Big Stories

Macherla Mystery: మాచర్ల మిస్టరీ.. పిన్నెల్లి వీడియో ఎలా లీకైంది..?

- Advertisement -

మాచర్లలోని ఓ పోలింగ్ బూత్‌లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన వీరంగం అందరికీ తెలిసిందే.. అయితే ఆ వీడియో బయటికి ఎలా వచ్చింది? పోలింగ్ ముగిసి పది రోజులైంది.. ఆల్ ఆఫ్‌ సడెన్‌గా మీడియాలో ఎలా ప్రత్యక్షమైంది ఆ వీడియో.. ఇప్పుడీ ప్రశ్న అందరిలోనూ మొదలైంది. అయితే దీనికి షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్.. ముకేష్‌ కుమార్ మీనా.. అసలు ఆ వీడియోను మేము రిలీజ్ చేయలేదంటూ సంచలన విషయం బయటపెట్టారు మీనా.. అసలు ఈసీ నుంచి ఆ వీడియో బయటికి వెళ్లలేదని చెప్పారు. మరి ఎలా వచ్చింది? ఇప్పుడిదే మెయిన్ క్వశ్చన్. ఈ విషయంపై అటు వైసీపీ నేతలు ప్రశ్నిస్తుండగా.. టీడీపీ నేతలు మాత్రం మౌనమే సమాధానం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -

రాజకీయాల్లో ఓ పద్ధతి ఉంటుంది. క్లారిటీ ఇవ్వలేనప్పుడు మరింత కన్‌ఫ్యూజ్ చేస్తారు. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్‌లో అదే జరుగుతోంది. పిన్నెల్లి పరారయ్యి.. ఆరోపణలకు బలం చేకూర్చారు. ఈసీ ఏమో తాము ఆ వీడియో రిలీజ్ చేయలేదు అంటోంది. దీంతో ఈ వీడియో క్రెడిబులిటిపైనే ఇప్పుడు డౌట్స్ తెరపైకి వచ్చాయి. కానీ వీడియోలో జరిగింది నిజం.. పిన్నెల్లి చేసింది నిజం.. అయితే ఈ వీడియోను లీక్‌ చేసి.. టీడీపీ నేతలు సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లారన్నది కూడా నిజం.

Also Read: ఆ ఇద్దరు వైసీపీ అభ్యర్థులకు భారీ షాక్.. !

పిన్నెల్లి వీడియో లీక్ కాగానే.. వైసీపీ అలర్ట్ అయ్యింది. దానికి ముందు జరిగిన ఘటనలు ఇవే అంటూ చకాచకా రిలీజ్ చేసింది. అందులో టీడీపీ నేతలు వైసీపీ నేతలపై చేస్తున్న దాడులు కనిపిస్తున్నాయి. మరి ముందే ఈ వీడియోలు ఎందుకు రిలీజ్ చేయలేదు అనేది బిగ్ క్వశ్చన్.. మీరు మాపై దాడులు చేశారు.. మేము ఈవీఎంలను బద్ధలు కొట్టాం.. చెల్లుకు చెల్లు అనుకున్నారా? అందుకే వీడియోలను ఇన్నాల్లపాటు దాచుకున్నారా? మొత్తానికి పిన్నెల్లి ఎపిసోడ్‌పై బరాబర్ చర్యలు తీసుకుంటారు.. అందులో నో డౌట్.. ఇక్కడ కొన్ని ప్రశ్నలకు ఆన్సర్ వెతకాల్సిన సమయం వచ్చింది. ఈ వీడియో లీక్ అయ్యింది కాబట్టి మాచర్ల పంచాయితీ గురించి తెలిసింది. మరి ప్రపంచానికి తెలియని విషయాల గురించేంటి? ఇప్పటికే చాలా చోట్లలో ఈవీఎంలు ధ్వంసమైనట్టు అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు చేసిన వారిలో వైసీపీ నేతలున్నారు.. టీడీపీ నేతలూ ఉన్నారు. మరి వారి ఆరోపణలపై ఈసీ ఫోకస్ చేస్తుందా? దర్యాప్తు చేస్తుందా?

విన్నారుగా టీడీపీ నేతలు బూత్ క్యాప్చరింగ్‌లు చేశారు అనేది వైసీపీ నేత అంబటి ఆరోపణ.. ఆయన ఇప్పుడు ఈ ఆరోపణలు చేస్తున్నారు. మరి ఇన్ని రోజులు దీనిపై ఎందుకు మౌనంగా ఉన్నారు? పిన్నెల్లి వీడియో బయటికి వచ్చింది కాబట్టి ఇప్పుడు టీడీపీ నేతలపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారా? అనే క్వశ్చన్స్ రెయిజ్ అవుతున్నాయి. ఏదేమైనా ఈవీఎంలు ధ్వంసం చేయడం అనేది నేరం.. ఈ నేరాన్ని ఏ పార్టీ నేతలు చేసినా తప్పే.. ఈసీ ఇప్పటికైనా ఈ దాడులపై ఫుల్ ఫోకస్ పెట్టాలి.
ఎక్కడెక్కడ దాడులు జరిగాయో లెక్కలు తీయాలి.. పబ్లిక్ డోమైన్‌లో పెట్టాలి. రాజకీయ నేతల నిజ స్వరూపాలను బయట పెట్టాలి. అప్పుడే ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు పూర్తి విశ్వాసం వస్తుంది.

Also Read: Bobbili Assembly Constituency: బొబ్బిలి యుద్ధం తప్పదా? హిస్టరీ…

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News