Big Stories

MP MithunReddy angry on TDP: పుంగనూరులో సీన్ రివర్స్, ఎంపీ మిథున్‌రెడ్డి గరంగరం.. అప్పుడు రఘురామరాజుకు..

MP MithunReddy angry on TDP: ఉమ్మడి చిత్తూరు జిల్లా పేరు చెబితేచాలు మందుగా పుంగనూరు గుర్తుకొస్తుంది. రెండు దశాబ్దాలుగా అక్కడ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిందే మాట. ఆయన మాట ఎవరూ దాటరు. ఒకవేళ ముందుకు అడుగు వేస్తే ప్రత్యర్థులకు కష్టాలు తప్పవు. ఇదంతా 2024 జూన్ నాలుగుకు ముందు. పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ప్రభుత్వాలు మారాయి.. కానీ కార్యకర్తలు మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు.

- Advertisement -

తాజాగా వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి పుంగనూరు పర్యటన వేళ పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందని భావించిన పోలీసులు అయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఐదేళ్ల వరకు అక్కడ అడుగు పెడితే ఊరుకునేది లేదని టీడీపీ కార్యకర్తలు తెగేసి చెబుతున్నారు. అసలు పుంగనూరులో ఏం జరుగుతోందన్న డీటేల్స్‌లోకి వెళ్తే.. వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి పుంగనూరు పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఆయన రాకను తెలుసుకున్న టీడీపీ-జనసేన-బీజేపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు.

- Advertisement -

పుంగనూరు టౌన్‌లోని అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసనకు దిగారు. ఎంపీ మిథున్ గో బ్యాక్ అంటూ నినాదా లు చేశారు. పరిస్థితి గమనించిన పోలీసులు.. ఎంపీ మిథున్‌రెడ్డి పుంగనూర్ రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో టీడీపీ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. మీడియా మిత్రులను పిలిచి చెప్పాల్సిన నాలుగు ముక్కలు సూటిగా చెప్పేశారాయన. పుంగనూరులో ఎప్పుడులేని విధంగా కొత్త సంస్కృతికి తెర లేపుతున్నా రని విమర్శించారు. ఫ్యాక్షన్ నియోజకవర్గాల మాదిరిగా తయారైందన్నారు. తనను నియోజకవర్గంలో పర్యటించకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్తాన న్నారు.

ఎంపీ మిథున్‌రెడ్డి కామెంట్స్‌పై తెలుగు తమ్ముళ్లు విరుచుకుపడుతున్నారు. దాదాపు 11 నెలల కిందట జరిగిందేంటని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. గతేడాది ఆగస్టు ఐదున టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాకను పెద్దిరెడ్డి అనుచరులు అంగళ్లు వద్ద అడ్డుకున్నారు. అంతేకాదు వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగారు. దీంతో వైసీపీ-టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు దెబ్బలు తగలడమేకాదు పోలీసులు వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అప్పుడు మీరు చేసిందేంటని ప్రశ్నిస్తున్నారు కూటమి నేతలు. చంద్రబాబు, ముఖ్యనేతలపై కేసులు నమోదు చేశారు. పలువుర్ని అరెస్టు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

ALSO READ: మన్ కీ బాత్‌.. సీఎం చంద్రబాబుతో కలిసి ప్రధాని మోదీ..

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును నాలుగేళ్లు రాకుండా నియోజకవర్గానికి రాకుండా అప్పటి వైసీపీ ప్రభుత్వం అడ్డుకోలేదా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మీరు చేస్తే శాంతిభద్రతలు, ప్రత్యర్థి పార్టీలు చేస్తే ఫ్యాక్షన్ రాజకీయాలా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. అంతెందుకు జూన్ 15న వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు టూర్‌ను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఆయన తన నియోజకవర్గానికి రాకుండానే వెనుదిరిగారు. గడిచిన 20 ఏళ్లుగా పెద్దిరెడ్డి వ్యవహారశైలితో అనేక మంది ఇబ్బందులుపడ్డామని, చివరకు జైలు జీవితాన్ని గడిపామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఎవరి చేసిన తప్పులు వాళ్లు అనుభవిస్తారని చెప్పడానికి ఇదో ఉదాహరణగా వర్ణిస్తున్నారు టీడీపీ సీనియర్ నేతలు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News