Big Stories

TDP in Modi’s Cabinet: మోదీ కేబినెట్‌లోకి టీడీపీ.. కొత్త ఫార్ములా అప్లై..!

TDP in Modi’s Cabinet: దేశ ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం సాయంత్రం ఆయనతోపాటు పలువురు కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు దాదాపు రంగం సిద్ధమైంది. ఈసారి బీజేపీకి కేంద్రంలో కావాల్సినంత మెజార్టీ లేకపోకపోవడంతో మిత్రులపై ఆధారపడాల్సి వచ్చింది. అయితే మిత్రులు ఎక్కువగా కీలక శాఖలపై కన్నేశారు. దీంతో బీజేపీ కొత్త ఫార్ములాను తెరపైరి తీసుకొచ్చింది.

- Advertisement -

ఎన్డీయేలో బీజేపీ తర్వాత ఎక్కువ సీట్లను టీడీపీ గెలుచుకుంది. తెలుగుదేశానికి 16 ఎంపీ సీట్లు వచ్చాయి. అయితే ఎన్డీయే భేటీకి హాజరైన చంద్రబాబును, కేంద్ర మంత్రి వర్గంలోకి రావాలని మోదీ ఆహ్వానించారు. వెంటనే టీడీపీ అధినేత ఓకే అన్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్ని పదవులు ఇవ్వాలనేది కీలకంగా మారింది.

- Advertisement -

గురువారం బీజేపీ పెద్దలు, ఆర్ఎస్ఎస్ నేతలు నడ్డా నివాసంలో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రివర్గంలో 15 శాఖలు కీలకంగా మారాయి. ఎన్డీయేలోని మిత్రులు దాదాపు ఆయా శాఖలపై కన్నేశారు. దీంతో బీజేపీకి పెద్ద సమస్య వచ్చిపడింది. ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్ కొత్త ఫార్ములాను తెరపైకి తెచ్చింది. నలుగురు ఎంపీలకు ఒక మంత్రి చొప్పున చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చినట్టు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ లెక్కన టీడీపీ నాలుగు, జేడీయు మూడు, జేడీఎస్ ఒకటి దక్కనున్నాయి.

Also Read: మళ్లీ తెరపైకి లోకేష్ రెడ్ బుక్.. వెలసిన ఫ్లెక్సీలు

ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ, కామర్స్, హెచ్ఆర్డీ శాఖలను తమ వద్ద ఉంచుకోవాలని భావిస్తోంది బీజేపీ. మిగతా శాఖలను మిత్రులకు సర్దుబాటు చేయాలనే యోచనలో ఉంది. ఎలాగ చూసినా ఈసారి ఏపీకి ఐదారు కేంద్ర పదవులు రానున్నాయని తెలుగు తమ్ముళ్లు లెక్కలు వేస్తున్నారు. టీడీపీ నాలుగు, ఏపీ బీజేపీకి ఒకటి లేదా రెండు, జనసేనకు ఒకటి వస్తుందని అంచనా వేస్తున్నారు.

టీడీపీ ఎలాంటి శాఖలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. వాటిలో రోడ్డు- షిప్పింగ్, ఐటీ, పట్టణ గ్రామీణాభివృద్ధి, పరిశ్రమల శాఖలను తీసుకోవాలని ఆలోచన చేస్తోంది. రెండు సహాయమంత్రుల్లో ఒకటి ఎంఓఎస్, మరొకటి సహాయమంత్రి తీసుకోవాలన్నది ప్లాన్. ఇదికాకుండా స్పీకర్ పదవిని టీడీపీ డిమాండ్ చేసినట్టు వార్తలు జోరందుకున్నాయి. ఇందుకు బీజేపీ సుముఖంగా లేనట్టు వార్తలు వస్తున్నాయి.

Also Read: Nara Lokesh: ఏపీ ప్రత్యేక హోదాపై నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఉత్తరాంధ్ర నుంచి రామ్మోహన్‌నాయుడు, కోస్తా నుంచి దివంగత బాలయోగి కొడుకు హరీష్, గుంటూరు నుంచి పెమ్మసాని, రాయలసీమ నుంచి ఓ వ్యక్తి తీసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తానికి శుక్రవారం సాయంత్రానికి పదవులపై క్లారిటీ రానుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News