Big Stories

Siemens ex MD comments ysrcp: వైసీపీపై సుమన్‌బోస్ కామెంట్స్, ఏపీ ప్రజలు నిజం చేశారంటూ..

Siemens ex MD comments ysrcp: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో ఒకొక్కరు బయటకు వస్తున్నారు. తాజాగా సీమెన్స్ సంస్థ మాజీ ఎండీ సుమన్ బోస్ ఆసక్తి కరమైన పోస్ట్ చేశారు. వైసీపీని ఉద్దేశించి కర్మఫలం ఇది.. న్యాయం గెలుస్తుందని తాను చెప్పిన మాటల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజం చేశారంటూ X లో పోస్టు చేశారు.

- Advertisement -

ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌కు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరగాలని ఆకాంక్షించారు. ఏపీ స్కిల్స్ డెవలప్మెంట్ కేసులో భాగంగా సీమెన్స్ ప్రాజెక్టుపై గత వైసీపీ ప్రభుత్వం బురద చల్లింది. దీనిపై లోకేష్, బ్రహ్మణి చేసిన పోస్టులను ట్యాగ్ చేశారాయన.

- Advertisement -

గత వైసీపీ ప్రభుత్వం ఏపీ స్కిల్ డెవలప్మెంట్‌లో అవినీతి జరిగింది ఆరోపించింది. అంతేకాదు కేసు నమోదు చేయడమేకాదు.. టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసింది. ఈ వ్యవహారంపై అప్పటి సీమెన్స్ కంపెనీ ఎండీ సుమన్ బోస్ క్లారిటీ ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో ఎలాంటి అవినీతి చోటు చేసుకోలేదని, షెల్ కంపెనీలకు నిధులు వెళ్లాయడం నిరాధారమని తెలిపారు.

2021లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం చాలా బాగుందని చెప్పిన వైసీపీ, ఎందుకు కేసు పెట్టిందో అర్థం కావడంలేదన్నారు సుమన్ బోస్. వైసీపీ ప్రభుత్వం కారణంగా జీవితంలో తాను సంపాదించుకున్న పేరు ప్రతిష్టలకు తీవ్ర విఘాతం కలిగిందన్నారు. అంతేకాదు దీని ద్వారా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్నారు. తమ ప్రాజెక్టులో అవినీతి ఎలాంటి తావులేదని, డిస్కౌంట్ రూపంలో ఆ సంస్థ సేవలు అందించిందని, అలాంటప్పుడు అవినీతి ఏమాత్రం తావులేదని చెప్పిన విషయం తెల్సిందే.

ALSO READ: లోగుట్టు బయటకు, వచ్చేవారం రుషికొండకు సీఎం చంద్రబాబు! మాయా‌మహల్ సందర్శన..

ఏపీలో పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం సీమెన్స్ కంపెనీతో కలిసి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో సీమెన్స్ టెక్నాలజీ భాగస్వామి మాత్రమే. ప్రభుత్వం విజన్ పెద్దదిగా ఉండడంతో డిజైన్ టెక్ సిస్టం ఇంట్రిగేటర్‌గా పని చేసింది. సాప్ట్‌వేర్, హార్డ్‌వేర్ సమకూర్చడంతోపాటు టీచింగ్ సిబ్బందిని సమకూర్చిన విషయం తెల్సిందే.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News