Big Stories

Lella appireddy: టీడీపీ ఆఫీసు ధ్వంసం కేసు, అప్పిరెడ్డి ముందస్తు బెయిల్ కోసం..

Lella appireddy latest news(Political news in AP): ఎవరు చేసిన పాపాలు వారినే వెంటాడుతాయి… ఈ సామెత వైసీపీలోకి కొందరు నేత లకు అతికినట్టు సరిపోతోంది. అధికారం ఉందని కొందరు వైసీపీ నేతలు విర్రవీగారు. కానీ పరిస్థితి ఇప్పుడు తారుమారయ్యింది. ఆయా నేతల్లో వణుకు మొదలైంది. రాబోయే ఐదేళ్లు ఎలా గడపాలంటూ తర్జనభర్జన పడుతున్నారు. తాజాగా టీడీపీ ఆఫీసు డ్యామేజ్ కేసులో వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ శుక్రవారం జరగనుంది.

- Advertisement -

టీడీపీ ఆఫీసు డ్యామేజ్ కేసు దర్యాప్తు వేగంగా జరుగుతోంది. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వారికి 14 రోజులపాటు రిమాండ్ విధించింది. ఈ కేసులో ప్రధాన సూత్రదారులను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఆధారాలు సేకరించారు.

- Advertisement -

కీలక నిందితులుగా పోలీసులు భావిస్తున్న దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డితోపాటు మరొకరిని అరెస్టు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు పోలీసులు. రేపు లేదా ఎల్లుండి వీళ్లని అదుపులోకి తీసుకోవాలని భావిస్తు న్నారు. ఈ క్రమంలో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి. శుక్రవారం దీనిపై విచారణ జరగనుంది. మరి న్యాయస్థానం తీర్పు ఎలా వస్తుందనేది వైసీపీ నేతల్లో ఆసక్తికరంగా మారింది.

ఇదేకాకుండా అప్పిరెడ్డి, అవినాష్‌లను ప్రేరేపించినవారు ఎవరో తెలుసుకునే పనిలోపడ్డారు పోలీసులు. వీరికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వచ్చాయా? అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడి వెనుక అప్పటి సలహాదారు ఉంచవచ్చనే అనుమానం పోలీసులు వర్గాల్లో వ్యక్తమవుతోంది.

ALSO READ: మోదీ జీ జర దేఖో!.. ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకారం తప్పదా

2021 ఏడాది అక్టోబరు 19న మంగళగిరి సమీపంలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగింది. ఆఫీసుకు ఇరువైపులా కార్లలో వచ్చిన వైసీపీ సానుభూతిపరులు కర్రలు, రాడ్లు, రాళ్లుతో దాడికి తెగబడ్డారు. ఆఫీసులోని కుర్చీలు, టేబుళ్లు, అద్దాలను ధ్వంసం చేశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలను సైతం చితకబాదారు. ఈ ఘటనపై టీడీపీ నేతలు, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినప్పటికీ పెద్దగా పట్టించుకోలేదు. రీసెంట్‌గా ఏపీ ప్రభుత్వం మారడంతో పోలీసులు ఆ కేసు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News