Big Stories

Somireddy Fires on AP CS: చీఫ్ సెక్రటరీ కాదు.. చీప్ సెక్రటరీ: సీఎస్ పై సోమిరెడ్డి ఫైర్!

Somireddy Fires on AP CS: ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి.. చీఫ్ సెక్రటరీ కాదు.. చీప్ సెక్రటరీ అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైరయ్యారు. ఆయన హయాంలో రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన X వేదికగా ట్వీట్ చేశారు. రాష్ట్రానికి ఉన్న చీఫ్ సెక్రటరీ కంటే.. పంచాయతీ సెక్రటరీలే మేలనే పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు.

- Advertisement -

“దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ సీఎస్ ఇలా దిగజారలేదు. బాస్ కు గులాంగా మారి వారి దోపిడీకి జీ హుజూర్ అంటూ దారుణంగా వ్యవహరించారు చీఫ్ సెక్రటరీ కంటే నిజాయతీగా పనిచేసే పంచాయతీ సెక్రటరీలే మేలనే పరిస్థితి తెచ్చారు. బాధ్యతాయుతమైన రాష్ట్ర ఉన్నతాధికారిపై ఆరోపణలు చేశారని, పరువు నష్టం దావా వేస్తానని గుంజుకుంటున్నారే…ఏ రోజైనా సీఎస్ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారా. మీ హయాంలో రాష్ట్రంలోని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు శానససభలో ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులకు విలువ లేకుండా చేసేశారు.”

- Advertisement -

“వ్యవసాయం, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, విద్య తదితర కీలక శాఖలకు కేటాయించిన నిధులను ఇష్టారాజ్యంగా మళ్లించే అధికారం మీకెవరిచ్చారు. మీరు జగన్మోహన్ రెడ్డికి గులాంగా మారి చట్టాలను బూటు కాళ్ల కింద నలిపేయడం దుర్మార్గం. జగన్ రెడ్డి దోచుకుంటున్న లక్షల కోట్లకు కౌంటింగ్ ఏజెంట్ గా సీఎస్ మారిపోవడం దురదృష్టకర పరిణామం. మీరు భూకుంభకోణం చేసిందీ, లేనిదీ మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే తేలుస్తుంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖను భూకుంభకోణాలకు అడ్డాగా మార్చేశారు. ప్రజల పాలిట పెనుశాపమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఒక సీఎస్ గా ఎలా యాక్సెప్ట్ చేస్తారు. ఎవరూ అడగని రీసర్వేను రైతులపై బలవంతంగా ఎలా రుద్దుతారు. మా తాతలు, తండ్రులు ఇచ్చిన పొలాల్లో వైఎస్సార్ జగనన్న భూరక్ష పేరుతో రాళ్లు ఎలా నాటుతారు. మా ముత్తాతలు ఇచ్చిన ఆస్తుల పత్రాలపై మేము రోజూ జగన్ రెడ్డి ఫొటోలు చూసుకోవాలా. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ హింస జరుగుతుంటే సీఎస్ గా అదుపుచేయడంలో విఫలమై కన్ఫర్మ్డ్ ఐఏఎస్ ల ఫైలుపై అంత ఆత్రమెందుకో.” అని సోమిరెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు.

Also Read: బాక్స్ బద్ధలైంది.. ఏపీలో కొనసాగుతున్న వీడియో పాలిటిక్స్..

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News