Big Stories

Jagan @ Yelahanka Palace: జగన్ బెంగళూరు టూర్ రహస్యమేంటి..?

Secret Behind Jagan’s Bangalore Tour: ఎన్నికల్లో దారుణ ఓటమి.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి. ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఎన్ని రోజులు ఉంటారో తెలియని పరిస్థితి. మరోవైపు ఎప్పుడు ఏ బాంబ్‌ పేలుస్తుందో తెలియని కూటమి ప్రభుత్వం. మొత్తంగా చూస్తే ముందు నుయ్యి.. వెనక గొయ్యి అన్నట్టుగా తయారైంది వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి పరిస్థితి. మరి ఇలాంటి సమయంలో జగన్‌ ఎలాంటి వ్యూహాలు రచించబోతున్నారు? తనపై ఇప్పటికే ఎక్కుపెట్టిన కేసుల బాణాలను ఎలా తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు?

- Advertisement -

యలహంక ప్యాలెస్.. బెంగళూరు నుంచి ఏపీకి లేదా హైదరాబాద్ కి వచ్చే మార్గంలో  ఉంటుంది. యలహంక.. ఎయిర్ పోర్టుకు చాలా దగ్గర. ఆ యలహంక 23 ఎకరాల్లో ఉంటుంది. జగన్‌ ఇష్టపడి కట్టించుకున్న ఇల్లు. ఈ ప్యాలెస్ లాంటి ఇంటిని కంటించుకున్నప్పుడు జగన్ పాలిటిక్స్‌లోకి రాలేదు. అప్పుడు సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. ఈ ప్యాలెస్ వైభోగం గురించి అప్పట్లో కథలు కథలుగా చెప్పుకునేవారు. అలాంటి యలహంక ప్యాలెస్‌ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఏంటి ముందు ఏదో సీరియస్‌ మ్యాటర్‌ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చి ఇప్పుడు సంబంధం లేకుండా యలహంక ప్యాలెస్‌ గురించి చెబుతున్నారనుకుంటున్నారా? కానీ కనెక్షన్‌ ఉంది. అందుకే ఈ ప్యాలెస్ గురించి ఇంత సేపు వివరంగా చెప్పింది.

- Advertisement -

జగన్‌ ఇప్పుడు ఈ ప్యాలెస్‌కి వెళ్లారు. పులివెందుల పర్యటన ముగిసిన తర్వాత ఆయన నేరుగా బెంగళూరుకు వెళ్లారు. నిజానికి ఇది అనూహ్య పర్యటనే. ఎందుకంటే వైఎస్‌ఆర్ మరణించిన తర్వాత ఎప్పుడూ ఆయన ఈ ప్యాలెస్‌కి వెళ్లింది లేదని తెలుస్తుంది. ఆ తర్వాత వైసీపీ గెలుపు తర్వాత ఆయన రాజధాని ప్రాంతంలోనే ఇంటిని నిర్మించుకొని అక్కడే ఉన్నారు. కానీ ఇప్పుడు ఓటమి తర్వాత.. అంటే దాదాపు పదేళ్ల తర్వాత బెంగళూరు ఇంటికి వెళ్లారు. మరి అక్కడి నుంచి ఇప్పట్లో తిరిగి వస్తారా? లేదా? అనేది తెలియాలి.

Also Read: YS Jagan Master Plan: యూటర్న్ తీసుకున్న జగన్.. స్పీకర్ ఎన్నికలో బీజేపీకి మద్దతు.

దీనికి రెండు కారణాలు ఉన్నట్టు తెలుస్తుంది. అందులో మొదటిది.. తాడేపల్లి నివాసంలో జగన్‌ ఎవరిని కలిసినా ఇంటెలిజెన్స్ ద్వారా ప్రభుత్వానికి తెలుస్తుంది. రెండోది.. ఓటమి తర్వాత రాజధాని ప్రాంతంలో ఉండటం ఇష్టం లేకపోవడం.. మొన్న అసెంబ్లీకి ప్రమాణస్వీకారం చేసేందుకు వచ్చినప్పుడే జగన్‌ వెనక గేట్ నుంచి వచ్చారు. కారణం.. రాజధాని రైతుల నుంచి నిరసన వ్యక్తమవుతుందన్న అనుమానంతో. అలాంటి ప్రాంతంలో ఉంటే రోజుకో తలనొప్పి వస్తుందన్న అనుమానంతో ఆయన తన మకాంను బెంగళూరుకు షిఫ్ట్ చేసినట్టు కనిపిస్తుంది. అయితే.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇకముందు ఆయన రాజకీయ పావులు బెంగళూరు నుంచే కదపనున్నట్టు తెలుస్తుంది.

