EPAPER
Kirrak Couples Episode 1

Perni Nani : జగన్ తో ఇదే చివరి మీటింగ్ ? పేర్ని నాని సంచలన ప్రకటన..!

Perni Nani :  జగన్ తో ఇదే చివరి మీటింగ్ ?  పేర్ని నాని సంచలన ప్రకటన..!

Perni Nani News(AP political news): మాజీ మంత్రి పేర్ని నాని వైసీపీలో మంచి వాక్ చాతుర్యం ఉన్న నాయకుడు. తన మాటల తూటాలతో ప్రత్యర్థి పార్టీల నేతలపై విరుచుకుపడుతూ ఉంటారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరు చెబితే ఒంటికాలిపై లేస్తారు. జనసేనాని ఎక్కడైనా మీటింగ్ లో మాట్లాడితే.. వెంటనే పేర్ని నాని మీడియా ముందుకు వచ్చేస్తారు. ప్రభుత్వంపై పవన్ చేసిన విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇచ్చేస్తారు. ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను తిప్పికొడతారు.


వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత పేర్ని నాని జగన్ వెంటే నడిచారు. ఆయనకు అత్యంత సన్నిహిత నేతగా మెలిగారు. వైసీపీ అధికారంలోనే రాగానే మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. కానీ జగన్ కేబినెట్ 2.0 లో పేర్ని నానికి చోటు దక్కలేదు. ఆ తర్వాత నుంచి పొలిటికల్ గా గతంలో మాదిరిగా యాక్టివ్ గా కనిపించటంలేదు. మంత్రి పదవి పోవడంతో ఆయన అలిగారని వైసీపీలో గుసగుసలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.

తాజాగా బందరు పోర్టు పనులను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పేర్ని నాని సంచలన ప్రకటన చేశారు. సీఎం జగన్ తో తన చివరి మీటింగ్ ఇదేనేమో ? అని అన్నారు. మరోసారి జగన్ తో వేదిక పంచుకునే అవకాశం వస్తుందో? రాదో? అని వేదాంత ధోరణిలో మాట్లాడారు. రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నానని ప్రకటించేశారు.


పేర్ని నాని ఇలా మాట్లాడుతుండగా జగన్ నవ్వుతూ కనిపించారు. అంటే పేర్ని నాని వ్యాఖ్యలను సరదాగానే తీసుకున్నానన్న విధంగా ఆయన హావభావాలున్నాయి. ఎక్కడా సీరియస్ గా ఉన్నట్లుగా కనిపించలేదు.

మరోవైపు కొంతకాలంగా మచిలీపట్నం నియోజకవర్గంలో పేర్ని నాని కుమారుడు కిట్టు చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కడ ఏ కార్యక్రమైనా కిట్టు ఆధ్వర్యంలో జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు బరిలోకి దిగుతారని పేర్ని నాని గతంలోనే ప్రకటించారు. ఇలా కుమారుడికి గ్రౌండ్ ప్రిపేర్ చేశారు. కానీ రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నానని తాజాగా చేసిన ప్రకటనే వైసీపీ శ్రేణుల్లో కలవరం రేపుతోంది.

పేర్ని నాని మచిలీపట్నం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999 ఎన్నికలో కాంగ్రెస్ నుంచి తొలిసారి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటి చేసి ఓడినా.. తిరిగి 2019లో గెలుపొందారు. పేర్ని నాని తండ్రి కృష్ణమూర్తి కూడా మచిలీపట్నం ఎమ్మెల్యేగా పనిచేశారు. తండ్రి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన పేర్ని నాని.. ఇప్పుడు కుమారుడిని కూడా రాజకీయ అరంగేట్రం చేయించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మరి వైసీపీ అధినేత జగన్ పేర్ని నాని రిటైర్ మెంట్ కు ఆమోదం తెలుపుతారా..? ఆయన కుమారుడు పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా..?

Related News

Waiting For Help: సీఎం గారూ.. నా కొడుకును బ్రతికించండి, ఓ తల్లి కన్నీటి వ్యథ

Cm Chandrababu : శభాష్… చాలా మంచి పని చేశారు, ప్రజలను మెచ్చుకున్న సీఎం చంద్రబాబు

Pawan Kalyan: పవన్‌కు అస్వస్థత, ఆ సమస్య తిరగబడిందా?

Kadambari jethwani case : ముంబయి నటి కాదంబరి కేసులో కీలక పరిణామం… నేడో రేపో సీఐడీ చేతికి ?

AP Govt: దసరాకు సూపర్ కానుక ప్రకటించిన ప్రభుత్వం.. మీరు మాత్రం మిస్ చేసుకోవద్దు

Home Minister: కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా?.. అయితే ఈ శుభవార్త తెలుసా..?

Pawan Klayan: వైసీపీకి ఝలక్ ఇచ్చిన పవన్.. విచారణ ఎదుర్కోవాల్సిందే.. రెడీగా ఉండండి అంటూ ప్రకటన

Big Stories

×