Big Stories

YS Sharmila: ఏపీలో కాంగ్రెస్‌కు ఎందుకు ఓట్లు పడలేదంటే ? : వైఎస్ షర్మిల

YS Sharmila: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాకపోవడంపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. ఫర్ జగన్.. అగెనెస్ట్ జగన్ పేరుతో ఏపీలో ఎన్నికలు జరిగాయని అన్నారు. అంతే కాకుండా ప్రజలు మార్పు కోసం జగన్‌ను ఓడించారని తెలిపారు. ప్రజలు ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేక పోయిందని చెప్పారు.

- Advertisement -

రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా విజయవాడలోని ఏఐసీసీ రాష్ట్ర కార్యాలయంలో వేడుకులు నిర్వహించగా ఈ కార్యక్రమానికి వైఎస్ షర్మిల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. ఎన్నికల ప్రచారానికి తగిన సమయం లేకపోవడం వల్లే కడపలో ఎంపీగా గెలవలేకపోయానని చెప్పారు.

- Advertisement -

రాహుల్ గాంధీ దెబ్బకు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ చతికిల పడిందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పేరే తప్ప.. బీజేపీ చేతిలో పవర్ లేదని అన్నారు. సీఎం చంద్రబాబు మద్దతు ఇవ్వకపోతే ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉండేది కాదన్నారు.

Also Read: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

ఏపీ ప్రజలను ప్రధాని మోదీ మోసం చేశారని షర్మిల అన్నారు. పదేళ్లు హోదా ఇస్తామని చెప్పి మాట మార్చారని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన ఎంపీల వల్లే బీజీపీ అధికారంలో ఉందని అన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని అన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News