ఇప్పుడీ ప్రచారానికి బలం చేకూర్చేలా ఉన్నాయి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు. ఎందుకంటే వైసీపీ ముఖ్య నేతలను బెంగళూరుకు రావాలని ఇప్పటికే సమాచారం వెళ్లినట్టు తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా రాయలసీమ నేతలకు పిలుపు వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వైసీపీ ముఖ్య నేతలను కేసుల పేరుతో లాక్ చేసేందుకు రెడీ అవుతుంది. ఇందులో ముఖ్యంగా మద్యం అమ్మకాలు, ఇసుక, మైనింగ్‌పై కొత్త ప్రభుత్వం ఫోకస్ చేయనున్నట్టు తెలుస్తుంది.

Also Read: మళ్లీ జన్మ అంటూ ఉంటే కుప్పంలోనే పుడతా: సీఎం చంద్రబాబు భావోద్వేగం

వీటిపైనే త్వరలో విచారణకు ఆదేశాలు వెలువడుతాయన్న ప్రచారం ఉంది. ఈ ముఖ్యమైన వ్యవహారాలన్నీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి కనుసన్నల్లోనే జరిగాయి. అందుకే వీరికి పిలుపు వచ్చినట్టు తెలుస్తుంది. త్వరలోనే వీరంతా బెంగళూరులో భేటీ కానున్నారు. అంతేకాదు కొందరు వైసీపీ నేతలు కూడా టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. దీనిపై కూడా జగన్ ఫోకస్‌ చేసినట్టు తెలుస్తోంది.

ఏదేమైనా ముందు ముందు ముప్పులు తప్ప.. మంచికాలమైతే కనిపించడం లేదు వైసీపీ పార్టీకి. ఆ పార్టీ అధినేతకు.. ఎన్నికల్లో దారుణ ఓటమి ఇంకా జగన్‌కు డైజెస్ట్ కాలేదన్నది మాత్రం వాస్తవం. అందుకే కొన్ని రోజులు బ్రేక్‌ తీసుకునే ఉద్దేశం కూడా కనిపిస్తోంది. అందుకే బెంగళూరుకు వెళ్లారా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. కొన్ని రోజుల వరకైతే ఆయన యలహంక నుంచి కదిలే పరిస్థితులైతే కనిపించడం లేదనే చెప్పాలి.

Also Read: IPS Mahesh Chandra Laddha: ఏపీకి ఐపీఎస్ అధికారి మహేష్ చంద్ర లడ్డా రాక, వైసీపీ ఆగడాలకు చెక్ తప్పదా?

ఓ వైపు ఈ డిస్కషన్‌ జరుగుతుండగానే మరో అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు జగన్.. అదే ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి లెటర్ రాయడం. ప్రమాణస్వీకారం జరిగిన తీరును ఆయన తప్పుపట్టారు. సీఎం, మంత్రుల తర్వాత తనతో ప్రమాణస్వీకారం చేయించడం శాసనసభా పద్దతులకు విరుద్ధమన్నారు. ప్రతిపక్ష నాయకుడికి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టు కనిపిస్తుందన్నారు జగన్.. అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే కనీసం 10 శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని ఎక్కడా ఈ నిబంధన పాటించలేదన్నారు.

స్పీకర్‌ తన పట్ల శత్రుత్వం ప్రదర్శిస్తున్నారంటూ ఆయనకు రాసిన లెటర్‌లోనే తెలిపారు జగన్.. దీంతో ఓ సరికొత్త చర్చకు తెరలేపారు జగన్.. ఏపీలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే 17 లేదా 18 సీట్లు రావాల్సి ఉంటుంది. కానీ వైసీపీకి మాత్రం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. నిజానికి ఇప్పుడు జగన్ రాసిన లేఖను కూడా స్పీకర్‌ సీరియస్‌గా తీసుకునే పరిస్థితి అయితే లేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News