Big Stories

Pawan Kalyan Takes Charge: శాఖలపై ఫుల్ ఫోకస్.. క్షణం కూడా తీరికలేదు..

Pawan Reviewed for 10 hours on the First day of Taking Charge as Deputy CM of AP: కొణిదెల పవన్‌ కల్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎం.. పలు శాఖలకు మంత్రి సంతకం పెట్టి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒక్క క్షణం కూడా వేస్ట్ చేసే ఉద్దేశం కనిపించడం లేదు ఆయనలో.. తనకు దక్కిన శాఖలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. అసలు ఏఏ పనులు చేపట్టారు? ఎక్కడి వరకు వచ్చాయి? ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు..? అసలు శాఖాల్లో పాలన ఎలా కొనసాగుతుంది? తనకు అన్ని తెలియాలంటున్నారు పవన్.. అంతేకాదు తనకు తెలియని విషయాలను తెలుసుకోవడంపై మొదట ఫోకస్ చేశారు. వదిన ఇచ్చిన పెన్నుతో సంతకం చేసి రిలాక్స్‌ అయిపోలేదు పవన్ కల్యాణ్.. పాలనలో తనదైన మార్క్‌ను చూపించడం మొదలుపెట్టారు.

- Advertisement -

బాధ్యతలు చేపట్టి తొలిరోజే ఏకంగా ఆరు గంటల పాటు అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. తొలిరోజు పంచాయతీరాజ్‌ అండ్ అటవీశాఖపై ఫోకస్ చేసిన ఆయన.. రెండో రోజు ఉపాధి హామీ పథకంలోని సోషల్ అడిట్ విభాగంతో సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పనులు ఎలా కొనసాగుతున్నాయి? నిధుల వాడకం ఎలా ఉంది? లబ్ధిదారులకు అందాల్సినవి సరిగ్గా అందుతున్నాయా? లేదా? అసలు రాష్ట్రంలో ఎన్ని పంచాయతీలున్నాయి. ఎన్ని మండలాలున్నాయి..? ఎన్ని జిల్లా పరిషత్‌లు ఉన్నాయి? ఎన్నికలు జరిగిన స్థానిక సంస్థలు ఎన్ని? జరగకుండా పెండింగ్‌లో ఉన్నవి ఎన్ని? స్థానిక సంస్థలకు అందుతున్న కేంద్ర నిధులెంత?

- Advertisement -

పంచాయతీరాజ్‌ శాఖలో డీఎల్‌డీవో, డీపీవో విభాగాలు ఏంటి? వాటి పనితీరు ఏంటి? ఆయా విభాగాల్లో ఉన్న సిబ్బంది ఎంత మంది? ఇలా అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు పవన్.. అన్నింటికి సమాధానాలు తెలుసుకున్నారు. నిజానికి పవన్‌కు గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితులపై ఖచ్చితమైన అవగాహన ఉంది. ఎన్నికలకు ముందు పవన్ అనేక గ్రామాల్లో పర్యటించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఆయనకు ఖచ్చితమైన అవగాహన ఉంది. మొదటగా ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితులను స్వయంగా చూశారాయన. అందుకే వాటి పరిష్కరించడంపై ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది. తనకు తెలిసిన సమస్యలే కాకుండా.. ఇంకేమున్నాయి? ఇలా సమస్యలన్నింటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మీకు గుర్తుండే ఉంటుంది. పవన్‌ చేసిన ఫస్ట్ సైన్.. గిరిజన ప్రాంతాల్లో పంచాయతీ భవనాల నిర్మాణాలకు సంబంధించిన ఫైల్‌పై పవన్ తొలి సంతకం చేశారు. కాబట్టి.. ఆయన వెనకబడిన ప్రాంతాలపై ఫోకస్‌ చేస్తున్నట్టు మాటలతో కాకుండా చేతలతో చూపించారు. అంతేకాదు పాలనపరమైన నిర్ణయాలు.. వాటి అమలులో పొలిటికల్ ఇంటర్‌ఫియరెన్స్ అస్సలు ఉండకూడదని చాలా స్ట్రిక్ట్‌గా ఆదేశించారు పవన్. రాజకీయాలు వేరు.. పాలన వేరు.. ఈ రెండింటికి ముడి పెట్టవద్దని క్లియర్‌ కట్ మెస్సేజ్ ఇస్తున్నారు.
కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు అందరిని ఒకే విధంగా చూడాలని.. పక్షపాతం అనేది ఉండకూడదన్నది పవన్ అభిమతంగా కనిపిస్తుంది.

Also Read: ఏపీలో స్టూడియోల నిర్మాణానికి ముందుకు రండి: మంత్రి కందుల దుర్గేష్

నిజానికి ఇది నిర్ణయమే.. గత పాలనలో మీ వారు.. మా వారు అన్నట్టుగానే ఉండేది వ్యవహారం. ప్రతి సంక్షేమ పథకం అమలులో వైసీపీ కార్యకర్తలు, అభిమానులకు అగ్రతాంబూలం దక్కేదన్న విమర్శలు ఉన్నాయి. ఇకపై ఇలాంటివి ఉండకూడదని చెప్పకనే చెబుతున్నారు పవన్.. అదొక్కటే కాదు.. పాలనను పరుగులు పెట్టిస్తూనే.. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై కూడా పవన్‌ ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ తన ప్రచారంలో చాలా సార్లు పంచాయతీ నిధుల మళ్లింపుపై మాట్లాడారు. గ్రామాలకు చేరాల్సిన నిధులు సర్పంచ్‌లకు అందించకుండా ఇతర పనులకు ఉపయోగించడం తన దృష్టికి వచ్చిందన్నారు పవన్.. కాబట్టి.. ఇప్పుడు ఓ బాధ్యత గల మంత్రిగా ఈ అంశంపై ఫోకస్ చేశారు పవన్.. రివ్యూ మీటింగ్‌లో దీనిపై కూడా చాలా సేపు మాట్లాడినట్టు తెలుస్తుంది.

తన దృష్టికి వచ్చిన పంచాయతీ నిధుల మల్లింపులపై సుదీర్ఘంగా సమావేశంలో చర్చించారు. అసలు గ్రామ పంచాయతీల నిర్వహణలో సర్పంచ్‌లు ఎదుర్కొన్న సమస్యలేంటి? వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలేంటి? అనే దానిపై చర్చించారు. దివ్యాంగులకు ఉపాధిలో పనులు ఎలా కల్పిస్తారు..? సోషల్‌ ఆడిట్‌ అంటే ఏమిటి?.. దాని పనితీరు ఏ విధంగా ఉంది? ఎంత రికవరీ చేశారు? లాంటి వాటి గురించి సోషల్‌ ఆడిట్‌ డైరెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. పంటకుంటలు, అమృత్‌ సరోవర్‌, జలకళలో బోర్లు, వాటర్‌షెడ్‌.. ఇలా అనేక ప్రాజెక్టుల గురించీ పవన్ ఆరా తీశారు. కాబట్టి.. పవన్‌కు తాను మంత్రిగా చేయాల్సిన పనులేంటి? తీసుకోవాల్సిన నిర్ణయాలేంటి? అనే దానిపై క్లారిటీ ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే ఇతర అంశాల్లో జోక్యం చేసుకోకుండా.. తనకు ఇచ్చిన శాఖలపైనే పవన్‌ ఫుల్ ఫోకస్ పెట్టినట్టు కూడా కనిపిస్తుంది. ఓ స్టూడెంట్‌లా పాలన విధానాన్ని నేర్చుకుంటూనే.. ఓ రూలర్‌లా ముందుచూపుతో నడుస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News