BigTV English
Advertisement

Perni Nani : బీజేపీతో కటీఫ్.. టీడీపీ పంచకు పవన్ : పేర్ని నాని

Perni Nani : బీజేపీతో కటీఫ్.. టీడీపీ పంచకు పవన్ : పేర్ని నాని

Perni Nani : జనసేన ఆవిర్భావ సభలో జనసేనాని చేసిన విమర్శలపై వైసీపీ నేతలు ఘాటు స్పందించారు. కాపు యువతను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని పవన్ చూస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మొన్నటి వరకు తనకు కులం లేదని చెప్పిన వ్యక్తి ఇప్పుడు కాపు కులాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. పవన్‌ కల్యాణ్‌ కుల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అన్నీ అసత్యాలే మాట్లాడారని, పవన్ ప్రసంగం విడ్డూరంగా ఉందని పేర్ని నాని సెటైర్లు వేశారు.


కలిసే పోటీకి రండి..
బీజేపీ కటీఫ్ చెప్పి టీడీపీ పంచన చేరడానికి పవన్ తాపత్రయ పడుతున్నారని పేర్ని నాని ఆరోపించారు. ప్రధాని మోదీ మంచివారని చెప్తూనే రాష్ట్ర బీజేపీ నేతలను జనసేనాని తప్పుపట్డడాన్ని పేర్ని నాని ప్రస్తావించారు. తెలివితేటలను ఎవరైనా పవన్‌ దగ్గరే నేర్చుకోవాలని సెటైర్లు వేశారు. చంద్రబాబు మేలు కోసమే పవన్‌ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ముసుగు తొలగిపోయిందని ..చంద్రబాబుతో కలిసి వెళ్తున్నానని చెప్పినందుకు
సంతోషమన్నారు. 2014లో కాపు కులాన్ని టీడీపీ దగ్గర పెట్టారని, ఇప్పుడు చంద్రబాబు దమ్ము లేక పవన్‌ను వాడుకుంటున్నారని అని పేర్ని నాని నిప్పులు చెరిగారు. విడివిడిగా కాదు.. కలిసే పోటీకి రావాలని సవాల్ చేశారు. కాపులందరూ సీఎం జగన్‌ వైపే ఉన్నారని స్పష్టం చేశారు.

అన్నపై విమర్శలా..?
చిరంజీవిపై పవన్‌ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారని పేర్ని నాని అన్నారు. పార్టీ పెట్టి మూసింది ఎవరు? పవన్‌ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చానంటున్నారు, గతంలో ప్రజారాజ్యంలో పని చేయలేదా? అని ప్రశ్నించారు. పీఆర్పీ ఓటమి తర్వాత చిరంజీవిని ఒంటరిని చేయలేదా? అని పేర్ని నాని నిలదీశారు.


Kotamreddy : అసెంబ్లీలో కోటంరెడ్డి నిరసన.. నమ్మకద్రోహి అంటూ వైసీపీ కౌంటర్..

Pawan Kalyan : ఒంటరిగా పోటీకి వెనుకాడం.. పొత్తులపై జనసేనాని క్లారిటీ..

Related News

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

Big Stories

×