BigTV English

MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ హవా.. స్థానిక సంస్థల కోటా క్లీన్ స్వీప్..

MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ హవా.. స్థానిక సంస్థల కోటా క్లీన్ స్వీప్..

MLC Elections : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాల్లోనూ అధికార పార్టీ అభ్యర్థులే గెలిచారు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు విజయం సాధించారు. ఈ ఎన్నికలో మొత్తం 752 మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందులో నర్తు రామారావుకు 632 ఓట్లువచ్చాయి. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆనేపు రామకృష్ణకు 108 ఓట్లు పడ్డాయి. 12 ఓట్లు చెల్లబాటు కాలేదు.దీంతో 524 ఓట్ల తేడాతో నర్తు రామారావు ఘన విజయం సాధించారు.


పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఫ్యాన్ స్పీడ్ గా తిరిగింది. స్థానిక సంస్థల కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులే గెలుపొందారు. ఆ పార్టీ అభ్యర్థులు కవురు శ్రీనివాస్‌, వంకా రవీంద్రనాథ్‌ విజయం సాధించారు. జిల్లాలో మొత్తం 1105 ఓట్లు ఉన్నాయి. అయితే 1088 మంది స్థానిక ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైసీపీ అభ్యర్థి కవురు శ్రీనివాస్‌కు 481 మొదటి ప్రాధాన్యతా ఓట్లు వచ్చాయి. వంకా రవీంద్రనాథ్ కు 460 ఓట్లు పడ్డాయి. స్వతంత్ర అభ్యర్థి వీరవల్లి చంద్రశేఖర్‌ కేవలం 120 ఓట్లు మాత్రమే తెచ్చుకున్నారు. దీంతో వైసీపీ అభ్యర్థులు భారీ విజయం సాధించారు. కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ మధుసూదన్‌ గెలుపొందారు. స్థానిక సంస్థల కోటాలో అనంతపురం,కడప,నెల్లూరు,తూర్పుగోదావరి,చిత్తూరు జిల్లాల్లో మరో 5 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. దీంతో మొత్తం 9 ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీకే దక్కాయి.

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ,పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు పట్టభధ్రుల ఎమ్మెల్సీ స్థానాలు, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలు వెల్లడి కావాల్సిఉంది. తెలంగాణలో హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ఓట్లు లెక్కింపు కొనసాగుతోంది.


ఈ నెల 13న ఏపీలోని 3 గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలతోపాటు తెలంగాణలోని ఒక ఉపాధ్యాయ స్థానంలో ఎన్నికలు జరిగాయి. తొలుత స్థానిక సంస్థల కోటా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు భారీ సంఖ్యలో ఉండటంతో తుది ఫలితాలు వెల్లడయ్యే సరికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది.

RGV: తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి.. విద్యార్థులకు వర్మ కామపాఠాలు..

Jagan: నాన్నను చూసి నేర్చుకున్నా.. ఇదే నా ఎకనామిక్స్‌.. ఇదే నా పాలిటిక్స్‌.. ఇట్లు మీ జగన్

Related News

AP Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి అతి భారీ వర్ష సూచన.. రేపు ఈ జిల్లాల్లో

YS Jagan: మీది రెడ్ బుక్ అయితే.. మాది డిజిటిల్ బుక్, కథ వేరే ఉంటది.. జగన్ సంచలన వ్యాఖ్యలు

Yellow Shirt: అసలైన పసుపు సైనికుడు.. కూతురు పెళ్లిలో కూడా పసుపు చొక్కానే

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Big Stories

×