BigTV English

TDP Mahanadu: మహానాడులో లోకేశ్ గ్రాండ్ ఎంట్రీ.. పసుపు పండుగ షురూ..

TDP Mahanadu: మహానాడులో లోకేశ్ గ్రాండ్ ఎంట్రీ.. పసుపు పండుగ షురూ..
nara lokesh mahanadu

TDP Mahanadu Meeting(AP Political News): అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ.. రాజమండ్రిలో పసుపు పండుగ మొదలైంది. టీడీపీ మహానాడుకు ఏపీ, తెలంగాణ నుంచి పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.


యువగళం పాదయాత్రకు నారా లోకేష్ విరామం ప్రకటించి.. మహానాడుకు హాజరయ్యారు. తొలుత గుంటూరు పార్లమెంట్ ప్రతినిధిగా నమోదు చేయించుకున్నారు. వేదికపై ఆశీనులైన ప్రతి ఒక్కరినీ పలకరించారు లోకేష్. కార్యకర్తలకు అభివాదం చేశారాయన.

రాజమహేంద్రవరం పసుపు రంగు పులుముకుంది. టీడీపీ మహానాడుకు తెలుగు రాష్ట్రాల నుంచి 15 వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. జగన్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయంటున్న టీడీపీ.. రాజమండ్రి మహానాడు చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాట్లు చేసింది.


తొలిరోజు ప్రతినిధుల సభ జరుగుతుంది. 21 తీర్మానాలపై చర్చించనున్నారు. వాటికి ఆమోదం తెలుపుతారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై డిజిటల్ ప్రదర్శన ఉంటుంది.

ఆదివారం బహిరంగ సభ నిర్వహిస్తారు. 15 లక్షల మంది హాజరవుతారని అంచనా వేశారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. రక్తదాన శిబిరం నిర్వహించారు.

Related News

Pulivendula Politics: జగన్‌కు కూటమి కౌంటర్.. బాయ్ కాట్ కాదు, బావిలో పడండి

Jagan on Pulivendula: జగన్ ప్రెస్‌మీట్.. పుటేజ్ బయటపెడతారా? ఓటమిని అంగీకరించినట్టేనా?

AP Liquor Shops: మందుబాబులకు గుడ్ న్యూస్! కొత్త జీవో పూర్తి వివరాలు..

Pulivendula ZP: పులివెందుల జెడ్పీ.. ఆ ముగ్గురు వ్యూహం, బెడిసికొట్టిన వైసీపీ ప్లాన్

Jagan: కూలిపోతున్న పులివెందుల కోట.. తప్పు ఎక్కడ జరిగింది? టెన్షన్‌లో జగన్‌

Viveka Murder Case: వివేకా హత్యకేసు విచారణలో కీలక మలుపు..

Big Stories

×