Big Stories

Rammohan Naidu: తెలంగాణ నుంచి ఇద్దరు, రామ్మోహన్ తొలి పలుకులు, ఆ విషయంలో..

Rammohan naidu: కొద్దిగంటల్లో కేంద్రంలోని మోదీ కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీడీపీ తరపున ఏపీ నుంచి ముగ్గురు మంత్రులకు చోటు దక్కనుంది. వారిలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఒకరు. తొలిసారి ఓ న్యూస్ ఏజెన్సీతో ఆయన మాట్లాడారు.

- Advertisement -

చాలాకాలం తర్వాత కేంద్ర కేబినెట్‌లోకి టీడీపీ వస్తుందన్నారు. ఇప్పటివరకు తాము ఎలాంటి డిమాండ్లను పెట్టలేదన్నారు. వారితో మా మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయని, తామంతా చాలా హ్యాపీగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. రిజర్వేషన్ల విషయంలో తమ స్టాండ్‌లో ఎలాంటి మార్పు లేదని మనసులోని మాట బయటపెట్టారు.

- Advertisement -

మరోవైపు కేంద్రప్రభుత్వంలో మంత్రివర్గ కూర్పు దాదాపు పూర్తి అయ్యింది. ఐదుగురు కంటే ఎక్కువ సభ్యులున్న మిత్రపక్షాలకు ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు చోటు లభించింది. ఒకరు కేంద్రమంత్రి కాగా మరొకరికి సహాయమంత్రిగా ఛాన్స్ లభించనుంది. పట్టణాభివృద్ధి, ఐటీ, సామాజిక న్యాయ శాఖలను తెలుగుదేశంకు కేటాయించే అవకాశం ఉంది.

ALSO READ: అమెరికా నుంచి వచ్చిన విజయమ్మ, జగన్‌బాబుకు ఓదార్పు.. దూకుడు వద్దంటూ

కేంద్రమంత్రివర్గంలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు చోటు లభించినట్టు సమాచారం. ఇద్దరు కలిసి ప్రధాని నివాసంలో జరిగే తేనీటి విందు‌కు హాజరయ్యారు. ఇదిలావుండగా లోక్‌సభ‌కు ఎన్నికైన మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్‌సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్, బస్వరాజ్ బొమ్మైల్లో ఒకరిని స్పీకర్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంది.

 

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News