Big Stories

AP MLC Elections : ఏపీలో మరో ఎన్నికకు రంగం సిద్ధం.. టీడీపీకి కొత్త టెన్షన్

AP MLC Elections update(Andhra pradesh political news): కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న అధికార టీడీపీలో ఎమ్మెల్సీ ఎన్నికల టెన్షన్ నెలకొంది. ఇప్పటికే వైసీపీని వీడి ఇద్దరు పార్టీలో చేరడంతో.. ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ క్రమంలోనే ఆ ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశావహుల సంఖ్య మాత్రం పెద్ద లిస్ట్ వస్తోంది. మరోవైపు ఒక ఎమ్మెల్సీగా ఆ నేతకే ఛాన్స్ ఇవ్వాలంటూ చంద్రబాబు బావమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణ సైతం ఒత్తిడి తెస్తున్నారని టాక్ నడుస్తోంది. అధికారం చేపట్టి కొద్దిరోజులు కూడా కాకముందే.. ఇప్పుడు కొత్తగా ఈ ఒత్తిడేంటని చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నారని చర్చ జరుగుతోంది.

- Advertisement -

ఏపీలో మరో ఎన్నికకు రంగం సిద్ధం అవుతోంది. శాసనమండలి సభ్యుల ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. జూలై 2వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. జూలై 12న ఎమ్మెల్సీల ఎన్నిక జరగనుంది. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సి.రామచంద్రయ్య, ఇక్బాల్‌ రాజీనామాలతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. రెండేళ్ల కాలపరిమితి ఉన్న ఈ పదవులు టీడీపీకి దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం సభలో టీడీపీ కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఎమ్మెల్యేల కోటాలో సులువుగా ఎమ్మెల్సీలను గెలిచే అవకాశం ఉంది.

- Advertisement -

తిరుగులేని విజయంతో అధికారాన్ని చేపట్టిన టీడీపీ.. ఇప్పడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు సన్నద్ధం అవుతోంది. గెలుపు పక్కా అని తెలిసిన విషయమే అయినప్పటికీ.. ఛాన్స్ ఎవరికి దక్కుతుందో అని మూడు పార్టీల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. అధినేతల హామీతో తమకే పదవి దక్కుతుందని ఆశావహులు అంతా ఊహల్లో ఊరేగుతున్నారు. మరి పదవి ఎవరిని వరిస్తుందో అని ఉత్కంఠ మూడు పార్టీల నేతల్లో కొనసాగుతోంది. రెండు, మూడు సార్లు పోటీ చేసి గెలుపొందిన వారికి కూడా ఈసారి టికెట్ ఇవ్వకపోవడంతో.. ఎమ్మెల్సీగా తమకే స్థానం దక్కుతుందని పలువురు సీనియర్ నేతలు సైతం ఆశల పల్లకిలో విహరిస్తున్నారని టాక్ నడుస్తోంది.

Also Read : మన్ కీ బాత్‌.. సీఎం చంద్రబాబుతో కలిసి ప్రధాని మోదీ..

గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన వర్మ తనకే కన్ఫర్మ్ అని ధీమాగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ సైతం వర్మకే ఓటు వేస్తుండడం.. చంద్రబాబు కూడా వర్మకే మొదటి స్థానం ఇస్తానని మాట ఇచ్చారు. దీంతో వర్మకు ఎమ్మెల్సీ దాకాకడం గ్యారంటీ అని భావిస్తున్నారు. మరోవైపు తన హ్యాట్రిక్ విజయం కోసం కృషిచేసిన ఇక్బాల్ కి ఎమ్మెల్సీ ఇవ్వాలని బాలకృష్ణ రికమెండ్ చేస్తున్నారట. మరోవైపు టీడీపీ నాయకుడు వంగవీటి రాధా పేరు కూడా తెరమీదకి రావడంతో ఎవరికి అవకాశం దక్కుతుందో అని ఉత్కంఠ కొనసాగుతుంది.

ప్రస్తుతం సభలో పూర్తి మెజార్టీ ఉండి.. గెలిచే అవకాశం 100 శాతం ఉన్నప్పటికీ కూడా అభ్యర్థులను ఖరారు చేయడంలో కూటమి నేతలు తలలు పట్టుకుంటున్నారు. రెండు ఎమ్మెల్సీల్లో ఒకటి రామచంద్రయ్యకి, మరొకటి వర్మకి ఇస్తారా ? లేక ఒక ఎమ్మెల్సీ వంగవీటి రాధాకి ఇచ్చి మరొకటి ఇక్బాల్ ఇస్తారా ? అనే ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబు సైతం ఎవరికి టిక్ పెడతారో అని టెన్షన్ వాతావరణం అలుముకుంది.

కూటమి ఏర్పాటుతో త్యాగాలు చేసిన నేతలకు న్యాయం చేస్తానని ఇచ్చిన హామీ మేరకు.. చంద్రబాబు ఎవరికి ఛాన్స్ ఇస్తారో అని సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. నేడో రేపో ఈ ఉత్కంఠకి బాబు చెక్ పెట్టే అవకాశాలు ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News