Big Stories

AP Volunteers System : ఏపీలో వాలంటీర్లు కొనసాగుతారా ? డిప్యూటీ సీఎం మాటల్లో ఆంతర్యమేమిటి ?

AP Volunteers latest news(Andhra pradesh today news): ఏపీలో వాలంటీర్లు కొనసాగుతారా? లేదా? వాలంటీర్ల కొనసాగింపుపై ప్రభుత్వం ఆలోచనా విధానం ఎలా ఉంది? వాలంటీర్లపై చంద్రబాబు, పవన్‌ చేసిన వ్యాఖ్యలు వారి మంచికా? చేటుకా? అసలు ఏపీలో వాలంటీర్లు కొనసాగుతారా? లేదా? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడెందుకు వచ్చాయనే కదా మీ డౌట్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటలు ఓసారి వినండి.. మీకు కూడా ఇదే అనుమానం కలుగుతుంది.

- Advertisement -

నిజానికి ఏపీలో పెన్షన్‌ పంపిణీని ప్రెస్టిజ్‌ ఇష్యూగా తీసుకుంది ప్రభుత్వం. ఉదయం నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికి ఇంటి వద్దనే అందించింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నుంచి మొదలు పెడితే సాధారణ ఎమ్మెల్యేల వరకు అందరూ పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఒక్క వాలంటీర్‌ కూడా ఇన్‌వాల్వ్‌ కాలేదు. ఇదీ ఇక్కడ హైలైట్. ఎలాంటి గందరగోళం, వివాదం లేకుండా సింపుల్‌గా సచివాలయ ఉద్యోగులతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ఏపీ ప్రభుత్వం.

- Advertisement -

మీకు గుర్తుందా ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వాలంటీర్లను సంక్షేమ పథకాలను అందించేందుకు దూరంగా ఉంచింది ఈసీ. ఆ సమయంలో వృద్ధులు, లబ్ధిదారులంతా గ్రామ సచివాలయాలకు వెళ్లి డబ్బులు తీసుకోవాల్సి వచ్చింది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల కారణంగా కొంత మంది వృద్ధులు కూడా ప్రాణాలు కూడా విడిచారు. అయితే ప్రభుత్వ పెద్దలు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పెన్షన్‌ అందించడం కుదరదన్నారు. అలా చేయడం సాధ్యం కాదన్నారు.. కానీ చంద్రబాబు ఇప్పుడు ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. అది కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం.. మే, జూన్, జులై ఎరియర్స్ కలిపి ఏకంగా 7 వేల రూపాయలు అందించారు. ఇందులో మరో హైలైట్ ఏంటంటే.. సీఎం చంద్రబాబు కూడా స్వయంగా పలు ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందించడం.

Also Read : పోలీసులపై మంత్రి భార్య దురుసు ప్రవర్తన.. చంద్రబాబు సీరియస్

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షా 25 వేల మంది గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది మాత్రమే ఇందులో పాల్గొన్నారు. ఒక్కొక్కరు 50 మంది పెన్షన్‌ దారులకు డబ్బు అందించారు. కొన్నిచోట్ల అంగన్‌వాడీ, ఆశా సిబ్బంది సేవలు కూడా ఉపయోగించుకున్నారు. అంతా బానే ఉంది.. కానీ ఇక్కడో ప్రశ్న తెరపైకి వస్తుంది. అదేంటంటే.. ఈ కార్యక్రమంలో వాలంటీర్లను ఉపయోగించకపోవడం దేనికి సంకేతం. ఇకపై వారిని ఈ సేవలకు ఉపయోగించుకోరా? వారి పరిస్థితి ఏంటి? అనేది ఇక్కడ మెయిన్ క్వశ్చన్. చంద్రబాబు ఏమో ఎన్నికల ముందు వాలంటీర్ల ఉద్యోగాలకు తానే గ్యారెంటీ అన్నారు. వారికిచ్చే జీతాలను 10 వేలకు పెంచుతామన్నారు. మరిప్పుడేమో అసలు తమను పట్టించుకోవడం లేదంటున్నారు వాలంటీర్లు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని.. అందుకే తాము ఈ కార్యక్రమంలో పాల్గొనలేదని అంటున్నారు. అయితే ప్రభుత్వ వ్యవస్థలను సమర్థించుకోవడంలో ఇది భాగమనేది అధికారపక్షం మాట.

అటు పవన్ అయినా.. ఇటు చంద్రబాబు అయినా ఒకటే మాట చెబుతున్నారు. అదేంటంటే వాలంటీర్ల సేవలను ఉపయోగించుకుంటాం. కానీ ఎలా అన్నది ఇంకా తేల్చలేదంటున్నారు. రాష్ట్రంలో మొత్తం 2లక్షల 54 వేల 832 మంది వాలంటీర్లు ఉన్నారు. వీరిలో లక్షా 28వేల 179 మంది రాజీనామా చేసినట్లు సమాచారం. రాజీనామా చేసినవారంతా ఇటీవల తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. కొందరైతే బలవంతంగా రాజీనామాలు చేశామని.. వైసీపీ నేతలు చెప్తేనే చేశామంటూ కేసులు కూడా వేశారు. కానీ ప్రభుత్వం ఇప్పుడున్న వారి సేవలను కూడా ఉపయోగించుకోలేదు.

Also Read : పిఠాపురానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చాకే నన్ను ఊరేగించండి: పవన్ కల్యాణ్

మరికొందరు టీడీపీ నేతలైతే అసలు వాలంటీర్‌ వ్యవస్థనే తప్పు పడుతున్నారు. వాలంటీర్లకు ఇస్తామన్న రూ.10వేల జీతాన్ని.. పంచాయతీ కార్మికులకు ఇవ్వడం ఉత్తమమంటున్నారు. సచివాలయ ఉద్యోగులతో గ్రామాల్లో పనిచేయించుకుంటే సరిపోతుందన్నది వారి వాదన.

కొందరేమో వద్దంటున్నారు.. మరికొందరేమో ప్రత్యామ్నాయం చూస్తామంటున్నారు. దీంతో అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది వాలంటీర్ల పరిస్థితి. అయితే వాలంటీర్లకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ ద్వారాఉపాధి కల్పించేలా ప్రభుత్వం ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్కొక్కరికి 15వేల నుంచి 30 వేల వరకు జీతం వచ్చే విధంగా కార్యచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. మరి ముందు ముందు వాలంటీర్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు కాస్త ఇంట్రెస్టింగ్‌గా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News