EPAPER

RGV: తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి.. విద్యార్థులకు వర్మ కామపాఠాలు..

RGV: తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి.. విద్యార్థులకు వర్మ కామపాఠాలు..

RGV: “నచ్చింది తినండి.. తాగండి.. ఎంజాయ్ చేయండి.. ప్రపంచంలో శృంగారం, ఆహారమే ముఖ్యం. మనిషి జంతువులా జీవించాలి.. ఉన్నది ఒక్కటే జీవితం.. చనిపోయాక స్వర్గానికి వెళ్తే రంభ, ఊర్వశి, మేనకలు ఉండకపోవచ్ఛు.. కాబట్టి ఇక్కడే ఎంజాయ్ చేయండి.. భయంకరమైన వైరస్ వచ్చి నేను తప్ప మగజాతి అంతా పోవాలి.. అప్పుడు స్త్రీ జాతికి నేను ఒక్కడినే దిక్కు కావాలి”… ఇవన్నీ రాంగోపాల్‌వర్మ నోటి నుంచి వచ్చిన కామ సూక్తులు.


ఆర్జీవి ఇలాంటి కామెంట్లు చేయడం రొటీనే. యూట్యూబ్‌లో ఆర్జీవీ అని టైప్ చేస్తే.. అన్నీ ఇలాంటి వీడియోలో కనిపిస్తాయి. కొంచెం అటూఇటూగా రెగ్యులర్‌గా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తుంటారు. అది ఆయన ఇష్టం. వినేవారి కష్టం. అయితే, మీడియాలో మాట్లాడినట్టు.. నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థుల ముందు మాట్లాడటమే వివాదానికి కారణమైంది. వర్సిటీలో వర్మ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.

ఇంకెవరూ లేనట్టు.. విద్యాలయాలకు ఆర్జీవీ లాంటి వాడిని అతిథిగా పిలుస్తారా? విద్యార్థులకు వర్మతో ప్రసంగాలు ఇప్పించాలని ఎవరైనా భావిస్తారా? కానీ, నాగార్జున యూనివర్సిటీ ఆ పని చేసింది. వర్మను గెస్ట్‌గా పిలవడం.. ఆయనేమో తాగండి, తినండి, ఎంజాయ్ చేయడంటూ నోటికొచ్చినట్టు మాట్లాడటం.. అవి వినలేక మహిళలు చెవులు మూసుకోవడం అంతా జరిగిపోయింది.


వర్మ వాగుడుకు వర్శిటీ వీసీ సైతం వత్తాసు పలకడం ఇంట్రెస్టింగ్ పాయింట్. రాంగోపాల్ వర్మ ఒక ప్రొఫెసర్.. ఫిలాసఫర్ కంటే ఎక్కువ.. వర్మకు పీహెచ్‌డీ, ఆస్కార్ కంటే ఎక్కువ అర్హతలు ఉన్నాయి.. అంటూ వీసీ ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేయడం మరింత చోద్యం.

వర్మ స్పీచ్ వైరల్ కావడంతో.. నాగార్జున యూనివర్సిటీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. విద్యార్థుల ముందు ఇలాంటి ప్రసంగాలు ఇప్పించిన వీసీని అంతా తప్పుబడుతున్నారు. వర్మను లైట్ తీసుకుంటూనే.. మరీ స్టూడెంట్స్‌కు ఇలాంటి సలహాలు ఇవ్వడంపై మండిపడుతున్నారు.

Pawan Kalyan: జనసేనానికి జగన్ భయపడ్డారా? ‘వారాహి’ యాత్ర, సభ సక్సెస్ అందుకేనా?

Crab carbon:-క్రాబ్స్ సాయంతో కొత్త రకం బ్యాటరీలు తయారీ..

Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×