Big Stories

Ex AAG Ponnavolu Sudhakar Reddy: చిక్కుల్లో పొన్నవోలు, సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, పోలీసులకు ఫిర్యాదు..

Ex AAG Ponnavolu Sudhakar Reddy: పదవి శాశ్వతమని అనుకుంది వైసీపీ. ఎన్నికల ఫలితాలు తారుమారయ్యాయి.. చివరకు సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడు తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చింది. కక్ష సాధింపులు వద్దు, చట్ట ప్రకారం చర్యలు తీసుకుందామని చెబుతున్నా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు చెబుతున్నా…  తెలుగు తమ్ముళ్లు ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. చివరకు చిక్కుల్లో పడడం మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వంతైంది. అసలు ఏం జరిగింది? ఇంకా లోతుల్లోకి వెళ్తే..

- Advertisement -

ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌పై మాజీ ఏఏజీ పొన్నవోలు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ది ఇందులోని సారాంశం. వైసీపీ అధినేత జగన్‌ను చంపేస్తే ఏంటని చంద్రబాబు అన్నట్లు పొన్నవోలు తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై తెలుగు తమ్ముళ్లు మంగళగిరి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

- Advertisement -

ముఖ్యంగా సోషల్‌మీడియాలో తీవ్ర ఆరోపణలు చేశారన్నది అసలు పాయింట్. వెంటనే కేసు నమోదు చేసి ఆయన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు టీడీపీ నేతలు గంగాధర్. గతంలో పొన్నవోలు మాట్లాడిన వీడియోలను పోలీసు అధికారులకు అందజేశారు నేతలు. అయన్ని అరెస్ట్ చేసేవరకు తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.

ALSO READ: పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు

చంద్రబాబు చేయని తప్పులు చేసినట్టు తప్పుడు పత్రాలు క్రియేట్ జైలుకి పంపించారని ఆరోపించారు ఆయా నేతలు. అంతేకాదు టీడీపీ ఆఫీసుపై దాడి విషయం, అధినేత ఇంటి ముందు నానాహంగామా చేసినవారిని ఏ మాత్రం సహించమన్నారు. దీనిపై గతంలో తాము ఫిర్యాదు చేశామని పోలీసులు సైలెంట్‌గా ఉన్నారని గుర్తు చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News