Big Stories

Land cheap in Vizag: విశాఖలో చౌకగా భూములు, ఎకరం వెయ్యి రూపాయలే.. వైసీపీకి నోటీసులు

Visakha Land cheap one thousand rupees per acre: విశాఖపట్నంలో భూములు ధరలు చాలా తక్కువ. అందుకే అక్కడ భూములను కొనుగోలు చేసేందుకు రాజకీయ నేతలు దృష్టి పెడతారు. ఇంతకీ ఎకరం ఎంతో తెలుసా కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే. ఇదేదో విచిత్రంగా ఉంది కదూ. వైసీపీ అధికారంలో ఉండగా విశాఖలో ఎకరం వెయ్యి రూపాయలు అద్దెగా తీసుకుంది. రెండు ఏకరాలను కేవలం రెండువేలకే రాసిచ్చారు జీవీఎంసీ అధికారులు. దీనివెనుక అసలేం జరిగిందన్న లోతుల్లోకి వెళ్తే…

- Advertisement -

విశాఖ సిటీ ఎండాడ గ్రామంలో రెండు ఎకరాల స్థలాన్ని వైసీపీ ఆఫీసుకు కేటాయించారు జీవీఎంసీ అధికారులు. రాజకీయ నాయకులు కావడంతో ప్రజా సేవ చేస్తున్నారని భావించి ఎకరం వెయ్యి రూపాయల కే ఇచ్చేశారు. అక్కడ వైసీపీ కార్యాలయం దాదాపు కట్టేశారు. తుది మెరుగులు దిద్దుతున్నారు. సర్వే నంబర్ 175/4లో ఎలాంటి అనుమతులు లేకుండా జరుగుతున్న నిర్మాణం ఇది.

- Advertisement -

నార్మల్‌గా అయితే సిటీ పరిధిలో భవనాలు కడితే జీవీఎంసీ కార్యాలయం నుంచి అనుమతులు పొందాలి. వీఎంఆర్డీఏకు కలెక్టర్ వైస్ ఛైర్మన్‌గా ఉండడంతో ఆ పని తేలికైంది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం దిగిపోయింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే అధికారులు రంగంలోకి దిగేశారు. ఎండాడలోని వైసీపీ కార్యాలయం వద్దకు వెళ్లారు. ఈ భవనానికి ప్లాన్ ఉందా అని అక్కడ పని చేస్తున్న వారిని అడిగారు. ఈ భవనానికి సంబంధించి ఏమైనా మాట్లాడాలంటే ఫలానా వ్యక్తితో మాట్లాడాలని వైసీపీ ఇన్‌ఛార్జ్ పేరు చెప్పారు.

ఎలాంటి పర్మీషన్ లేకుండా భవనాన్ని కట్టడంతో  అధికారులు అవాక్కయ్యారు. జిల్లా అధికారుల సలహాతో అదే రోజు వైసీపీ నేతలు సుమారు 14 లక్షలు చెల్లించారు. దీంతో ఆ భవనానికి సంబంధించి పేపర్లపై దిగువ స్థాయి నుంచి క్లియరెన్స్ వచ్చింది. మరో అధికారి వద్దకు వెళ్లింది. ఈలోగా జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఫిర్యాదు చేయడంతో వీఎంఆర్డీఏ టౌన్ ప్లానింగ్ అధికారులు ఆయా దస్త్రాలపై సంతకాల పెట్టకుండా నిలిపివేశారు.

ALSO READ:  మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్.. టీడీపీ కౌంటర్

మూడునెలలుగా కదలని ఫైలు గంటల వ్యవధిలో పైస్థాయి అధికారుల వద్దకు చేరింది. జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్ రంగంలోకి దిగడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వైసీసీ కార్యాలయానికి కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనిపై వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అనుమతులు లేకుండా కడుతున్న వైసీపీ భవనాన్ని అధికారులు కూల్చేస్తారంటూ విశాఖలో వార్తలు జోరందుకున్నాయి. ఈ యవ్వారంపై మున్సిపల్ శాఖ ఏమంటుందో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News