Big Stories

YCP Defeat in AP Elections 2024: వైసీపీ ఓటమికి కారణం.. తిలా పాపం తలా పిడికెడు..!

- Advertisement -

మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మొన్న ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు.. వీరితో పాటు పార్టీ ముఖ్య నేతలను క్యాంప్‌ కార్యాలయానికి పిలిచారు. టీ, కాఫీలు అయ్యాక.. అసలు మనం ఎందుకు ఓడాం అనే అజెండాతో చర్చ మొదలుపెట్టారు. ఇక ఒక్కొక్క నేతది ఒక్కో ఆన్సర్.. నేతల మధ్య వర్గ పోరు.. సొంత నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను డమ్మీలుగా చేయడం..పెద్దలమని చెప్పుకునే కొందరు నేతలు నియోజకవర్గ వ్యవహారాల్లో అధికంగా జోక్యం చేసుకోవడం.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రీజన్‌ చెప్పారు.
అయితే నేతలు చెప్పిన రీజన్స్‌లో అత్యధికంగా వినిపించిన పేరు సజ్జల రామకృష్ణారెడ్డి.. మరికొందరు అధికారుల పేర్లు.
సజ్జల.. మీ వరకు ఏ విషయాన్ని తీసుకురానివ్వలేదు.
సజ్జల.. మిమ్మల్ని కలిసేందుకు అనుమతివ్వలేదు.
సజ్జల.. అన్ని విషయాల్లో జోక్యం చేసుకున్నారు.
సజ్జల.. మంత్రులకు ఫ్రీడమ్ ఇవ్వలేదు.
సజ్జల.. అన్ని తానై వ్యవహరించారు.
ఇలా ప్రతి విషయంలో సజ్జల.. సజ్జల.. అనే పేరు వినిపించిందని తెలుస్తోంది.

- Advertisement -

Also Read: ఏపీ ప్రత్యేక హోదాపై నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు..

నెక్ట్స్‌ మరికొందరు సజ్జల రామకృష్ణ రెడ్డి కుమారుడు భార్గవ్‌ రెడ్డిపై కూడా కంప్లెయిన్‌ చేసినట్టు తెలుస్తోంది. సజ్జల భార్గవ్ రెడ్డి.. వైసీపీ డిజిటల్ వింగ్‌ మొత్తం అతని కనుసన్నల్లోనే నడిచింది. సోషల్ మీడియా పోస్టులు.. టీడీపీ నేతలకు కౌంటర్లు.. ఇలా అన్నింటి వెనక భార్గవ్ రెడ్డి ఉన్నారు. ఆయన కూడా జగన్‌ కోటరిలో ఒకరుగా ఉన్నారు. జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి రాజీనామా చేసే వరకు చేసిన ప్రతి పనిలో జగన్‌ కంటే ఎక్కువగా ఈ కోటరీదే ఎక్కువ పాత్ర అనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడీ ఆరోపణలను నేరుగా సీఎం జగన్‌కే ఏకరువు పెడుతున్నారు నేతలు.. అటు ప్రజలు.. ఇటు సొంత పార్టీ నేతల్లో జగన్‌కు వ్యతిరేకత రావడానికి వీరే కారణమని చెబుతున్నారు. నిజానికి వైసీపీ దారుణ ఓటమిపై బహిరంగంగా ఓపెన్ అయ్యింది మొదట జక్కంపూడి రాజా.. ఆయన ఏమన్నారో మరోసారి వినండి.

జక్కంపూడి చెబుతున్న అధికారి పేరి ధనుంజయ రెడ్డి.. ఇప్పుడు నేతలు చెబుతున్న పేరు సజ్జల అండ్ సజ్జల కొడుకు. అయితే ఇలా కంప్లైంట్ చేసిన వారిలో జోగి రమేష్‌ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఉద్యోగుల వ్యతిరేకతపై చాలా సార్లు జోగి రమేష్‌ జగన్‌కు చెబుదామనుకున్నారట. బట్.. సజ్జల ఆపేశారంట.. అంతేకాదు నియోజకవర్గాల్లో వాస్తవ పరిస్థితిని జగన్‌కు చేరనివ్వలేదట సజ్జల.. అయితే నిజంగా ఆయనపై వ్యతిరేకత పెరగడానికి సజ్జల అవసరమా? అస్సలు అవసరం లేదు.. ఆయన మాట్లాడిన మాటలు.. చేసిన పనులు చాలు.. ఒక్కసారి పాస్ట్‌కు వెళితే ఆయన చేసిన పనులు ఎలాంటివో తెలుస్తుంది. చంద్రబాబు ఇంటిపై దాడికి కర్త, కర్మ, క్రియ ఎవరు? ఆయనే కదా.. మళ్లీ మరోకరిపై స్పెషల్‌గా కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఏంటి? అండ్‌ మరికొందరు కూడా మంత్రులు ఉన్నారు. వీరు ఏదైనా ప్రభుత్వ పాలసీపై మాట్లాడమంటే పది నిమిషాల్లో ముగిస్తారు. ఇక విపక్ష పార్టీలపై తిట్ల దండకం ఎత్తుకుంటే గంటలు గంటలుగా సాగుతుంది ఆ ప్రెస్‌ మీట్.. మరి ఇలాంటి నేతలపై వ్యతిరేకత రాకపోతే అభిమానం పెరుగుతుందా..?

Also Read: Rammohan naidu: తెలంగాణ నుంచి ఇద్దరు, రామ్మోహన్ తొలి పలుకులు, ఆ విషయంలో..

మరోసారి సజ్జల వ్యవహారానికి వస్తే.. ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. ఎవరికైనా పోస్ట్ కేటాయించాలన్నా.. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి అధికారుల వరకు బదిలీ చేయాలన్నా సజ్జల అనుమతి కావాల్సిందే.. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, అంగన్వాడీలు, ఆశ వర్కర్స్.. ఇలా ఎవరితో చర్చలు జరిగిన. ప్రతి సందర్భంలోనూ సజ్జల వీరు ఎవరు తమ ఓటు బ్యాంకు కాదని కించ పరిచే విధంగా మాట్లాడేవారు. ఈ మాటలే ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయ్యాయి. సజ్జల మాటలకు అనుగుణంగా.. వైసీపీ డిజిటిల్‌ మీడియా క్యాంపెయిన్ ఉండేది.. వారిని కించపరుస్తున్నట్లుగా పోస్టులు ఉండేవి. అన్ని కలిపి ఏమైంది సీట్ల సంఖ్య 151 నుంచి 11కు పడిపోయింది.

నిజానికి వైసీపీ ఓటమికి కారణం ఏంటి? తిలా పాపం తలా పిడికెడు అని చెప్పాలి. వాళ్ల పనులు అలా ఉన్నాయి. పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయారు. గ్రౌండ్ లెవల్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయారు. నిజానికి జగన్‌కు తెలియనివ్వలేదు.. ఆయన కోటరి. ఫలితం కలలో కూడా మరిచిపోలేని అత్యంత దారుణ ఓటమి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News