Big Stories

AP: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

AP Govt. ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మొత్తం 19 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ లను జీఏడీకి అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నది.

  • పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ కుమార్
  • వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్
  • కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది
  • పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్
  • పౌర సరఫరాల శాఖ కమిషనర్ గా సిద్ధార్థ జైన్
  • ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా సౌరభ్ గౌర్
  • పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్
  • నైపుణ్యాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా సౌరభ్ గౌర్ కు అదనపు బాధ్యతలు
  • ఐటీ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా కోన శశిధర్ కు అదనపు బాధ్యతలు
  • ఉద్యాన, మత్స్యశాఖ సహకార విభాగాల కార్యదర్శిగా బాబు.ఎ
  • ఏపీ సీఆర్ డీఏ కమిషనర్ గా కాటమనేని భాస్కర్
  • జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్‌
  • ఆర్థిక వ్యయ విభాగం కార్యదర్శిగా ఎం. జానకి
  • పశుసంవర్థ శాఖ కార్యదర్శిగా ఎం. ఎం. నాయక్
  • గనుల శాఖ డైరెక్టర్, కమిషనర్ గా ప్రవీణ్ కుమార్
  • ఏపీఎండీసీ ఎండీగా ప్రవీణ్ కుమార్ కు అదనపు బాధ్యతలు
  • ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్న
  • మురళీధర్ రెడ్డిని జీఏడీకి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశం
  • ఆర్థిక శాఖ కార్యదర్శిగా వినయ్ చంద్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News