Big Stories

Pinnelli Ramakrishna Reddy Arrest: బ్రేకింగ్.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్..!

Pinnelli Bail Extension Dismissed: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ముందస్తు, మధ్యంతర బెయిల్స్ ను పొడిగిస్తూ గతంలో ఇచ్చిన తీర్పును డిస్మిస్ చేసింది. ఈవీఎం ధ్వంసం సహా ఇతర కేసుల్లోనూ ముందస్తు బెయిల్ కోరుతూ వేసిన పిటిషన్లను కొట్టివేసింది. దీంతో ఏపీ పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి నరసరావుపేట ఎస్పీ కార్యాలయానికి తరలించారు.

- Advertisement -

మే 13న ఏపీలో పోలింగ్ జరగ్గా.. పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారు. దీంతో పాటు మరో మూడు ఘటనల్లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు.

- Advertisement -

ఈవీఎం ధ్వంసం, మహిళను దుర్భాషలాడటం, సీఐ పై దాడి కేసులతో పాటు మరో కేసు కూడా నమోదైంది. నాలుగు కేసుల్లో అరెస్ట్ చేయకుండా ముందస్తు, మధ్యంతర బెయిల్స్ పొందిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని.. జూన్ 6 వరకూ అరెస్ట్ చేయవద్దని హై కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత బెయిల్స్ ను పొడిగించాలని కోరడంతో.. హైకోర్టు బెయిల్ గడువును పొడిగించి.. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకూ అరెస్ట్ చేయవద్దని సూచించింది. తాజాగా హైకోర్టు ముందస్తు, మధ్యంతర బెయిల్ పొడిగింపు తీర్పును డిస్మిస్ చేయడంతో పాటు.. బెయిల్ పిటిషన్లను కొట్టివేయడంతో.. పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు.

Also Read: పిన్నెల్లి ఎక్కడ ? సినిమాను తలపిస్తోన్న పరారీ ఎపిసోడ్

పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో బయటికి వచ్చాక.. పిన్నెల్లి బ్రదర్స్ పారిపోయే ప్రయత్నం చేశారు. ఆయన హైదరాబాద్ లో ఉన్నారని తెలుసుకున్న మాచర్ల పోలీసులు.. అదుపులోకి తీసుకునేందుకు హైదరాబాద్ కు వచ్చారు. పోలీసులు వస్తున్నట్లు తెలుసుకున్న పిన్నెల్లి బీదర్ వైపుగా వెళ్లారు. సంగారెడ్డిరెడ్డి కారును డ్రైవర్ కు అప్పగించి.. ఫోన్ కూడా అక్కడే వదిలేసి పరారయ్యారు. అక్కడి నుంచి ఏపీ హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ పొందారు.

వైసీపీ తరఫున మళ్లీ మాచర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఈసారి ఓటమి పాలయ్యారు. టీడీపీ నుంచి పోటీ చేసిన జూలకంటి బ్రహ్మానందరెడ్డి.. పిన్నెల్లిపై 33,318 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 89,095 ఓట్లు రాగా.. బ్రహ్మానందరెడ్డికి 1,22,413 ఓట్లు వచ్చాయి. వైసీపీ చేసిన అరాచకాలు, తప్పిదాల వల్లే ఓటమిని చవిచూడక తప్పలేదు. మాచర్లను తమ కంచుకోటగా భావించిన వైసీపీకి పరాజయం తప్పలేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News