Big Stories

MLA Somireddy: ఏపీలో మద్యం కుంభకోణం.. జగన్ జైలుకు వెళ్లక తప్పదు: సోమిరెడ్డి చంద్రమోహన్

MLA Somireddy Chandra Mohan Reddy: ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఏపీలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఇక జగన్ జైలుకు వెళ్లకుండా తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. ప్రజల తీర్పుపై జగన్ మదన పడుతున్నారని అన్నారు. వైసీపీ పాలనలో ఏపీ అరాచకాలకు, అప్పులకు, దుర్మార్గాలకు అడ్డాగా మారింది అన్నారు. అన్నపూర్ణ లాంటి రాష్ట్రాన్ని జగన్ పూర్తిగా భ్రష్టు పట్టించారని ఆరోపించారు.

- Advertisement -

వైసీపీ నుంచి ప్రజలు విముక్తి కోరుకున్నారని అన్నారు. అందుకే ప్రజలు ఏపీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు చేతిలో పెట్టారని తెలిపారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం కంటే ఏపీలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపించారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని జగన్ కోట్లు దోచుకున్నారని అన్నారు. ఇక జైలుకు వెళ్లకుండా తప్పించుకోలేరని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.

- Advertisement -

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు సింగిల్ డిజిట్ వస్తుందని వైసీపీ నేతల సమావేశంలో జగన్ చేసిన వ్యాఖ్యలపై చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. జగన్ అరాచక పాలనకు ఫలితాన్ని త్వరలోనే అనుభవించి తీరుతారన్నారు. అక్రమాస్తుల కేసు విచారణలో కోట్టు మెట్లేక్కుందుకు జగన్ సిద్ధంగా ఉండాలన్నారు. లిక్కర్‌లోనే రూ. లక్షల కోట్లు దోపిడీ చేశారని.. ల్యాండ్, మైనింగ్ మాఫియాతో వేల కోట్లు అక్రమంగా దోచుకున్నారని ధ్వజమెత్తారు.

Also Read: స్పీకర్ స్థానంలో అయ్యన్నపాత్రుడు.. సభకు రాకూడదని జగన్ నిర్ణయం

సర్వేపల్లిలోనే దాదాపు వెయ్యి ఎకరాల భూమిని కాజేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ప్రయివేటు ఎస్టేట్‌గా మార్చుకోవాలని కుట్రలు చేశారని అన్నారు. అందుకోమే రాష్ట్రానికి జగన్ ఐదేళ్లలో చాలా నష్టం చేశారని అన్నారు. దుర్మార్గాలు చేసిన వారిని ప్రజలు సహించరని తెలిపారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రజలు తమకు అవకాశం ఇచ్చారని అన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News