Big Stories

Undavalli Arun Kumar: వైసీపీ నాయకులకు ట్రైనింగ్ ఇవ్వండి.. మాజీ సీఎం జగన్‌కు ఉండవల్లి సలహా

Undavalli Arun Kumar Advice to YS Jagan(AP politics): ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించింది. 175 స్థానాలకు గానూ 164 స్థానాలను గెలుచుకుంది. ఇప్పటివరకు ఏపీ రాజకీయ చరిత్రలో ఏ పార్టీ సాధించని విధంగా కూటమి గెలుపొందింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, బాలకృష్ణ, నారా లోకేష్ వంటి నేతలు భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాలను గెలుచుకున్న వైసీపీ.. ఈసారి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. తాజాగా, ఈ ఫలితాలపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

అనుకున్నట్లుగానే..

- Advertisement -

రాజమండ్రి మాజీ ఎంపీ వైసీపీ ఫలితాలపై మాట్లాడారు. ఎన్నికలకు ముందు కూటమి పుంజుకుంటుందని హెచ్చిరించినట్లు చెప్పుకొచ్చారు. టీడీపీ, జనసేన పార్టీలు సరిగ్గా ఎన్నికలకు 30 రోజుల ముందు నుంచే పుంజుకున్నాయి. ఇదే విషయాన్ని వైసీపీ నాయకులతోపాటు ఆ పార్టీ అధినేత జగన్‌ను హెచ్చరించానన్నారు. కానీ నేను చెప్పిన విషయాలను పట్టించుకోలేదని గుర్తు చేశారు. వై నాట్ 175 గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన వైసీపీ నాయకులకు.. ఫలితాలను చూసి షాక్‌కు గురయ్యారని చెప్పారు. అయితే తాను మాత్రం ఎలాంటి ఆశ్యర్యానికి గురికాలేదన్నారు. కూటమికి సీట్లు పెరుగుతాయని ముదే ఊహించానని, అనుకున్నట్లుగానే 164 సీట్లు సాధించి అధికారం సొంతం చేసుకుందన్నారు. మరోవైపు వైసీసీ ఓటమికి రౌడీయిజమే కారణమని పలువురు విమర్శలు చేస్తున్నారు.

Also Read: రోజా.. ఆటల పేరుతో 100 కోట్ల స్కామ్, సీఐడీకి ఫిర్యాదు..

క్లాస్ ఇచ్చారుగా..

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు ఉండవల్లి అరుణ్ కుమార్ ఓ రేంజ్‌లో క్లాస్ పీకారు. ఇప్పటివరకు ఎవరూ చెప్పని విధంగా హితోపదేశం ఇచ్చారు. కనీసం వచ్చే ఎన్నికల వరకు పార్టీపై ద‌ృష్టి సారించాలని సూచించారు. ఇప్పటి నుంచే పార్టీని బిల్ట్ అప్ చేసుకోవాలన్నారు. ఎక్కడా కూడ అశ్రద్ధ వహించకుండా దగ్గరుండి చూసుకోవాలన్నారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఏ ఒక్క నాయకుడికి రాజకీయమంటే తెలియదని.. అసలు ఏ ఒక్కరికైనా సబ్జెక్ట్‌పై అవగాహన లేదన్నారు. ఎంతసేపు బూతులు మాట్లడడమేనని క్లాస్ పీకారు. ఫస్ట్ చేయాల్సింది వైసీపీ నాయకులకు ట్రైనింగ్ ఇవ్వాలని హితవు పలికారు. ఎక్కడపడితే అక్కడ శాసనసభల్లోనూ ప్రెస్ మీట్ ల్లోనూ బూతులు మాట్లాడడం మానేయాలని సూచించారు.వైసీపీ ఓడిపోడానికి ప్రధాన కారణం వాలంటీర్లేనన్నారు. వైసీపీ నాయకులు పూర్తిగా వాలంటీర్లపైనే ఆధారపడ్డారన్నారు. కానీ చంద్రబాబు అందరికీ జీతం ఎక్కువగా ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తానని హామీ ఇచ్చారన్నారు. దీంతో వాలంటీర్లు వైసీపీకి ఓట్లు వేయలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News