Big Stories

CM Chandrababu: పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో తన మార్క్, మార్పు చూపిస్తున్నారు. ప్రభుత్వ ప్రక్షాళన విషయంలో తన వైఖరిని స్పష్టం చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే హామీల అమలుపై ప్రణాళికతో వేగంగా పనులు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాలసీల ప్రకటనకు ముందే సమగ్ర కసరత్తు జరగాలి.. పాలసీలకు సంబంధించిన ప్రణాళిక ఉండాలి.. పనుల్లో జాప్యం ఉండకూడదని అధికారులను సీఎం ఆదేశించారు.

- Advertisement -

పూర్తి స్థాయి ప్రక్షాళన దిశగా వివిధ విభాగాలపై సీఎం దృష్టి సారించారు. అందులో భాగంగానే అన్ని విభాగాల్లో మార్పులు, చేర్పులు చేపట్టారు. అధికారుల బదిలీలపైన కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం సీఎంఓ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో సీఎం సమావేశం కానున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచక పాలన, అవినీతి పాలన ప్రక్షాళన దిశగా ప్రభుత్వ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కోసం వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్పందన కార్యక్రమం పేరు తొలగించి అందుకు బదులుగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థగా దానిని కొనసాగించాలని సీఎం తెలిపారు.

- Advertisement -

Also Read: మీ సేవలు అమోఘం.. తెలుగు ఐఏఎస్‌ కృష్ణతేజపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు

పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ పేరుతో ఫిర్యాదుల స్వీకరణకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్లను హెచ్చరించారు. తమ ప్రభుత్వం ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దాలని తెలిపారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్, అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ తక్షణ అమలుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ప్రక్షాళన దిశగా సీఎం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల పలువురు అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News