Big Stories

Kotamreddy: జగనన్నా నీ ఫోన్ ట్యాపింగ్ చేస్తే… వైసీపీ నుంచి పోటీ చేయాలని లేదు: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Kotamreddy: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయాలని తనకి లేదని స్పష్టం చేశారు. ఆ పార్టీ నుంచి పోటీకి తన మనసు అంగీకరించడం లేదని వెల్లడించారు. ఇంటెలిజెన్స్ అధికారులు తనపై నిఘా పెట్టి ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ రెండు రోజులుగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. ఇంటెలిజెన్స్ అధికారులు తనపై నిఘా పెట్టిన విషయం 4 నెలల క్రితమే తనకు తెలుసని.. ఓ ఐపీఎస్ అధికారి తనకు చెప్పాడని కోటం రెడ్డి అన్నాడు. అయితే ముఖ్యమంత్రి జగన్‌పై కోపంతో ఆ అధికారి అలా చెప్పారని ముందుగా భావించానని తెలిపారు.

- Advertisement -

తనపై అనుమానం ఉన్న చోట ఉండాల్సిన అవసరం తనకు లేదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయనని వెల్లడించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ఫోన్ ట్యాప్ చేస్తున్నారన్నారు. ఫోన్ ట్యాప్ అయినట్లు తన దగ్గర స్పష్టమైన సాక్షాలు ఉన్నాయని.. ఆధారాలు బయటపడితే ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లకు ఇబ్బంది అవుతుందని తెలిపారు.

పార్టీ నుంచి వెళ్లేవాళ్లు వెళ్లొచ్చని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్న మాటను.. ముఖ్యమంత్రి జగన్ మాటలుగా భావిస్తున్నాని తెలిపారు. జగనన్నా.. నీ ఫోన్ ట్యాప్ చేస్తే ఎలా ఉంటుంది.. అని కోటంరెడ్డి అన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News