BigTV English

Perni Nani : మాకూ ఉన్నాయ్ చెప్పులు.. పవన్ కు పేర్ని నాని కౌంటర్..

Perni Nani : మాకూ ఉన్నాయ్ చెప్పులు.. పవన్ కు పేర్ని నాని కౌంటర్..


Perni Nani vs Pawan Kalyan(AP political news) : జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఏపీలో పొలిటికల్ హీట్ ను పెంచింది. జనసేన, వైసీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ పవన్ కల్యాణ్ గతంలో వైసీపీ నేతలకు చెప్పు చూపించారు. ఇప్పుడు మాజీ మంత్రి పేర్ని నాని రెండు చెప్పులు చూపించి కౌంటర్ ఇచ్చారు. దీంతో రాజకీయం మరింత వేడెక్కింది.

వారాహి యాత్ర చేపట్టిన జనసేనాని ఏపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. కాకినాడ జిల్లా కత్తిపూడిలో జరిగిన బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అసెంబ్లీలోకి అడుగుపెట్టకూడదని కక్ష కట్టారని.. ఈసారి ఎలా అడ్డుకుంటారో చూస్తానని వైసీపీ నేతలకు సవాల్ చేశారు. అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఎవడు ఆపుతాడో చూస్తానన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ కౌంటర్ ఎటాక్ కు దిగింది. పేర్ని నాని మరోసారి పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు.


అది వారాహి కాదు.. నారాహి అని జనసేనాని యాత్రపై పేర్ని నాని సెటైర్లు వేశారు. పవన్ రోజుకో డైలాగ్ చెప్పి అది వ్యూహం అంటారని విమర్శించారు. ప్రజలను నమ్ముకుంటే గెలుస్తామని.. కానీ చంద్రబాబు వ్యూహాలు నమ్ముకుంటే జనసేనాని అసెంబ్లీ అడుగు పెట్టలేరని స్పష్టం చేశారు. టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు పవన్ పని చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లుగా చంద్రబాబే జనసేనను నడుపుతున్నారని ఆరోపించారు. చిన్నపిల్లవాడిని అడిగినా ఇదే విషయం చెబుతాడని అన్నారు. చంద్రబాబు కోసం పవన్ కల్యాణ్ దిగజారిపోయారని విమర్శించారు.

తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఏపీపై విమర్శలు చేస్తుంటే పవన్ ఎందుకు మాట్లాడటం లేదని పేర్ని నాని నిలదీశారు. పవర్ స్టార్ సినిమాలను వైసీపీ ప్రభుత్వం ఆపలేదని స్పష్టం చేశారు. ఏ సినిమా ఆపామో ఆయనే చెప్పాలని ప్రశ్నించారు. సినిమాలు బాగా తీయక పోతే ఆడతాయా అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సినిమా టిక్కెట్ల పై ట్యాక్స్ లేదా అని ప్రశ్నించారు. ఇలా జనసేనానిపై పేర్ని నాని చేసిన విమర్శలు ఏపీ రాజకీయాల్లో హీట్ పుట్టించాయి. మరి పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×