Big Stories

TDP: టీడీపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఇతనేనంటా..!

Andhra Pradesh TDP President: టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేరును ఆ పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న అచ్చెన్నాయుడికి మంత్రిగా అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పదవిని మరో నేతకు ఇవ్వాలని పార్టీ భావిస్తున్నది. బీసీ-యాదవ వర్గానికి చెందిన పల్లా పేరును రాష్ట్ర అధ్యక్ష పదవికి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే, ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి గుడివాడ అమర్ నాథ్ పై పల్లా శ్రీనివాసరావు భారీ మెజారిటీతో గెలుపొందారు. రాష్ట్రంలో అత్యధికంగా 95,235 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

- Advertisement -

ఇదిలా ఉంటే.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి పార్టీ అధిక సీట్లను కైసవం చేసుకుంది. గతంలో మాదిరిగా ఈసారి కూడా అత్యధిక సీట్లను సాధిస్తామని ఆశపడిన వైఎస్సార్ సీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇటు కూటమిలో బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో విఫలమైన జనసేన ఈసారి మాత్రం చరిత్ర సృష్టించింది. 21 సీట్లను సాధించింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలుపొందింది. మిగతా సీట్లలో టీడీపీ విజయం సాధించింది.

- Advertisement -

Also Read: ఏపీ మంత్రులకు కేటాయించిన శాఖలివే.. పవన్ చేతికి కీలక శాఖలు

ఈ నెల 12న రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మరునాడే పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు ఫైళ్లపై ఆయన సంతకం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించిన మొత్తం ఐదు ఫైళ్లపై ఆయన సంతకం చేశారు. అందులో టీచర్ల భర్తీకి సంబంధించిన ఫైల్ పై చంద్రబాబు మొదటి సంతకం చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News