Big Stories

TDP AP President: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాసరావు

TDP AP New President(Political news in AP): టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టారు. కాగా, ప్రస్తుతం ఏపీ అధ్యక్షుడిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడికి మంత్రిగా అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

బీసీ యాదవ వర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావు.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌పై భారీ మెజార్టీతో గెలుపొందారు. రాష్ట్రంలో అత్యధికంగా 95,235 ఓట్ల తేడాతో పల్లా విజయం సాధించారు. ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన పల్లాకు చంద్రబాబు అభినందనలు తెలిపారు.

- Advertisement -

‘విశాఖపట్నం పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేసిన పల్లా శ్రీనివాసరావు నూతన బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పటివరకు టీడీపీ పార్టీని నడిపించడంతో అద్భుత పనితీరు కనబర్చిన సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి అభినందనలు. ప్రతిపక్షంలో అనేక సమస్యలు, సవాళ్లను ఎదుర్కొని పార్టీ బలోపేతానికి అచ్చెనాయుడు ఎనలేని కృషి చేశారు.’ అని చంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News