Big Stories

Peddireddy comments: స్టేలకు కాలం చెల్లింది.. చంద్రబాబుపై మరిన్ని కేసులు..పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్..

Peddireddy comments on Chandrababu

Peddireddy comments on Chandrababu(AP politics):

స్కిల్‌ డెవలప్ మెంట్ స్కామ్ కేసు శాంపిల్ మాత్రమేనా? ఈ సమయంలోనే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసును ప్రభుత్వం తెరపైకి ఎందుకు తీసుకొచ్చింది? చంద్రబాబు మెడకు మరిన్ని కుంభకోణాలు చుట్టుకోనున్నాయా? ఈ ప్రశ్నలకు అవుననే వైసీపీ నేతలు, మంత్రులు సమాధానం ఇస్తున్నారు. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్తావించిన అంశాలు ఏపీలో పొలిటికల్ హీట్ ను మరింత పెంచుతున్నాయి.

- Advertisement -

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ ఆరంభం మాత్రమేనని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. పక్కా ఆధారాలతో సీఐడీ దర్యాప్తు చేస్తోందని తేల్చిచెప్పారు. టీడీపీ అధినేతపై ఇంకా చాలా కేసులు ఉన్నాయన్నారు. చంద్రబాబు దుర్మార్గపు వ్యవస్థ కూలిపోతోందన్నారు. పతనం అంటే ఏంటో చంద్రబాబుకు తెలుస్తోందని పెద్దిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

చంద్రబాబు అవినీతి చేయలేదని టీడీపీ నేతలే చెప్పలేకపోతున్నారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. సాంకేతిక కారణాలతో మాత్రమే అరెస్టు అక్రమమంటున్నారని విమర్శించారు. అవినీతి కేసులో చంద్రబాబు ఇన్నాళ్లూ స్టేలతో కాలం గడిపారని తెలిపారు. ఇక చట్టం తన పని తాను చేసుకుపోతోందని హెచ్చరించారు.

చంద్రబాబు అరెస్టుపై ప్రజల్లో ఎలాంటి సానుభూతి వ్యక్తం కాలేదని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. టీడీపీ చేపట్టిన బంద్ ను ప్రజలు పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్‌ కూడా నడించదన్నారు. లోకేష్‌తోపాటు టీడీపీ నేతలు బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసింది. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఇదే సమయంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు దర్యాప్తును సీఐడీ వేగవంతం చేయడం ఆసక్తిని రేపుతోంది. మరి భవిష్యత్తు ఎలాంటి ఆయనపై ఎలాంటి కేసులు నమోదుకాబోతున్నాయి. టీడీపీ అధినేత ఈ కేసుల నుంచి ఎలా బయటపడతారో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News