకాదు.. స్పీకర్ ఎన్నిక సమయంలో కూడా జగన్ అసెంబ్లీకి హాజరు కాలేదు. స్పీకర్‌ను ఎన్నుకునే సమయంలో అన్ని పార్టీల అధినేతలు ఆయన్ని సభా అధ్యక్షుడి కుర్చీలో కూర్చోపెట్టాలి. కానీ.. జగన్ స్పీకర్ ఎన్నిక రోజు హాజరుకాలేదు.

- Advertisement -

రాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్ ఎన్నికను గౌవించలేని జగన్.. పార్లమెంట్‌లో మాత్రం కీలకంగా వ్యవహరించడానికి ప్రయత్నించారు. వైసీపీ ఎంపీలు.. బీజేపీ బలపరిచిన ఓం బిర్లాకు మద్దతిచ్చారు. జగన్ మద్దతివ్వకపోయినా.. అక్కడ జరిగేది ఏం లేదు. ఖచ్చితంగా ఓం బిర్లా స్పీకర్ గా ఎన్నుకోబడతారు. అయితే.. ప్రతిపక్ష పార్టీకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడం ఓ సాంప్రదాయంగా వస్తుంది. కానీ.. బీజేపీ ఆ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి పదేళ్లుగా తమ కూటమినేతనే డిప్యూటీ స్పీకర్‌గా కూడా ఎన్నుకుంటోంది.

Also Read : వైసీపీ ఆఫీసుల కూల్చివేతపై ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వ్

ఇండియా కూటమి పార్టీలు ప్రతిపక్షాలకు చెందిన ఓ వ్యక్తికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశాయి. కానీ, బీజేపీ మాత్రం దానికి ససేమిరా కుదరదని అని చెప్పింది. దీంతో.. ఇండియా కూటమి కూడా స్పీకర్ పదవికి పోటీ పడింది. ఏపీలో అసెంబ్లీ గురించి సభా, సాంప్రదాయాలు అని మాట్లాడిన జగన్.. పార్లమెంట్‌లో మాత్రం సాంప్రదాయాల గురించి మర్చిపోయి.. బీజేపీకి సపోర్టు చేశారు. ఇండియా కూటమికి డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలని ఒక్క మాట కూడా అడగలేదు.

కానీ, ఏపీలో మాత్రం మెజార్టీ రాకపోయినా.. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని.. లేదంటే అసెంబ్లీకి రానని అంటారు. ఇదెక్కడి విచిత్రమో అర్థం కావడం లేదు. అయితే.. ఇక్కడ బీజేపీ కూడా డబుల్ గేమ్ ఆడింది. స్పీకర్ ఎన్నికకు ముందు అధికార పార్టీ అన్ని పార్టీలను తమకు మద్దతివ్వాలని కోరుతుంది. అలాగే మిత్రపక్షాలతో పాటు.. ఇండియా కూటమి నేతలు, రెండు కూటములకు సమదూరం పాటిస్తున్న పార్టీల మద్దతు బీజేపీ కోరింది. అయితే.. పోటీ అనివార్యం అయిన తర్వాత కూడా బీజేపీ.. జగన్ మద్దతు కోరింది.

నిజానికి జగన్ మద్దతు లేకపోయినా.. ఓం బిర్లా గెలుపు ఖాయం. కానీ.. వైసీపీని మద్దతివ్వాలని కోరడం కాస్త విచిత్రంగా ఉంది. ఏపీలో అధికార కూటమిలో బీజేపీ ఉంది. అంటే వైసీపీ, బీజేపీ రాజకీయ ప్రత్యర్థులు. అలాంటప్పుడు వైసీపీ మద్దతు మళ్లీ మళ్లీ అడగాల్సిన అవసరం ఏముంది? ఏపీలో మిత్రులుగా ఉన్న చంద్రబాబు, పవన్‌ దీన్ని అంగీకరిస్తారా? అని కూడా ఆలోచించలేదు. అంటే.. ఇంకా బీజేపీ.. టీడీపీకి, వైసీపీకి సమదూరం పాటిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వైసీపీని బీజేపీ రాజకీయ ప్రత్యర్థిగా భావించడం లేదనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News