EPAPER

Pawan Kalyan: ఈసారి ఎలా ఆపుతారో చూస్తా.. హ్హ.. పవన్ ప్రభంజనం..

Pawan Kalyan: ఈసారి ఎలా ఆపుతారో చూస్తా.. హ్హ.. పవన్ ప్రభంజనం..
pawan kalyan speech

Pawan Kalyan speech today live(AP Politics): ఈసారి అసెంబ్లీకి రాకుండా ఎలా ఆపుతారో చూస్తా.. దమ్ముంటే అడ్డుకోండంటూ సీఎం జగన్‌కు సవాల్ విసిరారు జనసేనాని పవన్ కల్యాణ్. విడిగా వస్తానో.. ఉమ్మడిగా వస్తానో.. ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. కానీ, రావడం మాత్రం పక్కా అని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి పదవి ఇస్తే సంతోషంగా స్వీకరిస్తానన్నారు. గతంలో తనపై కక్ష కట్టి.. గాజువాక, భీమవరంలో ఓడించారని.. ఈసారి తాను అసెంబ్లీలో అడుగుపెట్టడం మాత్రం ఖాయమని ఛాలెంజ్ చేశారు. కాకినాడ జిల్లా కత్తిపూడి బహిరంగ సభలో.. చేగువేరా పుట్టినరోజు నాడు.. వారాహి నుంచి ఎన్నికల శంఖారావం పూరించారు పవన్ కల్యాణ్.


అధికార వైసీపీకి అన్ని పార్టీలు భయపడుతుంటే.. జనసేన మాత్రమే చెప్పు చూపించి.. మక్కెలు ఇరగ్గొడతామని హెచ్చరించిందన్నారు పవన్. 151 మంది ఎమ్మెల్యేలున్న పార్టీ.. ఒక్క సీటు కూడా లేని జనసేనను టార్గెట్‌ చేసిందంటే.. వైసీపీకి మనమంటే ఎంత భయమో తెలుస్తోందన్నారు.

రాజకీయాల్లో అక్రమంగా సంపాదించిన వ్యక్తులతోనే తన పోరాటమని.. తనన్ను పాలించేవారు తన కంటే నిజాయితీపరుడై ఉండాలన్నారు జనసేనాని. సామాన్యులు అవినీతి చేస్తే ఏసీబీ, సీబీఐ ఉన్నాయని.. మరి, సీఎం అవినీతి చేస్తే పట్టుకునేవాళ్లు ఎవరని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ అవినీతిని ప్రజలే ప్రశ్నించాలని పిలుపు ఇచ్చారు.


పార్టీని పదేళ్లు నడపడం సాధారణ విషయం కాదన్నారు. తన బిడ్డల కోసం పెట్టిన నిధితో.. పార్టీ ఆఫీసు కట్టానని చెప్పారు.

వారాహి వేదికగా కొన్ని ఎన్నికల హామీలు కూడా వదిలారు జనసేనాని. అధికారంలోకి వస్తే కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని.. కొత్త దంపతులకు ఇళ్ల కేటాయింపుల్లో ప్రధాన్యత ఇస్తామని.. నవజంటకు కచ్చితంగా ఆర్థికసాయం చేస్తామని ప్రకటించారు. పవన్ కల్యాణ్ ఇంకా ఏమన్నారంటే….

రాజధానిగా అమరావతే ఉంటుంది -పవన్
రాజధానిపై కుల ముద్ర వేయటం దారుణం -పవన్
అమరావతిలో రైతుల ఆత్మహత్యలకు వైసీపీ ప్రభుత్వమే కారణం -పవన్
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతి రాజధానిని ఎందుకు వ్యతిరేకించలేదు?

పార్టీని నడిపించేందుకే సినిమాలు చేస్తున్నా -పవన్
పెద్ద వ్యక్తులతో నేను పోరాటం చేస్తున్నాను -పవన్‌
తలవంచుకుని బతికే అలవాటు నాకు లేదు -పవన్
నాకోసం నేను రాజకీయాల్లోకి రాలేదు -పవన్
దోపిడిదారులు, అవినీతిపరులతో పోరాడుతున్నా -పవన్‌
వైసీపీకి ఇంటెలిజెన్స్ కావాలి.. నాకు మాత్రం నా అభిమానులు కావాలి
వైసీపీ నేతలు నా నాలుగేళ్ల బిడ్డతో సహా అందరినీ తిడతారు -పవన్
గాజువాకలో నన్ను గెలిపించి ఉంటే కనీసం రుషికొండనైనా కాపాడేవాడిని -పవన్

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×