Big Stories

Red Sandal smuggling : పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి ఎర్ర చందనం స్మగ్లింగ్.. బయటపెట్టిన పవన్

Peddireddy and Mithun Reddy Red Sandal Smuggling: జగన్ సర్కార్‌లో ఆ పార్టీ కీలక నేతలు చేసిన ఆగడాలు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. వైసీపీలో జగన్ తర్వాత పెద్దిరెడ్డి పేరు బలంగా వినిపించేది. చాలా విషయాల్లో ఆయన ఇష్టానుసారంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. తాజాగా వైసీపీకి చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి గుట్టు బయట పెట్టారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. పెద్దిరెడ్డి, ఆయన కొడుకు మిథున్‌రెడ్డి ఎర్ర చందనం అక్రమంగా తరలిస్తూ నేపాల్‌ పోలీసులకు చిక్కారన్నారు.

- Advertisement -

శేషాచలం ఫారెస్ట్ పేరు చెబితేచాలు.. ఎర్రచందనం గుర్తుకు వస్తుంది. కోట్లాది రూపాయల సంపదను అప్పటి వైసీపీ ప్రభుత్వంలోని కొందరు నేతలు అక్రమంగా తరలించుకుపోయారు గుర్తు చేశారు. ఇదే విషయాన్ని బయటపెట్టారు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్. సోమవారం పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారాయన. ఈ సమావేశంలో కీలక విషయాలను బయటపెట్టారు. గడిచిన ఐదేళ్లుగా తన శాఖలో జరిగిన వైసీపీ అరాచకాలను బయటపెట్టారు.

- Advertisement -

ALSO READ: పోలీసులపై మంత్రి భార్య దురుసు ప్రవర్తన.. చంద్రబాబు సీరియస్

ఎర్రచందనాన్ని అక్రమంగా వైసీపీ నేతలు తరలిస్తున్నా చెక్ పోస్టుల్లో అధికారులు పెద్దగా పట్టించు కోలేదన్నారు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్. ఎర్ర చందనం నేపాల్ పోలీసులకు చిక్కిందని, దీనిపై వాళ్లు ఆరా తీస్తే తిరుపతి నుంచి వచ్చినట్టు తేలిందన్నారు. దీనికి సంబంధించిన ఫైలు తన టేబుల్ మీదకు వచ్చిందన్నారు. నేపాల్ బోర్డర్‌లో పట్టుబడిన ఎర్రచందనాన్ని తీసుకురావటానికి కిందామీదా పడుతున్నామని తెలిపారు. నేపాల్ పోలీసులు పట్టుకునే వరకు ఈ విషయం మనకు తెలీదని, ఈ లెక్కన చెక్ పోస్టుల్లో అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుందన్నారు.

గడిచిన ఐదేళ్లలో వారు చేసిన అక్రమాలు బయటకు వస్తాయని చెప్పకనే చెప్పారు జనసేనాని. వైసీపీ అరాచకాలపై తీగ లాగితే డొంక కదులుతోందన్నమాట. ఈ వ్యవహారంపై ఏపీలో అధికార- విపక్షాల నేతలు చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇన్ని విషయాలు తెలిసిన డిప్యూటీ సీఎం పవన్, వారిపై యాక్షన్ తీసుకుంటారా? లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి రాబోయే రోజుల్లో వైసీపీ పాలన గురించి ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News