Big Stories

Minister Narayana: అక్రమాలపై విచారణ.. నివేదిక వచ్చాకే చర్యలు: మంత్రి నారాయణ

Minister Narayana: తణుకు టీడీఆర్ బాండ్లలో అనేక అక్రమాలు జరిగాయని మంత్రి నారాయణ అన్నారు. కొనుగోలు చేసిన వారంతా ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు, కడప లే అవుట్‌ల అనుమతుల్లో ఎక్కువగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. వాటిపై కమిటీలు వేసినట్లు తెలపారు. కమిటీ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు.

- Advertisement -

తణుకులో టీడీఆర్ బాండ్లలో అనేక అక్రమాలు జరిగాయని మంత్రి అన్నారు. రూ. 36 కోట్లు చెల్లించాల్సిన చోట రూ. 700 కోట్లకు పైగా పంపిణీ జరిగినట్లు నివేదిక ఇచ్చారని తెలిపారు. దానిపై పూర్తిగా చర్చించిన తర్వాతే వివరాలను వల్లడించనున్నట్లు చెప్పారు. ఆ బాండ్లు తీసుకున్న వారి తప్పు లేదన్న ఆయన.. అమ్మిన వీరిదే తప్పు అని అన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక నిర్వహణ సక్రమంగా చేయకుండా మున్సిపాలిటీలకు అందాల్సిన నిధులను దారి మళ్లించిందని ఆరోపించారు.

- Advertisement -

Also Read: వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ అరెస్ట్!

టీడీపీ అధికారంలో ఏషియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ నుంచి రూ. 5,300 కోట్లు తీసుకువచ్చామని అన్నారు. ఆ మొత్తం 2019లో ఫిబ్రవరిలో మంజూరు అయిందని చెప్పారు. గత నెల 30తో గడువు ముగియగా తెచ్చిన నిధుల్లో వైసీపీ ప్రభుత్వం కేవలం రూ. 240 మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు. అందులో సగం ఖర్చు చేసినా రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో మౌళిక సదుపాయాలు అద్భుతంగా ఉండేవని అన్నారు. ఆ ప్రాజెక్టు గడువు పెంచమని లేఖ రాసామని చెప్పారు. బిల్లులు సరిగ్గా అప్ లోడ్ చేయక రూ. 1150 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. 9 లక్షల టిడ్కో ఇళ్లను అభివృద్ధి చేస్తే వైసీపీ ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదని ఆరోపించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News